S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

09/09/2017 - 23:37

వినూత్న ప్రయత్నాలతో అందర్నీ ఆకట్టుకోవడం కొందరికి సరదా. మరికొందరికి అది వృత్తి. ఇదిగో ఇక్కడ అలాంటి ఔత్సాహికుడే కనిపిస్తున్నాడు. మాస్కోలో జరిగిన రెడ్‌బుల్ టుల్గాటబ్ ఫెస్టివల్ సందర్భంగా కొందరు ఎగిరే వస్తువలను సొంతంగా తయారు చేసి ప్రయోగాత్మకంగా నిరూపించే ప్రయత్నం చేశారు. కొందరు ఫ్లయింగ్ సాసర్ మాదిరి ఆకృతులు తయారు చేస్తే ఒకరు ఇలా బాటిల్ మాదిరిగా ఫ్లయింగ్ మిషన్‌ను తయారు చేసి ఎగిరే ప్రయత్నం చేశాడు.

09/09/2017 - 23:35

జింకల జాతికి చెందిన భారీ జీవి మూస్. మాములుగా గోధుమవర్ణంలో ఇవి ఉంటాయి. పూర్తిగా తెల్లగా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన వైట్‌మూస్ స్వీడన్‌లోని వార్మల్ ల్యాండ్‌లో నెమ్మదిగా కదులుతూ కనువిందు చేసింది.

09/09/2017 - 23:33

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో ఏటా ఎడిన్‌బరో ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఆ నగరానికి సమీపంలో ఓ కొలను ఉంది. అక్కడ ఎక్కువగా బాతులు ఉంటాయి. అందుకే దానిని స్వాన్ లేక్ అంటారు. తెల్లగా అందంగా మెరిసిపోయే బాతులను పోలినట్లు దుస్తులు ధరించి కొందరు ఈ ఉత్సవానికి కొత్తకళను తీసుకువచ్చారు. ఆ దుస్తులతో టుటు డాన్సర్లు నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.

09/05/2017 - 22:50

లండన్‌లో ఏటా జరిగే సూపర్ కామిక్ షో అదిరిపోయింది. వివిధ కార్టూన్ కార్యక్రమాలు, కామిక్ పుస్తకాలు, షోలలో ప్రజాదరణ పొందిన పాత్రల మాదిరిగా వేషధారణలు, అలంకరణలు చేసుకుని హాజరయ్యే ఔత్సాహికులకు ఇది ఓ అద్భుతమైన పండుగ. చిన్నాపెద్దా ముసలీముతకా ఎవరైనా తన ఇష్టమైన కామిక్ పాత్ర వేషధారణలో పాల్గొనవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి ఇందులో పాల్గొనవచ్చు. ప్రధాన నిబంధల్లా ఏమిటంటే.

09/05/2017 - 22:49

ఉడతల మాదిరిగా కనిపిస్తున్న ఈ రెండు కోతుల బరువును ఇక్కడ కొలుస్తున్నారు. లండన్ జూలో ఉన్న ఈ రెండు స్క్విరల్ మంకీస్ సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. లండన్ జూలో జంతువులు, పక్షులు, ఇతర ప్రాణుల లెక్కలు ఏటా గణిస్తారు. ఆ సమయంలో వాటి బరువు, ఆరోగ్యం ఇత్యాది వివరాలను నమోదు చేస్తారు. అందుకోసం ఇక్కడ వాటిని
తూనికపై ఉంచారన్నమాట.

09/05/2017 - 22:48

చైనాతో దౌత్యబంధం ఏర్పడి పదేళ్లయిన సందర్భంగా కోస్టారికాలో కొందరు ఔత్సాహికులు ఇలా ప్రదర్శన ఇచ్చారు. అయితే వీరంతా దివ్యాంగులు. శాన్‌జోసె నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సుమారు 20మంది మహిళలు ఇలా ప్రదర్శనలో తమ ప్రతిభ చాటారు.

08/28/2017 - 22:32

ఈ ఫొటోలను కళ్లప్పగించి చూస్తున్నారు కదూ!. అద్భుతమైన ఈ దృశ్యాలను కెమెరాల్లో బంధించడం ఆషామాషీ కాదుకదూ! ప్రఖ్యాత నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ ఇటీవల నిర్వహించిన నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2017లో బహుమతి పొందిన చిత్రాలు ఇవి. ఓ అగ్నిపర్వతంపై పిడుగుపడటం, ఆ వెంటనే ఆ పర్వతం విస్ఫోటనం చెందడం కొన్ని క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.

08/28/2017 - 22:30

పసికందులకు స్నానం చేయించడానికే చాలామంది భయపడుతూంటారు. అలాంటి ఈజిప్టులోని కైరో నగరంలో పసికందులకు ఈతలో పాఠాలు నేర్పించే స్కూల్ ఒకటి ఈ మధ్య ప్రారంభమైంది. దానికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. మూడు నెలల నుంచి ఏడు నెలల మధ్య వయస్సున్న పిల్లలకు మాత్రమే ఇందులో ప్రవేశం. తల్లిదండ్రులు దగ్గరుండి వారికి ఈత నేర్పవచ్చు. ఎలా నేర్పించాలో వారికి ఓ ట్రైనర్ తర్ఫీదు ఇస్తాడు.

08/28/2017 - 22:28

వింత ఒక కొత్త. చైనాలోనూ అదే జరిగింది. ప్రకృతి పరిరక్షణ విషయంలో చైతన్యం కోసం చేపట్టిన వినూతన కార్యక్రమం ఇది. ఆకుపచ్చటి బీరుసాలతో చెట్లను పోలినట్లు అమర్చారు. స్టీల్‌పోల్స్‌ను ఏర్పాటు చేసి వాటి కొక్కేలను బిగించి, ఆ కొక్కేలకు ఆకుల్లా బీరుసీసాలను పెట్టారన్నమాట. దూరం నుంచి చూస్తే అది ఓ వనంలా కనిపిస్తుంది. ఇది చైనాలోని కింగ్‌డావోలో గత ఏడాది ఏర్పాటు చేశారు.

08/21/2017 - 23:35

జిరాఫీలు బాగా ఎత్తుగా ఉంటాయి. చాలా ఎత్తుగా పెరిగే అకేషియా చెట్ల ఆకులు వాటికి బాగా ఇష్టం. అయితే కెన్యాలోని ఎడారిలో ఓ అకేషియా చెట్టువద్దకు జిరాఫీ చేరింది. దాని శరీరం అంతా చెట్టుచాటున ఉంటే ఎదుటివైపునుంచి చూసినవారికి దాని చెట్టుపై జిరాఫీ తల మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫొటో ఇంటర్నెట్‌లో ఎక్కువమందిని ఆకర్షించింది.

Pages