S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

03/25/2017 - 23:28

రాజరాజేశ్వరి ఒంటరి జీవితం వెనుక ఉన్న అనుమానాలు మొత్తం తొలగిపోయాయి. తన దర్యాప్తు వివరాలు కలెక్టర్‌కి వివరించేడు యుగంధర్. రాజరాజేశ్వరి చెల్లెలు సుకాంతి విశాఖపట్నంలో ఉందని తెలిసింది కాబట్టి మరోసారి పేపరు ప్రకటన ఇస్తే ఫలితం ఉంటుంది, ఈ లోపు తను దర్యాప్తు కొనసాగిస్తానని చెప్పాడు.
* * *
సాయంకాలం నాలుగైంది.

03/18/2017 - 22:12

14
నాతవలస సెంటర్.
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సొకటి ఆ సెంటర్‌లో ఆగింది. పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఒకతను బస్సు దిగాడు. జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకి రెండువైపులా విస్తరించిన ఊరది. ఆ సెంటర్లో రోడ్డు మీద బడ్డీ కొట్లున్నాయి.
ఆ కానిస్టేబుల్‌కి ఓ ఆటోవాలా నమస్కారం చేశాడు. అతన్ని దగ్గరకి రమ్మని తలూపేడు కానిస్టేబుల్.
‘ఈ మధ్య కనిపించడం లేదేం?’ అడిగేడు.

03/16/2017 - 00:10

చెప్పరా చిన్నోడా?’
గంగోత్రి గొంతు వినిపించాక అతను చెప్పాడు.
‘ఇంటర్వ్యూలో కొంతమందిని సెలెక్ట్ చేశాను’
‘గుడ్..’
‘వారిలో రానా అనే యువకుడు పోలీసు ఇన్‌ఫార్మర్...’

03/04/2017 - 21:06

ఇంట్లో చెప్పి వెళ్లలేదా?’ ప్రశ్నించేడు రాజేష్.
‘లేదు బాబూ! మధ్యాహ్నం మూడున్నరకి బయలుదేరాడు. ఇంతవరకూ రాలేదు. ఫోన్ చేస్తుంటే అందుబాటులో లేదని జవాబు వస్తోంది. వివేక్ తల్లి, తండ్రి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసుస్టేషన్‌కి వెళ్లారు’

02/26/2017 - 04:21

ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?’
‘ఆ సంవత్సరం రికార్డు చూడాలి’
అతనితోపాటు ఊరు మధ్య ఉన్న డిగ్రీ కాలేజీకి వెళ్లాడు యుగంధర్. ప్రిన్సిపాల్‌ని కలిసి విషయం చెప్పాడు. రికార్డులు చూపించడానికి అంగీకరించలేదతను. తన ఐడెంటిటీ కార్డు, కలెక్టర్ ఇచ్చిన లెటర్ అతని ముందుంచాడు యుగంధర్.

02/18/2017 - 23:15

తనని పెంచినామెతో ఒకసారి ఆ దేవాలయానికి వెళ్లాడు గంగోత్రి. ఎందుకో అక్కడ జరిగే తంతు నచ్చలేదతనికి. అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగకి దూరంగా ఉంటాడు. తన వారిలో ఎవరైనా అరవాన్ దేవాలయానికి వెళ్లాలని, ఆ దేవుడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అడ్డు చెప్పడు. తరాల నుంచి పాతుకుపోయిన నమ్మకాన్ని మార్చలేనని తెలుసు కాబట్టి తన పెద్దరికం నిలుపుకోవడానికి పది మందిని ప్రతి ఏడూ అరవాన్ దేవాలయానికి పంపుతాడు.

02/12/2017 - 04:46

11
రంగరాజు రామచంద్రరాజు గారి ఇల్లెక్కడండి?’ అడిగేడు యుగంధర్, తనకి ఎదురైన ఓ మనిషిని.
‘తెలియదు’ చెప్పి, ఆగకుండా వెళ్లిపోయాడతను.

02/04/2017 - 21:13

అతని చేతులు యంత్రంలా పని చేసుకుపోతున్నాయి. ఒక్కొక్క పార్టు వివేక్ మృత శరీరం మీద పడుతోంది. ట్యాంకులోని పెట్రోలు గోతిలో పోసి ఖాళీ ట్యాంకుని అందులో పడేశాడు. మరికొన్ని కట్టెలు తెచ్చి గోతిలో పేర్చాడు. చేతులకి అంటిన మట్టి దులుపుకుని వాటర్ బాటిల్ అందుకుని నీళ్లల్లో కలిపిన ఓడ్కా కొంత తాగేడు. సిగరెట్ ముట్టించి రెండు దమ్ములు లాగి ఆకాశంలోకి చూశాడు. చీకటి పడటానికి ఇంకా సమయం ఉన్నట్టు గుర్తించాడు.

01/29/2017 - 04:06

పదేళ్ల నుంచండి’
‘ఆమెకి బంధువులు ఎవరైనా ఉన్నారా?’
‘నాకు తెలియదండి. నిజం చెప్పాలంటే ఆమె ముఖం నేనెప్పుడూ చూడలేదు. పొద్దున్న పాలు పట్టుకెళ్లి తలుపు కొడితే ఓ రెక్క తెరిచి గినె్న పెడుతుంది. పాలు పోసేక తనకి అవసరమైన సరుకుల చీటీ, డబ్బులు ఇస్తుంది. మర్నాడు పాలతోపాటు సరుకులు ఇస్తాను’ వివరించేడతను.
‘బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసేవాడివా?’
‘చేసేవాడినండి’

01/21/2017 - 21:43

విశాఖపట్టణంలోని హిజ్రాలంతా అతన్నొక దైవంలా చూస్తారు. ఎలాంటి అవసరం వచ్చినా తమని ఆదుకునే మనిషి ఉన్నాడన్న భావం వారిలో ఉంది. గంగోత్రిని పెంచి పెద్ద చేసిన హిజ్రా చనిపోయినప్పుడు అక్కడ వారంపాటు కార్యక్రమాలు నిర్వహించాడు. చిన్న, పెద్ద తగవులు తీర్చేది అతనే. కష్టం వస్తే ఆదుకునేది కూడా అతనే! ఎవరికైనా జబ్బు చేస్తే కేర్ హాస్పిటల్‌లో వైద్యం చేయించగలడు.

Pages