S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

01/12/2020 - 23:50

అయ్యవారు ఉగాధి సంచిక కోసం ఎంతో ముందుగా పథకాలు వేసేవారు. మూడు నెలల ముందు చెప్పారు - సినిమాల మీద సంవత్సరాది సంచికకి వ్యాసం తయారుచెయ్యమని. ఇది ఒక ‘కితాబు’ నాకు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు 1910లో మొదలయిన నాటి నుంచీ, శంభుప్రసాద్ గారు 1972లో యిహ లోక యాత్ర చాలించేదాకా ఒక ‘అద్భుతం’ లాగా రాణించాయి. అవి దాచుకునే సంచికలే గానీ తూకానికి వేసే పాత పేపర్లతో వెళ్లిపోయేవి కావు.

01/05/2020 - 23:51

నాకు తెలిసినంత వరకు హింధీ, ఇంగ్లీషు సామెతల కన్నా తెలుగు సామెతలు చాలా పవర్‌ఫుల్. మన వాటిలో చరిత్ర, జాగ్రఫీ మరియు జీవన సత్యం కూడా తొణికిసలాడుతుంటాయి. ఉదాహరణకు ‘‘కూర మంచి కుండ చేదు’’ అన్న సామెత ఉంది. గొప్ప చేదు నిజాన్ని దైనందిన జీవితంలో ఆవిష్కరిస్తుంది. నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు ఎంత పూసుకు రాసుకు తిరిగినా నువ్వు చేదుకుండవే. నీ పనివాడితనం బాగుంటే అది కూర మంచి. నీ గొప్ప కాదు.

12/29/2019 - 23:48

నిజంగా ఆంధ్రపత్రిక వీక్లీని ఎడిటింగ్ చెయ్యడంలో నేను తృప్తిగా ఎంజాయ్ చేసిన టైము- మద్రాసుకి సంబంధించినంత వరకు నేరుగా అయ్యవారి పర్యవేక్షణలో పని చేసినప్పుడే జరిగింది. చీఫ్ శివలెంక శంభూప్రసాద్ గారిని - అయ్యవారు అని అందరూ అంటే అయ్యర్ అని కుంచిత పాదంగారు రిఫర్ చేసేవాడు. ఎస్సార్ గారుఅంటే రాధాకృష్ణ గారిని బాస్ వచ్చాడేమో చూడండి అని నేను ఒక్కడినే అనేవాడిని!! ఏమంటున్నాడు మావాడు?

12/22/2019 - 23:43

ఇంటర్వ్యూస్ అన్నీ కూఢా వెళ్లిపోయిన తిరిగిరాని మధురమైన ప్లాట్‌ఫారం లేదా రోమన్ హాలిడే లాంటివి.. కానీ నాకే కాదు పాఠకులకు కూడా అవి ఇష్టమైన జ్ఞాపకాలే.

12/15/2019 - 23:06

అరుణాఛలం అగ్ని లింగంగా వాసికెక్కిన అరుణాచలేశ్వరుని గుడికి మద్రాసు నుంచి మోటారు శకటం మీద నాలుగు గంటలు పట్టింది -లింగ దర్శనం కన్నా గిరిప్రదక్షిణకి గ్రేడు ఎక్కువట.. కానీ కనీసం పది కిలోమీటర్లు చుట్టి రావాలి. పిక్కబలం ఉన్నవాడికే నాల్గు గంటలు పడుతుంది - ఇక్కడి శివాలయంలో అయిదు ప్రాకారాలున్నాయి..

12/14/2019 - 23:16

అధి 1963 ఆగస్టు నెల - మొదటి వారం - నేను ‘తెర మీద - తెర వెనుక’ కోసం శ్రీమతి అంజలీదేవితో విస్తారమైన ఇంటర్వ్యూ పూర్తి చేసుకొనే సరికి రాత్రి పది దాటింది. అంజలీదేవి ఆదినారాయణ దంపతులు ఇద్దరూ.. భోజనం చేసి వెళ్లాలని పట్టుబట్టారు - పోనీ రేప్పొద్దునే్న - మా డ్రైవర్ దింపేస్తాడు - అన్నదామె అమిత వాత్సల్యంగా.. నాన్నగారు ఈ రాత్రికి నిద్రపోరు - పోతానండీ.. భోజనం పూర్తిగా ఆత్మీయం. డ్రైవర్ని పిలిపించిందామె.

11/30/2019 - 23:11

ఓకే రోజు ,నేను ‘‘ప్రెస్’’ లోనుంచి అక్కడ పేజీలు గాత్ర చూసుకొని నా బల్ల
ముందు చిన్న డ్రామా జరిగి పోతోంది .. మా సెల్ లోకి వచ్చేస్తో వుంటే ,మా

11/23/2019 - 23:21

ఫాఠకులు చాలా సెన్సిటివ్‌గా, చురుకుగా వున్నప్పుడు పత్రికా సంపాదకుల మీద వేరే ‘నియంత్రణ’ అక్కరలేదు. గుంటూరు నుంచి ఎన్. సూర్యారావు అనే పాఠకుడు ఓ కార్టూను మీద మమ్మల్ని నిలదీశాడు. అది ఇలా వుంది. ‘మీ వారపత్రిక (17.4.64)లో కాఫీ హోటల్స్‌లో సర్వారాయుళ్లు చేయు ఆలస్యాన్ని హాస్య పూర్వకంగా తెలుపుతూ ఒక కార్టూన్ ప్రచురించారు.

11/16/2019 - 23:13

నిజమే, తెర మీధ తెర వెనుక శీర్షికకి -అంజలి, భానుమతి, సావిత్రిల సరసన -నాట్య తారకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాము -కారణం ఈ మాటలోనే వున్నది- ఆమె నాట్యతార-కేవలం సెట్స్ మీదనే కాదు - నిజజీవితంలో కూడా ... తన ట్రూప్‌తో దేశంలోనూ విదేశాలలోనూ కూడా పర్యటించాలి.

11/09/2019 - 18:28

ఉధ్యోగరీత్యా ఎంతోమందిని కలిసి సంభాషిస్తాం. ప్రతిసారి అది ‘థ్రిల్’ ఇవ్వదు. కానీ 1963, నవంబర్ 14న వాలెంతినా తెరెష్కోవాతో కరచాలనం చేసి కేవలం అయిదు నిమిషాలే సంభాషించిన నేను ఇప్పటికీ ఆ మధుర క్షణాల స్ఫురణతో మురిసిపోతుంటాను. ఎక్కడ ప్రప్రథమ రోదసీ మహిళ? ఎక్కడ నేను? ఆమె నాడు పతీసమేతంగా మద్రాస్ వచ్చింది.

Pages