S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

08/24/2019 - 18:21

ఏడుకొండల ఎంకన్నను వీఐపీలు అంటే నిజంగా పెద్దమనుషులు వెళ్లినపుడు ఆలయం అధికారులు ఎదురువచ్చి ఆహ్వానం పలికే సంప్రదాయం ఒకటి ఉన్నది. మిగతా చోట్ల అంతా పూర్ణకుంభ స్వాగతం అని సలాంఛన స్వాగతం అని ఆ కార్యక్రమానికి పేరు. తిరుమల క్షేత్రం వారు మాత్రం ఇస్తికపాల అనే స్వాగతం పలికారు అని పత్రికలలో రాస్తుంటారు. ఈమాటకు ఎవరికీ అర్థం తెలియదు.

,
08/17/2019 - 18:56

పార్లమెంట్ ఎన్నికలకన్నా చాలా ముందు అంటే మార్చి నెల చివర్లో నేను ఒక వారం పాటు ఉత్తర భారతదేశంలో తిరిగాను. అది నిజానికి విహార యాత్రగా పథకం ప్రకారం చేసిన ప్రయాణం కాదు. మరొక అవసరం మీద ఒక పెద్ద మనిషి బయలుదేరితే అతనితోపాటు నేను కూడా వెళ్లి తిరిగాను. మొదట అహమదాబాదు వెళ్లాము. అక్కడి నుంచి రిషికేశ్, కురుక్షేత్ర, షిమ్లా, ఆ తర్వాత దిల్లీ. అంటే ప్రయాణం కనీసం ఐదు ఆరు రాష్ట్రాలలో సాగింది అని అర్థం.

08/10/2019 - 17:36

మనిషి చేతుల యొక్క లక్షణాల ద్వారా ఎవరికి వారిని ప్రత్యేకంగా చెప్పే పరిస్థితికి అమ్మ కడుపులోనే ఆరంభం జరుగుతుంది. అవే వేలిముద్రలు. పది నుండి పదహారు వారాల వయస్సులోనే వేలిముద్రలు మొదలవుతాయి. వాటి తీరు మీద జన్యువుల ప్రభావం ఉంది. శంఖాలు, చక్రాలు, ఇవిగాక ఆర్చెస్ అనే నిర్మాణాలు అన్నీ అక్కడే మొదలవుతాయి. పిండంగా ఉన్నప్పటి నుంచి చేతుల మీద పడిన వివిధ ప్రభావాల కారణంగా వీటి తీరు నిర్ణయం అవుతుంది.

08/03/2019 - 18:44

కొంతకాలం కింద నేను భారతదేశం పేరు జనగణమన లాంటి అంశాలను గురించి రాసినట్టు ఉన్నాను. లోకాభిరామం మొదలుపెట్టినప్పుడే ఇందులోని అంశాలకు ఒక పరిధి లేదని నిర్ణయం జరిగింది. కనుక నాకు ఆసక్తికరంగా తోచిన అన్ని సంగతులు రాస్తున్నాను. పాఠకులు ఆదరిస్తున్నారనే అనుకుంటున్నాను. భారతదేశం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపించాయి. అందరూ చదువుతారని చదవాలని నా కోరిక.

07/27/2019 - 18:36

ఊరికంతా అప్పిగాడు లోకువ, అప్పిగానికి నేను లోకువ అన్నాడట ఆ మహానుభావుడు ఎవరో, అప్పిగానికి తాను ఊరికి లోకువ అన్న సంగతి గురించి బాధ లేదు. తనకు కూడా ఎవరో ఒకరు లోకువ అయితే చాలు. ఇది ఒక అప్పిగానికి మాత్రమే సంబంధించిన విషయం కానే కాదు. మన దేశంలో అందరి మనస్తత్వం ఇట్లాగే ఉంటుంది. మానావమానములను సమానముగా చూడవలెనని సూత్రం చెప్పగలిగిన దేశం మనది. తుల్య నిందా స్తుతిర్మౌనేః అని గదా సూక్తి!

07/20/2019 - 18:41

ఒకసారి సంక్రాంతి పండుగకు నల్లగొండలో ఉన్నాను. అప్పటికి నేను రేడియోలో పని చేస్తున్నాను. ఆ సంవత్సరం పండుగ ఈనాడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలామందికి వచ్చింది. ప్రభుత్వం వారు ఒక సంగతి నిర్ణయించారు. కానీ సంప్రదాయ పనులు మాత్రం మరొక మాటగా నిర్ణయించుకున్నారు. రేడియో అన్నది ప్రభుత్వం వారి బాకా కనుక నేను వారు చేసిన నిర్ణయం ప్రకారం పండుగ ఫలానా నాడు అని వివరాలను ప్రకటించాను.

07/13/2019 - 20:08

అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అంటుంది మా యజమానురాలు. అక్కడికి ఆవిడ అదే పనిగా బయట తిండి తిన్నట్టు మాట్లాడిన భావం మీకు కలిగితే ఆ బాధ్యత నాది కాదు. అవుడ్ సైడ్‌లో ఏం దొరుకుతుందో కూడా తెలియదు. సాంబశివయ్య గారు బడిలో పిల్లలకు బజారు తిండి తినకూడదు అని భారీ ఎత్తున ఉపన్యాసం చెప్పి అదే సాయంత్రం బండి పక్కన నిలబడి రెణ్ణాల బజ్జీలు ఇయ్యవయ్యా, అన్నాడని మా విజయ చెప్పి తెగ నవ్వేది.

07/06/2019 - 18:39

మాట్లాడే మనిషికి ముఖ్యంగా ఉపన్యసించే మనిషికి తన చేతులను ఏం చేయాలో తెలియదు అంటారు. చేతులను అర్థవంతంగా, అర్థం లేకుండా కదిలించడం మనకు అలవాటు. ఇక ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు చిత్రకారులు మనుషుల చేతులను గీసిన లేదా రాసిన తీరు చూస్తే వాటిలోని వైవిధ్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ప్రసిద్ధులయిన చిత్రకారులు కూడా కొంతమంది ముఖాలను చిత్రించినంత జాగ్రత్తగా చేతులను కూడా చిత్రించారు.

06/29/2019 - 17:57

మానవజాతి చరిత్ర గురించి పరిణామం గురించి ఈ మధ్యన కొత్త పద్ధతిలో విశే్లషణలు చెప్పే పుస్తకాలు కొన్ని వచ్చాయి. వాటిని సంపాదించి చదువుతున్నాను. అలాగే మరొక పక్కన ఉర్దూ సాహిత్యంలో గజల్ పాత్ర గురించి చదువుతున్నాను. సీరియస్ విషయాలు చదువుతుంటే కొంచెం బుర్ర వాచిన భావన కలుగుతుంది. అటువంటి సందర్భంలో లైట్‌గా ఒకటి రెండు నవలలు చదవడం నాకు అలవాటు. పెర్రీ మేసన్ డిటెక్టివ్ నవల ఒకటి చదివాను.

06/22/2019 - 18:31

చింతామణి నాగేశ రామచంద్రరావు అంటే ఎవరో మీకు ఎంతమందికి తెలుసు. నాకు అనుమానమే. కానీ ఆయనకు భారతరత్న ఇచ్చిన రోజునే సచిన్ తెండూల్కర్ అనే మరొక అబ్బాయి కూడా అదే గౌరవాన్ని అందజేశారు. సచిన్ గురించి తెలియని వారు బహుశా ఉండరు అని నా అనుమానం. ఈ దేశంలో సైన్సుకు గల గౌరవం అటువంటిది. సి.ఎన్.ఆర్.రావు నిజంగా గొప్ప రసాయన శాస్తవ్రేత్త. ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద పేరు ఉన్న మనిషి.

Pages