S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

01/13/2018 - 16:45

పండుగ వచ్చిందంటే పిల్లలకు నిజంగా పండుగే. సంక్రాంతి పండుగ వస్తే ఇల్లంతా పండుగే. ఊరంతా పండుగే. ఈ మూడు రోజుల పండుగలో ఆనందం ఉంది. అల్లరి ఉంది. ఆరోగ్యం ఉంది. సరదా ఉంది. సంతోషం ఉంది. కలుపుగోలుతనం ఉంది. కలివిడితనం ఉంది. ప్రకృతి అందాలున్నాయి. పర్యావరణ హితం ఉంది. కళ ఉంది. నమ్మకం ఉంది. ఆరాధన ఉంది. ఆధ్యాత్మికత ఉంది. ఎన్ని విశేషాలు.. ఎంత విశిష్టత.. మూడు రోజుల పండుగలో ఎన్నో పరమార్థాలున్నాయి.

01/06/2018 - 19:53

నేషనల్ జియాగ్రాఫికల్ ఛానల్ గత నెలలో కొన్ని ప్రసారాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని ఛాయాచిత్రాలను తీయించింది. వాటిలో ఇక్కడివి ప్రేక్షకాదరణ పొందాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో కనిపించిన ఒకరకపు కుక్కగొడుగులు నిజానికి ఫంగీ. ఇవి కొన్ని రకాల జీవులకు ఆహారం. ఇదేదో చిత్రకారుడు గీసిన బొమ్మలా ఉంది కదూ! ఈ చిత్రాన్ని లాన్స్ ఐజాక్సన్ తీశాడు.

01/06/2018 - 19:51

భారత్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి పుడమిపై మంచుదుప్పటి పరచింది. కేదారనాథ్, గంగోత్రి వంటి పుణ్యక్షేత్రాలు ఇప్పుడు ధవళవర్ణపు మంచులో కొత్త సొబగులతో కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇక్కడకు యాత్రీకులను అనుమతించరు. ఆలయాలను ఆరునెలల పాటు మూసిన ఒకటి రెండు రోజుల తరువాత ఆ ప్రాంతాల్లోనే ఉన్నవారు ఈ చిత్రాలను తీశారు.

12/23/2017 - 18:08

ఈ పెద్దాయన పేరు అనిరుథ్ తాంత్రిక్. ఆయన శిష్టుడు యదుకృష్ణ. ఈ యువ అర్చకుడి వయసు 21. కేరళలోని మనప్పురమ్ మహాదేవాలయంలో పెరుమాళ్ సేవలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందంటే.. ఉందనే చెప్పాలి. ట్రావెన్‌కోర్ దేవస్థానం పరిధిలోని 1248 ఆలయాలున్నాయి. అందులో శబరిమల అయ్యప్ప ఆలయం కూడా ఒకటి. ఇప్పుడు తన పరిధిలోని ఆలయాల్లో 36మంది దళితులకు అర్చకులుగా అవకాశం ఇచ్చారు. వారిలో యదుకృష్ణ ఒకరు.

12/23/2017 - 18:07

నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మధ్య 2017 ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించింది. వేలాది ఎంట్రీలు వచ్చాయి. వాటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. బహుమతి పొందిన ఛాయాచిత్రాలను వారి పత్రిక, వారి ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశారు. మొదటి విజేతకు పదివేల అమెరికన్ డాలర్ల బహుమతి ఇచ్చారు.

12/16/2017 - 19:48

ఈ శునకానికి అమర్చిన ప్రత్యేక పరికరానికి ఓ విశిష్టత ఉంది. శునకం చూసే దృశ్యాన్ని మనం కూడా దానితోపాటే ఒకే సమయంలో చూసే అవకాశం ఉంది. అందుకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని మనం వాడాలి. అది మాస్క్‌లోంచి చూస్తున్నప్పుడు మనం రిమోట్ సహకారంతో ఆ డివైజ్‌ను వాడి ఆ దృశ్యాన్ని చూడొచ్చు. అదే సమయంలో మనం శునకానికి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు.

12/16/2017 - 19:46

చైనాలోని లాంగ్‌ఫంగ్ అనే చిన్న నగరంలోని హోటల్ ఇది. హెబీ ప్రావిన్స్‌లో ఇది ఉంది. 41.6 మీటర్ల ఎత్తున ఉన్న ఈ మూడు విగ్రహాల రూపంలో హోటల్ భవనాన్ని నిర్మించారు. ఈ మూడు విగ్రహాలు ముగ్గురు దేవతలవి. ఫు- అదృష్ట దేవత, లు-వైభవ దేవత, షు-దీర్ఘాయువు ఇచ్చే దేవతకు గుర్తు. పది అంతస్థుల ఎత్తులో ఈ విగ్రహాల రూపంలో హోటల్ ఉంటుంది. అనేక ప్రత్యేకతల రీత్యా ఈ హోటల్‌కు గిన్నిస్‌లో చోటు దక్కింది.

12/16/2017 - 19:45

ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఒక్కోసారి అందమైన దృశ్యాన్ని చూసినవెంటనే దానిని కెమెరాలో బంధించాలనిపిస్తుంది. కానీ చాలామందికి అవకాశం రాదు. అలాంటి అవకాశాలను వదులుకోని, అలాంటి అవకాశాల కోసం కాచుకుని ఉండేవారి కోసం నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ ఏటా పోటీ నిర్వహిస్తుంటుంది. నేచర్ విభాగంలో జరిగిన పోటీకి వచ్చిన ఎంట్రీలు ఆహా అనిపిస్తున్నాయి.

12/02/2017 - 19:28

గుర్రపునాడాలతో ఓ భారీ డ్రాగన్ రూపాన్ని ఆవిష్కరించాడు సర్రేకు చెందిన కళాకారుడు జిమ్ పొడ్‌మాన్. పనె్నండేళ్లపాటు శ్రమించి దాదాపు 50వేల గుర్రపునాడాల ఆకారంలోని ఉక్కుముక్కలతో ఈ ఐరన్ డ్రాగన్‌ను రూపొందించాడు. సర్రెలోని ఫరాన్వమ్ స్కల్ప్చర్ పార్క్‌లో దీనిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అక్కడ ఆ కళాఖండం ఓ పెద్ద ఆకర్షణగా మారింది.

12/02/2017 - 19:26

అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రంలోని ఓ గోర్జీ అందచందాలు ఇవి. ద్రోన్ సహాయంతో డేవిడ్ స్విండ్లర్ అనే ఫొటోగ్రాఫర్ దీనిని చిత్రీకరించాడు. నేషనల్ జియాగ్రాఫిక్ ఛానల్ నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీకి తన ఎంట్రీగా ఈ చిత్రాన్ని పంపాడు. గోర్జీలోపల పచ్చని తివాచీ పరచినట్లున్న మొక్కలు, చెట్టుచేమ, ఎతె్తైన మట్టిగోడలు వింతైన అందాన్నిస్తున్నాయికదూ!

Pages