S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

11/02/2019 - 19:32

ఒడుపు అనే ఈ మాట ఎంత మందికి గుర్తుందో చెప్పలేను. చేతులకు ఈ ఒడుపు ఉంది కనుకనే మనిషి జాతి మిగతా అన్ని జంతువులకన్నా అందులో మిగతా ప్రైమేట్స్ కన్నా చాలా ప్రగతి సాధించగలిగింది. మనిషికి సాంకేతిక నైపుణ్యం చేతనైంది. పనిముట్లు తయారుచేసుకునే శక్తి అలవడింది. పనిముట్లు తయారు చేయాలంటే, ఎంతో ఊహాశక్తి ఉండాలి. అంతకన్నా ముందు చూపు ఉండాలి.

10/26/2019 - 18:28

లెక్కలు ఎక్కడికి పోయినయో తెలియదు. జీవితంలోకి సాహిత్యం, కవిత్వం ప్రవేశించాయి. సౌందర్య పిపాస అంతకన్నా ఎక్కువ ప్రవేశించింది. పెయింటింగులు, నిర్మాణాలను పరిశీలించడం ఒక లక్షణంగా నిలబడింది. అందమైన ఫొటోలు తీయడం హాబీగా నిలబడింది.
లెక్కలు బయటికి కనిపించకుండా అని ఒక క్రమం ఉంటుంది. సౌందర్యంలో కూడా ఒక లెక్క ఉంటుంది. అది తిక్క కాదు. అసలు సిసలైన అంకెల మీద ఆధారపడిన లెక్క.

10/19/2019 - 18:35

తొమ్మిదవ తరగతి అయిపోయింది. పదవ తరగతి నుంచి ఆపైన చదవబోయే రంగాన్ని ఎంచుకోవాలి. పదవ తరగతిలో మొదటి రోజు మామూలుగా గడిచిపోయింది. మరునాడు ఉదయానికి ఆప్షనల్స్ ఎంచుకునే అప్లికేషన్ ఇవ్వాలి. మా బడిలో అయిదు ఆప్షన్స్ ఉండేవి. వాటిలో ఒకటయిన వ్యవసాయం చదువుకోవాలని నాకు గట్టి కోరిక ఉండేది. మేము వ్యవసాయదారులం అని చెప్పుకోవడానికి నాకు ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంటుంది.

10/12/2019 - 17:33

మనిషికి చదువు, తెలివి, మనం, పట్టాలంటే తగిన వాతావరణం ఉండాలి. ఇంట్లో వాళ్లంతా ఒక రకంగా ఉంటూ పిల్లలను మాత్రం చదవండి అంటే వాళ్లకు అందులో రుచి కలగదు గాక కలగదు. కొన్ని కుటుంబాల సంగతి వేరు. బ్రాహ్మణులు అనగానే అందరూ దుమ్మెత్తి పోయడం బాగా నేర్చుకున్నారు. వాళ్లు వెనకటి ఏవో నేరాలు ఘోరాలు చేస్తే చేసి ఉండవచ్చు. కానీ మధ్యలో వాళ్లకు ఒక విషయం అర్థం అయింది.

10/05/2019 - 18:43

లోకాభిరామంలో చెప్పుకునే సంగతుల గురించి నేను పడుతున్న బాధ చాలా మందికి తెలుసు. అందరికీ కనీసం ఆసక్తికరంగా ఉండే సంగతులు అందించాలని ప్రయత్నం. నా జన్యుశాస్త్ర పరిశోధనలో భాగంగా కొంత మానవీయ శాస్త్రంలో ఆసక్తి కలిగింది. ఆ రకం సమాచారం మీకు కూడా అందించాలనిపించింది. నా వంతు నేను చేస్తున్నాను. తరువాత మీ ఇష్టం.

09/28/2019 - 18:35

‘ఏంవాయ్, మై డియర్ వెంకటేశం! ముఖం వేలవేశావ్’ అంటాడు గిరీశం తన శిష్యుడితో. ఆ అబ్బాయి తీరు చూస్తేనే నీరసంగా ఉన్నాడన్న సంగతి గురువుకు అర్థమయిపోయింది. ఎలెక్షన్‌లు జరగకముందే కొంతమంది నాయకుల ముఖంలో కనిపించిన వాలకం చూస్తే, ఇక ఈ వ్యక్తి గెలిచే అవకాశం లేదూ అన్న సంగతి ముందే అందరికీ అర్థమయి పోయింది.

09/21/2019 - 19:17

మనలను మనం మాటలతో మోసం చేసుకోగూడదు
- పెర్సివాల్ లోవెల్

09/14/2019 - 18:44

మనిషి మ ఒదటి నుంచి విజ్ఞత, విజ్ఞానం అనే స్థాయి తెలివి గురించి తపన పడుతున్నాడు. ప్రతి వ్యక్తిలోను ఇంటలిజెన్స్ అనే తెలిలి కొంత ఉంటుంది అనుకొన్నారు. అందుకు ఆధారంగా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది అనుకున్నారు. అంతరాత్మ బోధనతో మనిషికి తెలివి కలుగుతుంది అనుకున్నారు. కానీ చాలామంది లోపల గోల ఒకటే ఉన్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. నిజమైన విజ్ఞతను సంపాదించాలంటే అందుకు మరో మార్గాలు ఉన్నాయని మానవులు వెదకసాగారు.

09/07/2019 - 18:33

భాషలో విషయం ఉంటే చాలదు. దానికొక గమ్యం కూడా ఉండాలి - రెనీ డౌమాల్
* * *

08/31/2019 - 19:37

తనకేదీ తెలియదని తెలుసుకోవడమే మనిషి తెలివికి గమ్యం - జోసెఫ్ అడిసన్
* * *

Pages