S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

08/24/2019 - 18:16

కొన్ని ఫొందటానికి కొన్ని పోగొట్టుకోవాలి అంటారు - కానీ తాళం చెవి పారేసుకోవడం అటువంటిది కాదు. కానీ నాకదో చెత్త అలవాటు - మెరీనా బీచ్‌కి వెళ్లాను. ఒంటరిగా వెళ్లడం ప్రాక్టీస్ చెయ్యాలనిపించింది. మహానగరంలో ‘పారిస్ బస్సు’ పట్టుకుంటే చాలు గూటికి చేరుతాను. వస్తానన్న సభాపతి రాలేదు - చాలా రోజులైంది. వైజాగ్ స్కాండల్ పాయింట్ గుర్తుకొచ్చింది. ఏకాంతం కోరింది మనసు. మద్రాస్‌లో డిసెంబర్ నెల చిత్రంగా ఉంటుంది.

08/17/2019 - 18:50

ఆ రోజులు వేరు. రూఫాయికి బోలెడు విలువ. ఆం.స.వా. పత్రిక ఏడాది చందా పదమూడు రూపాయలు. విడి ప్రతి పావలా. రైలు - టపా అయితే - కానీ, విదేశాలకు రేట్లు ఇలా ఉండేవి. ఓడ టపా (సముద్రం మీద స్టీమర్‌లో) బ్రిటన్, జర్మనీ, ఐరోపాలకు, ఆఫ్రికన్ దేశాలకు అయితే 114 రూపాయలు.

08/10/2019 - 17:29

పోతనగారన్నట్లు ‘హాలికుడయననేమి? కౌద్దాలికుడయిననేమి?’ అని నేను ‘వర్కో’హాలికుడనయినాను. కంబైన్డ్ ఫ్యామిలీలో కొత్త కోడలు పాత్ర నాది.. అనేవాణ్ణి నవ్వుతూ. ఆంధ్రపత్రిక వీక్లీ వద్దన్నవాణ్ణి దాన్ని వదిలి నా సొంత ఊరు బెజవాడకి డైలీకి బదిలీ అయిపోయినప్పుడు దానిని వదల్లేక వలవలా విలపించాను. తిరిగి 73లో అదే ‘వీక్లీ’ వచ్చిన నన్ను చుట్టుకుంటే కుమిలి కుమిలి ఏడ్చి డైలీ కోసం మొద్దుబారిపోయాను.

08/03/2019 - 18:35

ఇంటర్నెట్ రావఢానికి చాలాకాలం ముందు ఒక్క సినిమాయే- మూడు అక్షరాల తారకమంత్రం. ఊరు ఊరా నా పేరేనోయ్ చిన్నవాడా.. గోడ గోడా బొమ్మేనోయ్!.. నేను సిన్మా స్టారునోయ్ చిన్నవాడా! 63 ఫిబ్రవరిలో తెరమీద - తెర వెనుక శీర్షిక మొదలుపెట్టాము. దీనికి ముందు చాలా స్పీడ్ వర్క్ (సన్నాహక పని) చేశాము.

07/27/2019 - 18:33

అరవై రెంఢులో వారపత్రికకి మారడానికి ముందు దినపత్రిక ఉదయం షిఫ్టులో వున్నప్పుడు వడపళనిలోని విక్రమ్ స్టూడియోకి ‘పెళ్లి తాంబూలం’ సినిమా ప్రీవ్యూకి బయలుదేరాను. ‘సాయంకాలం మూడు గంటలకే వేసేస్తాం’ జనవరి నెల కదా? లేట్‌నైట్ ఇండ్లకు పోడం కష్టం’ అన్నారు. బేబీ టాక్సీలు దొరకవు. దొరికినా, ఆఫీసు - ఆటోకి మాత్రమే ‘పే’ చేస్తుంది. విజయా లాడ్జి నుంచి బ్రహ్మాండం నరసింహారావుకి ఫోన్ చేశాను. ‘చిత్ర’ పత్రిక బాస్ అతను.

07/20/2019 - 18:37

దినపత్రికలో ఉన్నప్పుడు ఆదివారం నాడు కూడా ఎస్.ఆర్.గారు ఆఫీసుకి రావడాన్ని గమనించేవాణ్ని. మా ‘బిల్డింగ్’ నాలుగో అంతస్తు బాల్కనీలో నుంచి ఆం.ప్ర. రాధాకృష్ణగారి రూమ్ కిటికీ, ఐ మూలగా చూస్తే కనబడేది. లైటు వెలగడం, రూములో అలికిడీ అవి గమనించి - ఓ గంట ఆగి క్రిందికి వచ్చి - దారి కాసేవాణ్ని. అంటే, మా ‘బిల్డింగు’ ముందు మెట్ల మీద నిలబడితే చాలు ఆయన కారు ఎక్కించుకునేవాడు. ‘అమృతాంజన్ ఎం.డి.

07/06/2019 - 18:34

సంఘజీవనంలో తలమ్ముకున్న బ్రతుకుల్లో రెండు రకాల స్వేచ్ఛలుంటాయి. ఒకటేమో మైదానం మధ్యలో ఒక ‘రాట’పాతి - దానికి, నిన్నో తాడువేసి కట్టి - ‘ఏలుకో ఈ పరిధి అంతా నీదే!’ అనడం. రెండోది - గదిలో నిన్ను పెట్టి, ‘ఇదంతా నీదే యధేచ్ఛగా ‘తిరుగు’ అనడం.

06/29/2019 - 17:51

కొత్త శీర్షికలకి అంకురార్పణ ఆంధ్రపత్రికయే చేసినప్పటికీ - నేను చేరిన ‘అరవై’లలో వెనక్కి తిరిగి చూస్తే, మనం ఇవాళ ప్రతి పత్రికలోనూ అతి ముఖ్యంగా చూస్తున్న వ్యంగ్య చిత్రాలు (కార్టూన్లు) చాలా అరుదుగా నాటి వీక్లీలో కనబడతాయి - ఒకటీ అరా తప్ప. కానీ తలిశెట్టి రామారావుగారు ఆద్యుడు. ఆయన కార్టూన్‌కి పెట్టిన పేరు ‘సరస చిత్రకల్పనం’. అలాగే ఇంటర్‌వ్యూలు కూడా వుండేవి. వాటి పేరు ‘సంభాషణం’.

06/22/2019 - 18:26

నాటి పాఠకుడు మృష్టాన్న ప్రియుడు!
1962 సెప్టెంబర్ ఏడు వీక్లీ సంచిక ‘హమేషా తమాషా’ శీర్షికలోని ఒక జోకు: ఇది నాకు ఇష్టం... ఇక వీక్లీని ప్రేమించడం మొదలుపెట్టాను...
ప్రశ్న: లట్టూ! ఒరేయ్! ఇది చెప్పరా?! మీ అమ్మ మాట మీ నాన్న వింటాడా? లేక మీ నాన్న మాట మీ అమ్మ వింటుందా?
జవాబు: ఇద్దరి మాటా వీధిలో వాళ్లు వింటారు!...

06/15/2019 - 17:21

ఆంధ్రపత్రిక ‘వీక్లీ’ 1908లో పుట్టింది. అది ‘అక్క’. డైలీ 1914 నుంచీ ప్రచురణ అయ్యింది. ఇది ‘తమ్ముడు’ - ఆంధ్రపత్రిక వీక్లీలో నేను డైలీలో వుండగానే 1962 ఏప్రియల్, 24 సంచిక నుంచీ నా ‘విడీవిడని చిక్కులు’ నవల సీరియల్‌గా ప్రచురణ మొదలయింది. అది పధ్నాలుగు వారాల పాటు సచిత్ర వారపత్రిక పాఠకుల్ని - అనుకున్న దానికన్నా - ఎక్కువగా ఆకర్షించింది.

Pages