S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

01/28/2019 - 22:38

లండన్‌ నుంచి ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్ అంటే మా అన్నయ్యగారి పెద్ద కొడుకు. అందరము కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకున్నాము. ఆ సందర్భంగా ప్రసాద్ ఒక వింత అనుభవం చెప్పాడు. ఒక పెద్ద మనిషి లండన్‌లో విమానం ఎక్కాడు. విమానం వాళ్లు ఒకటి రెండు చిన్న సంచులను మనతోపాటు వెంట తేవడానికి అనుమతిస్తారు. పెద్ద సంచులను వాళ్లు ప్రత్యేకంగా తీసుకుని వేరుగా పెట్టి మనకు కనిపించకుండానే మనతోపాటు తెస్తారు.

01/19/2019 - 23:41

పథికుడా, నీవు ఈ మార్గాన మరొకసారి నడచి రావేమొ కానీ, నీ పాదముద్రలు ఇందు కలకాలము నిలిచి యుండు.’ ఈ మాటలు ఎవరో అన్నవి కావు. నేనే అంటున్నాను. ఒక నిజమైన యాత్రికుడు మన ముందు నుంచి నడిచి వెళ్లిపోతాడు. అతను తిరిగి రాడు. కానీ కాలి గుర్తులు మాత్రమే ఉండిపోతాయట. కవిత్వ ధోరణిలో ఉన్నప్పుడు నా మనసులో సంచరించిన మాటలు ఇవి. అందరూ యాత్రికుల కాలి గుర్తులు అట్లాగే నిలుస్తాయి అంటే నాకు కూడా నమ్మకం లేదు.

01/12/2019 - 18:44

జీవులన్నిటిలోకీ మనిషి ప్రత్యేకం అన్నది మామూలు మాట. అది చెప్పడానికి నేను అవసరం లేదు. అందరికీ ఆ సంగతి అర్థమయింది. కనుక నేను పని గట్టుకుని మనుషులలో ఎవరికి వారే ప్రత్యేకం అని ఆధారాలతో సహా వారాలుగా చెపుతున్నాను. ఎన్నో ఉదాహరణలు చూపించాను. మీరు ఇప్పటివరకు ఈ అంశం గురించిన ముక్కలు చదవకున్నా ఇక్కడ మొదలుపెట్టి చదవండి.

01/05/2019 - 19:39

రాత్రి అంటే పగలు అనే తల్లికి అప్పుడే పుట్టిన నల్లని బిడ్డ. ఆ పాప నిద్రలేస్తుంది అన్న భయంతో లక్షలాది నక్షత్రాలు చుట్టూ చేరి నిశ్చలంగా నిలబడి చూస్తూ ఉన్నాయి, అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. ఆయన మరీ భావుకుడు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక రాత్రి పుట్టింది. మధ్యరాత్రి కొత్త సంవత్సరం వచ్చింది అన్నారు కానీ మామూలుగానే తెల్లవారినట్టు ఉంది. అంతా మామూలుగానే జరుగుతుంది.

12/29/2018 - 17:35

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కొన్ని పత్రికల వారు మామూలుగా సంవత్సరం చివరలో కొంతమంది పెద్ద వాళ్లను సంప్రదించి వారు ఆ సంవత్సరం చదివిన మంచి పుస్తకాలను గురించి రాయిస్తారు. నిజానికి పెద్దవారు మంచి పుస్తకాలను మాత్రమే చదువుతారు. అటువంటి చర్చలో కనిపించిన పుస్తకాలకు మరింత మార్కెట్ పెరుగుతుంది. ప్రచారం కూడా కలుగుతుంది. మన దగ్గర ఆ పద్ధతి పెద్దగా ఉన్నట్టు కనిపించదు.

12/22/2018 - 18:52

కర్ణాటక హిందుస్థానీ సంగీతం రికార్డింగులను సేకరించి పదుగురితో పంచుకోవడం చాలా సంవత్సరాలుగా నాకు ప్రవృత్తిగా సాగుతున్నది. కొంతమంది మిత్రులు ఈ సంగతి తెలిసిన వారు కనుక నాకు రికార్డింగులు పంపుతుంటారు. ఈ మధ్యన అనుకోకుండా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి రికార్డింగులు బోలెడు వచ్చాయి. అవి పంపిన వారి పేరు నాకు తెలియలేదు. తెలుసుకోవాలని అడిగాను.

12/15/2018 - 17:38

పోలిన మనిషి ఉండటం మామూలే అంటూ మొదలుపెట్టాము. కానీ మరొకరు లేరని ఉదాహరణలతో సహా చెప్పుకున్నాము. డిఎన్‌ఏ అనే జన్యు పదార్థం ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండదు. ఇక వేలిముద్రలు, ముఖం, నడక తీరు ఆధారంగా మనుషులను గుర్తిస్తున్నారు అంటే ఆశ్చర్యపడకుండా విన్నాము. చెవులు, కళ్లు, మాట, ధ్వని కూడా వేలిముద్రలలాగే వేరువేరుగా ఉంటాయని తెలిసింది. నాలాంటి వారు మరొకరు లేరు అనడానికి నిజానికి ఇవి చాలు.

12/08/2018 - 18:37

నాకు సినిమా రంగంలో పనిచేసే అవకాశాలు వచ్చాయి. కానీ నేనే వద్దని నిర్ణయించుకున్నాను. ఒక సందర్భంలో ఒకటి రెండు కథలు చెప్పాను. బాగున్నాయి, వీటిని మీ దర్శకత్వంలోనే సినిమాలు తీయవచ్చు కదా అని సీరియస్‌గానే ప్రతిపాదన వచ్చింది. ఎందుకు మానుకున్నానో, నాకు తెలియదు. ఈ మధ్యన ఒక నవల రాశాను. అది సినిమాకు బాగా పనికి వస్తుందని ఒకరికి ఇద్దరు అన్నారు. సినిమా ప్రపంచం వాళ్లను పరిచయం చేస్తాము అని కూడా అన్నారు.

12/01/2018 - 19:03

చాలా సంవత్సరాల తరువాత మా అబ్బాయి, అమ్మాయి, నేను, మా ఆవిడ నలుగురము కలవడం వీలైంది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అమ్మాయి సింగపూర్‌లో ఉంటున్నది. మేము ఇంట్లోనే ఉంటాము కాని, పిల్లలు అనుకున్నంత తరచుగా ఇంటికి రారు. వచ్చినా ఇద్దరూ ఒకేసారి రారు. ఎవరికి వారు ప్రయోజకులు అయ్యారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. మాయావిడ కూడా ఇంకా ఉద్యోగం చేస్తున్నది. నేనే తిని ఇంట్లో ఉంటాను.

11/24/2018 - 18:46

గడచిన సుమారు పది సంవత్సరాలుగా మా బాబు అమెరికాలో ఉంటున్నాడు. అయినా ఎందుకో గాని నాకు మాత్రం అమెరికా వెళ్లాలని అనిపించలేదు. మామూలుగా అందరూ తల్లిదండ్రులకు వచ్చే తప్పించుకోలేని తరువాతి తరం అవసరం కూడా మాకు రాలేదు. కనుక మేము అమెరికా వెళ్లాలని అనుకోలేదు. కానీ ఇనే్నళ్లకు ఇన్నాళ్లకు కేవలం సరదాగా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాము.

Pages