S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

04/06/2019 - 22:42

ఏదైనా ఒక ఉన్నతమైన ఉదాత్తమైన నిగూఢమైన విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏవేవో ఉపమానాలు తీసుకొచ్చి, ఉదాహరణలతో చెప్పినా సరిపోనప్పుడు తెలివైన ప్రబుద్ధులు ప్రదర్శించేది వౌనమే. మానవ జీవితానికి అర్థం చెప్పుకోవాలన్నా, ప్రశాంతంగా, ఏకాంతంలో స్థిరచిత్తంతో కూర్చుని ఆలోచించినా విన్నా వౌనంలోంచే సమాధానం లభిస్తుంది. వౌనాన్ని అర్థం చేసుకోగలిగేది ఒక్క మనిషే. పశు పక్ష్యాదులకు ఈ అవసరం లేదు.

03/30/2019 - 19:09

ప్రముఖ సినీ దర్శకుడు బాపుగారితో నాకున్న అనుబంధం స్నేహం, ఒకనాటిది కాదు. మా ఇద్దర్నీ కలిపినది ఘజల్ సంగీతం. బహుశా హిందుస్థానీ సంగీతం ఆయన విన్నంత ఏ సంగీత దర్శకుడూ విని ఉండకపోవచ్చునేమో!

03/23/2019 - 18:50

మనసులో సంగీత ప్రసక్తి రాగానే కొన్ని పట్టణాలు, అక్కడ పుట్టి పెరిగిన మహా విద్వాంసులు గుర్తుకు రావటం సహజం.
తంజావూర్ జిల్లా పేరు చెబితే మూర్తి త్రయం గుర్తుకొస్తుంది. సంగీత ప్రియులకు ఆ మహనీయులు తిరిగిన ప్రాంతాలు చూడాలనుకోవటం సర్వసాధారణ విషయం. ఎక్కడెక్కడో పుట్టి మొత్తం దేశంలోని సంగీత రసజ్ఞులందరినీ ప్రభావితం చేసి, కీర్తినీ, అఖండ ఖ్యాతినీ పొందటం కన్నా విశేషమేముంటుంది.

03/16/2019 - 18:24

సమాజ స్థాయి పెంచగోరినప్పుడల్లా దేవదేవుడు మహనీయుల రూపంలో వ్యక్తమై ప్రముఖులని, పెద్దలను ముందుకు సాగమని వెన్నుతట్టుతుంటాడు.
మహాత్మాగాంధీ దీనికి మంచి ఉదాహరణ. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతూ సమాజాన్ని ముందుకు నడిపించాడు - లోకం అటువంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవటంలో ఆశ్చర్యంలేదు.
స్వలాభాపేక్షతో స్వార్థబుద్ధితో దేశసేవ చేస్తామని నీతులు చెప్పే వాళ్లను నమ్మటమే ఆశ్చర్యం కలిగించే విషయం.

03/09/2019 - 20:31

1948 జనవరి 31వ తేదీ, భారతజాతి నివ్వెరబోయిన రోజు, విషణ్ణ వదనాలతో చింతాక్రాంతమైన రోజు. ‘జాతిపిత’ మహాత్మాగాంధీ బిర్లా మందిరం నుండి ప్రార్థన ముగించుకుని వస్తూండగా ఒక అజ్ఞాత వ్యక్తి అమాంతం ఎదురుబడి మహాత్మునికి నమస్కరించిన ఉత్తర క్షణంలో తుపాకీ కాల్పుల శబ్దంతో మారిపోయిన వాతావరణం. ‘హేరామ్’ అంటూ వౌనంగానే రోదిస్తూ నేలకొఱిగిన జాతిపిత.

03/02/2019 - 19:02

శృతితో పాడటం వేరు. శృతిలోనే మునిగి పాడటం వేరు. తేడా వుంది.

02/23/2019 - 19:36

సంగీతంలో పైకి కనిపించని గుణమొకటుంది. ఏ మాత్రం కాస్త పాడగలిగే వారికైనా వారి పాట మీద వారికెంతో భయంకర నమ్మకం.

02/16/2019 - 18:46

లోకంలో దైవదత్తంగా లభించిన సంగీత విద్య నభ్యసించిన కొందరు సంగీత విద్వాంసులు తమకు తాము చాలా గొప్పవారమనే స్వోత్కర్షతో బ్రతుకుతూ పటాటోపాన్ని ప్రదర్శిస్తూంటారు. అవతలి వారిలో వున్న కాస్త గొప్పతనాన్ని కొండంతలుగా చేసి, ఆ మహా విద్వాంసుల ముందు ‘మేమెంత’ అనే అణకువ భావంతో తమ గొప్పతనాన్ని కాసె్తైనా బయటకు ప్రదర్శించని మహా విద్వాంసులు బహు అరుదు.

02/09/2019 - 19:01

వెనుకటి రోజుల్లో ఆంధ్రులంటే అసహాయ శూరులని కొందరూ, కాదు, ఆరంభశూరులని మరి కొందరూ అంటే వినీ విననట్లుగా ఉండేవాళ్లం.

02/02/2019 - 17:40

‘అబ్బా! సెక్రటరీ! ఎప్పుడూ పనులూ, బిజినెస్సేనా? పరగడుపునే కాస్తంత పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ?
- ఔనండి!
ఔనంటూ తలూపడం కాదు. (ఆకాశం వైపు చూస్తో) కళ్లట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్లు లేదూ? ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ?
- అద్భుతం సార్!

Pages