S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమృత వర్షిణి
ఈ చరాచర సృష్టిలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. వాటిలో పరిశోధకులు నిగ్గు తేల్చి నిజం తెలుసుకున్నవి కొనే్న ఉన్నాయి. మరి కొన్నింటి వెనుక దాగిన నిజాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయటికి రాలేదు. ఆ వింతలకు అసలు కారణం ఏమిటో తెలియలేదు. అలాంటి వింతే అమెరికాలోని మిడిల్ కాలిఫోర్నియా సమీపంలో గల పానామింట్ పర్వత సానువులకు దగ్గరగా ఉండే డెత్‌వాలీ... మృత్యులోయలో జరుగుతోంది.
రామచంద్రుని గుణగణాలు, మహిమలు వర్ణించటం, తాను జీవితంలో పడిన కష్టాల్ని రాముడికి నివేదించడం, వీలు చిక్కినప్పుడల్లా తనని తాను నిందించుకుంటూ మనసుకి హెచ్చరికలు చేస్తూ మనస్ఫూర్తిగా పాడుకోవటం త్యాగరాజు దినచర్య. మనసు ఆవేదనతో నిండినప్పుడూ... పాటే, ఆనందంతో నిండినప్పుడూ... పాటే. అలా ఆయన గానం చేస్తున్నప్పుడు సాక్షిగా వున్నది ఒక్క తంబురాయే.
వాడి కళ్లల్లోకి సూటిగా చూడు
బుల్లి బుల్లి రెప్పల వెనుక స్వప్నాలు
పావురాళ్లలా ఎగురుతుంటాయ్
చిన్ని పెదాల మధ్యన నవ్వులో
వేలాది ఇంద్ర ధనుస్సులు వెలిగిపోతుంటాయ్
ముద్దు ముద్దు మాటల్లో
కాలం మైమరచి కరిగిపోతుంది
బుగ్గకి బుగ్గని జతచేస్తూ
పసివాడినోసారి పొదివి పట్టుకు చూడు
పులకించిన దేహమంతా
పునరుత్తేజమయ్యే ..అనుభూతి
మాటలే కవికీ మూటలూ
గుండెల మీటలూ
నాదమే కవికీ మోదమూ
మూడవ వేదమూ..
నార్లవారి ఈ పాట కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ గాయని పి.సుశీల పాడింది. పాటలోని మాటలన్నీ సుశీల కంఠంలోని మాధుర్యంతో తడిసిపోయి గుండె లోతుల్ని తాకే ఈ పాట, నేనెప్పుడు విన్నా ‘అప్పుడే విన్న అనుభూతి’ కల్గుతుంది.
అందుకే అర్థవంతమైన మాటలు, సారవంతమైన సంగీతంతో కలిస్తేనే సార్థకత -
అధికార దాహం, యుద్ధకాంక్షతో సరిహద్దు దేశాల్ని ఆక్రమించుకుని తమ రాజ్యాలను విస్తరించుకునే ధోరణి పలు దేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని దేశాల కంటే తమ దేశ సైన్యమే అతి పెద్దదనే ట్యాగ్‌లైన్ తగిలించుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటాయ కూడా. అందుకు చక్కటి ఉదాహరణ చైనా. ఈ దేశ సైనిక శక్తి ప్రపంచంలోని అన్ని దేశాల సైనికశక్తి కంటే పెద్దది. చైనా సైనిక బలం 16,00,000.
ఈ చరాచర విశ్వంలో మనిషి ఉనికి ఎప్పుడు మొదలయింది? ఎక్కడ తొలి మానవుడు ఉద్భవించాడు? అనాదిగా శాస్తవ్రేత్తలు చెబుతున్నట్లు మనిషికి ఇతర జీవులకు సంబంధం ఉందా? ఇటువంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు. వందలు, వేల మంది శాస్తవ్రేత్తలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఘనాపాటిలైన ఎందరో మేధావులు ఈ విషయాలను కూలంకషంగా తెలుసుకుని నిగ్గు తేల్చడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు.
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులట ఇందరిలో
పరమాత్ముడు వెలిగే
గగనానిల తేజో జల భూమయమగు
ఖగమృగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగ రాజాది ఆశ్రీతులలో పరమాత్ముడు వెలిగే
రేడియో కోసమే పుట్టి రేడియోకే తమ జీవితాలను అర్పణ చేసిన వారిలో చరితార్థులైన వారెందరో ఉన్నారు. నిజానికి వారెప్పుడో చేసి ఉంచిన కళాఖండాలే ఈ వేళ రేడియో ప్రతిష్టను నిలబెట్టి ఉంచుతున్నాయనటంలో సందేహం లేదు. కొన్ని ప్రమాణాలను
నిర్దేశించి, చక్కని దిశను దశనూ ఏర్పరచి వెళ్లారు. ఆ
మహామహుల అనన్య కృషి వల్ల రేడియోకు ఒక స్థిరత్వం ఏర్పడింది.
వెనిస్ ఆఫ్ ది నార్త్ అని ముద్దు పేరున్న గీతూర్న్‌లో మనకి ఎక్కడికక్కడ అందమైన కెనాల్స్ కనిపిస్తాయి. 1230లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ఇది సహజసిద్ధమైన అందాలతో అలరారుతూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కనిపెట్టిన సమయంలోనే మేకల అరుపులు వినిపించాయట. అందుకే దీనికి గీతూర్న్ అని పేరు పెట్టారు. అంటే మేక అరుపు అని అర్ధం. ఇక్కడ మనకు కార్లు కనిపించవు.
ఒకప్పుడు కార్ల వాడకం లగ్జరీ. కానీ నేడది అనివార్యం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని దశాబ్దాల క్రితం నాటికి నేటికీ వాహనాల పెరుగుదలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని ఒక వైపు పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా కార్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.. కాస్త ఆర్థికంగా పట్టు చిక్కిన ప్రతి కుటుంబం నేడు కారు వాడకం వైపే మొగ్గు చూపుతోంది. కారు వాడకం అంటే అదో స్టేటస్ సింబల్ మరి.