S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

09/08/2018 - 18:51

మేకలు ఛదువుతాయా? అనుకోకండి. అవి ఏ ఆకులు కొమ్మలు వాటికి తటస్థపడితే అవే నమిలేస్తాయి. అట్లా చిన్నప్పుడు ఏది దొరికితే అదే - పొట్లాల కాగితాలు సహా చదివేసేవాణ్ని. మా రోజుల్లో సంచులు ప్లాస్టిక్ బ్యాగులు గట్రా లేవు. పాత న్యూస్ పేపర్లకి గొప్ప డిమాండ్ - పప్పులైనా ఉప్పులైనా పత్రికల కాగితాలతోనే పొట్లాలుగా తెచ్చుకోవాలి. ఉదారంగా పేపర్‌లో పేపర్ దన్నుగా పెట్టి - మరీ ప్యాక్ చేసేవాళ్లు..

09/01/2018 - 18:27

హెఢ్డింగ్ ‘స్టిక్కు’లో కూర్చి పెట్టుకుని వచ్చి రెండు అక్షరాలు మించింది.. పీకి పడేస్తున్నా.. లెక్కపెట్టి హెడ్డింగు పెట్టుమీ అనేవాడు - గొప్ప ఇది చేసేవాళ్లం మేమంతా అతన్ని. అయ్యవారు మాత్రం ‘పోరా.. నాకు చూపెట్టకు.. పోరా.. అవతలికి విసిగించకు..’ అనేవాడు. ఆయన మాటల్లో ఎంత అనురాగమో? వాత్సల్యమో? అయ్యవారు అంటే శంభుప్రసాద్‌గారు.

08/25/2018 - 17:42

కోట్లాది రూపాయలు ఖరీదు చేసే సరుకులు వస్తువులు వున్న గూడ్స్ గోడౌన్లు మొత్తం లూటీ అయిపోయాయి. సబ్బులు, పౌడర్లు, పప్పులు, రకరకాల సామాన్లు మొత్తం అన్నీ దోచేస్తున్నారు.. తగలబెట్టేస్తున్నారు.. నేనూ నా బ్యాచ్ - పోలీసు ఫైరింగ్ మొదలయిందన్న వార్తలకి - చలించిపోయి భయం వెంటాడగా ఇళ్లకేసి పరుగులు తీశాం. పదోక్లాసు పిల్లలం ఏమి చెయ్యగలం? మూకలతో కలిసి దోపిడీ చెయ్యకుండా ఆగగలమేమో కాని - దోపిడీని ఆపగలమా?

08/19/2018 - 07:04

నా అదృష్టం తప్ప వాడు హిందీ సినిమా రౌడీయే.. మా పెడ్రో తలచుకుంటే వాడ్ని తన్నగలడు. కాని భయస్తుడు. మంచోడు. తప్పించుకొనేవాడు కోటిగాన్ని.
ఆ రోజు స్కూలు ఆర్చీ కింద కూర్చున్నాడు మా వాడు. అందరం ఆడుకుంటున్నాం. నంది (కుంటుడు ఆట)లో వున్నాను నేను.

08/04/2018 - 20:59

నిజంగా బురఖా లేసుకుని వచ్చే వాళ్లంతా ఆడోల్లేనా? మా ‘పాండు’గాడి డౌటు.. మొత్తానికి, ఆడపిల్లలు అంటే నాకు ఎంత సిగ్గో వాళ్లకి అంత బెటర్ చనువు... మిత్రా నెల మొదటి మీటింగులో నో లెక్చర్ అన్నాను. అసలు సంగతి సిగ్గు. ఒక్కోరికి ఒక్కో రోజు వంతున పత్రిక ఇవ్వాలి. ఒక్కటేగా కాపీ.. ఆనక కావాలంటే మళ్లీ రొటేట్ చెయ్యాలి. కొత్తగా, మద్రాసు పత్రికల్లో ‘స్పోర్ట్స్ అండ్ పాస్ టైమ్’ని చేర్చాలి.

07/28/2018 - 18:14

స్వతంత్ర, వాహిని, జమీన్ పత్రిక - నెల్లూరు పత్రిక కూడా మా దాడి తప్పించుకోలేక పోయాయి. మా వూరి ‘బొమ్మల బస్తీ’ని కూడా వొగ్గలేదు మేము. గృహలక్ష్మికి ఆంధ్ర మహిళ పోటీ. నాకూ రెంటితో భేటీ. మాతృసేవ అనే దానిలో నెలనెలా వ్యాసం మస్టూ.. కానీ ఇది కాదు నా మొదటి ‘కాలం’. చెబుతా తర్వాత.

07/21/2018 - 21:09

‘రేపు వస్తుంది అబ్బాయ్.. గ్యారంటీ.. అన్నాడు జాలిగా ఇంకా అక్కడే నిలబడ్డామని - చూసి.

07/21/2018 - 21:08

మా చిన్న అమ్మమ్మ - ప్రక్క బిల్డింగేగా పరిగెట్టాను.
ఆ మాస్టారి పిలక తీసేసి అతని చేతిలోనే దిబ్బరొట్టెతో కలిపి పెడతానంటూ ఆవిడ నన్ను వెనుక వేసుకురావడం-

07/08/2018 - 00:11

ఇంచిపేట మొత్తానికి ఇస్మాయిల్ కిరాణా కొట్టు పెద్దది. అదో సూపర్ మార్కెట్టు. కానీ దుకాణంలో ఎప్పుడూ సుభాన్ భాయి మాత్రం ఉంటాడు. జనం అంతా నాలాంటి పిల్లకాయలే.. కిటకిటలాడేది షాపు. అమ్మ కాని మామ్మ కానీ - నన్ను చిన్న సామాన్లు - ముఖ్యంగా కొబ్బరికాయ - చక్కెర, బెల్లం, సగ్గుబియ్యం గట్రా తెమ్మంటే - జటకా మీద టకాటకా గుర్రాన్ని లొట్టలు వేసి అనుకరిస్తూ తోలుకుంటూ వెళ్లిపోవడమే. నడవడం లేదు..

07/01/2018 - 02:36

విఢీ విడని చిక్కులు నన్ను ఆంధ్రపత్రికలో ఉద్యోగానికి అక్షరాల తీసుకుపోయి చేర్పించాయి - విడీ విడని చిక్కుల కోరల్లో చిక్కిన సమాజంలాగే నేను చిక్కుల్లో ఇరుక్కుపోయాను అనే అనాలి. ఆ నవల రాసిన నాకు అది కెరీర్ ప్రదాయిని అవడం అదో తమాషా. దీని కారణంగా, ఆంధ్ర పత్రిక కొలువులో చేరిపోయిన నాకు జర్నలిస్టుగా మారిపొమ్మని రాసిపెట్టి ఉన్నందున, అది అడుగడుగునా ఛాలెంజ్ చేస్తూ వుండడం చేతా, సారీ..

Pages