S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమృత వర్షిణి
శాస్ర్తియ సంగీతమంటే మనకేదో అర్థంకాని బ్రహ్మ పదార్థమని కొందరి అభిప్రాయం. సంగీతాన్ని విచ్చలవిడిగా వదలకుండా, ఆ కళకు పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరిచి పెట్టారు. ఈ నియమాలు పాటిస్తూ పాడితే అది శాస్ర్తియ సంగీతం. అలాగే లలిత సంగీతంలోనూ కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించాలి. ఇందులో శాస్ర్తియ సంగీతం కంటే కొంత స్వేచ్ఛ ఉంటుంది.
స రళమై, సుందరమై, మృదుమధురమైన మన తెలుగు పద్యం ఎవరూ వీలునామా వ్రాసి ఇవ్వవలసిన అవసరం లేని ఆంధ్రుల ఆస్తి. పద్య సాహిత్యం మన తెలుగు భాషకే ఔన్నత్యాన్ని తెచ్చిన అద్భుతమైన ప్రక్రియ.
నన్నయాదిగా ఎందరో కవిశేఖరులు పద్య శిల్పాన్ని రమణీయార్థమైన సొగసులతో, శే్లష యమకాద్యలంకారాలతో సుసంపన్నం చేసి పెట్టి లోకానికి అందించారు.
భూగోళం జీవ వైవిధ్యానికి నిలయం. ఎక్కడ చూసినా అనేక రకాల పక్షులు, జంతువులు, క్రిమి కీటకాలు, ఉభయచర జీవులు ఎన్నో కనిపిస్తాయ. వీటితో పాటు పాములు కూడా కనిపిస్తాయి. భయంకరమైన విష సర్పాలతో పాటు, విషం లేని పాములు కూడా కనిపిస్తాయి. అయితే ఐర్లాండ్ దేశంలో మాత్రం మనకి ఒక్క పాము కూడా కనిపించదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
సంగీతం పేరు చెబితే సప్తస్వరాలు మనసులో మెదులుతాయి. ఎవరు మాట్లాడినా, సాహిత్యం ఆలోచనామృతం, సంగీతమాపాత మధురం లాంటి మాటలు వింటూనే ఉంటాం.
‘చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది సాహిత్యమే’ - ఈ మాటలన్నది తలపండిన సాహితీవేత్తా కాదు, ప్రఖ్యాత రచయిత అంతకన్నా కాదు. నాలుగంటే నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా - ఈ విషయం తెలిసిన ప్రపంచ పాఠక లోకం ఔరా అంటోంది. ఆడుతూ పాడుతూ అల్లరి చేసే వయసులో, పుస్తకాలన్నా, స్కూలుకెళ్లాలన్నా మారాం చేసే పిల్లలు అన్నిచోట్లా కనిపిస్తారు.
మాటకు ఎంత శక్తి ఉందో, శబ్దానికీ అంత శక్తీ ఉంటుంది. లేకపోతే నోరు లేని వాద్యాలకు చోటెక్కడ? సాహిత్యాన్ని అర్థం చేసుకుంటాం. సంగీతం ఆనందిస్తాం. సాహిత్యానికి అర్థం చెప్పగలిగినంత తేలికగా సంగీతాన్ని వివరించి చెప్పటం కష్టం. ఎవరి కంఠాల్లో స్వరాలు ఎటువంటి విన్యాసాలతో ఆనందాన్నిస్తాయో, ఎవరూ చెప్పలేరు.
నలువైపులా ఎత్తయన బురుజులు, నేటికీ చెక్కుచెదరని శిల్ప, చిత్రకళకు దోమకొండ గడికోట సజీవ సాక్ష్యం. రాజరికానికి గుర్తుగా, రాజుల అభిరుచులకు, పాలనకు అనువైన రీతిలో నిర్మితమైన ఈ కోట నాటి ప్రావీణ్యానికి, వైభవానికి ఓ ఆనవాలు. అత్యంత సుందరంగా నిర్మితమైన అద్దాలమేడ గడికోటకు ప్రత్యేక అందాలను తీసుకొచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం నిజాం కాలంలోని పెద్ద సంస్థానాలలో దోమకొండ సంస్థానం ఒకటి.
పాటకు పరవశించని వారుండరు. వీనుల విందైన పాటకు ఆకర్షణ సహజంగానే ఉంటుంది. పాటకు పరిమళాన్నిచ్చేది రాగమే. రాగం లేకుండా పాట తిన్నగా హృదయానికి చేరదు. సాహిత్య సరస్వతికి ‘నాదం’ చీర, పద సముదాయమంతా దేహం. అర్థం ప్రాణం. భావం ఆత్మ. వ్యవహారమంతా ‘నాదం మీదే ఆధారపడి ఉందంటా’రు ఆచార్య తిరుమల. గాయకుడు కవి కాకపోయినా ఫరవాలేదు. కానీ కవి హృదయంలో మాత్రం ఒక గాయకుడుండి తీరాలి. అజ్ఞాతుడైనా ఫరవాలేదు.
సత్యమైన ఆజ్ఞ మీద సామర్థ్యము కలదా!
భానురేయి పగలు రత్న సాను జుట్టడా!
పూనిశేషుడమిత భార భూమి మోయడా!
వీనులందు కాశీపతి నీ నామము పల్కడా!
వౌని త్యాగరాజ వినుత - మహిమాస్పద మగు నీ ముందు!
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమంటారు శంకర భగవత్పాదులు.
హృదయంలోని శోకమే సంగీతం అంటాడు తాత్వికవేత్త కన్‌ఫ్యూషియస్. పాట పాడి పదిమందినీ మెప్పించటం ఏమీ చిన్న విషయం కాదు. దానికి పడే శ్రమ వినేవారికంటే పాడేవారికే ఎక్కువ.
శాస్ర్తియ సంగీతం పాడే గాయకుడికి లలిత సంగీతం పాడేవారు లోకువ. లలిత సంగీతం పాడేవారికి సినిమా పాటలు పాడేవారు లోకువ.
ఈ ముగ్గురూ వినే శ్రోతకు ఇంకా లోకువ. ఇష్టమైతే వింటాడు. లేదా లేచి వెళ్లిపోతాడు.