S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/04/2017 - 00:02

విజయవాడ (బెంజిసర్కిల్), సెప్టెంబర్ 3: రాష్ట్ర రాజకీయాలకు కేంద్రమైన బెజవాడ రాజకీయాల్లో మరో దుమారం రేగింది.

09/04/2017 - 00:00

విజయవాడ, సెప్టెంబర్ 3: తెలుగువారి పట్ల పదేపదే చిన్నచూపు చూస్తూ బిజెపి అగ్ర నాయకత్వం తీవ్రంగా అవమానించటం గర్హనీయమని పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు.

09/03/2017 - 23:59

విజయవాడ, సెప్టెంబర్ 3: వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతంరెడ్డి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురికావటం ఆయన వర్గంలో ఆగ్రహం నింపింది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీచేసిన గౌతంరెడ్డిని తర్వాత కొద్దికాలానికే ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి తూర్పులో ఓటమిపాలైన వంగవీటి రాధాకృష్ణను నియమించడంతోనే ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

09/03/2017 - 03:35

తిరుపతి, సెప్టెంబర్ 2:తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్టప్రతితో పాటుగా ఆయన సతీమణి సవితాకోవింద్, కుమారుడు ప్రశాంత్‌కుమార్, కుమార్తె స్వాతి, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు అమరనాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు తదితరులు ఉన్నారు.

09/03/2017 - 03:32

తిరుపతి, సెప్టెంబర్ 2: రాష్ట్రంలోని 2వేల దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కల్పనకు దేవాదాయ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తనను కలిసిన విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ధూప,దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను గుర్తించామని తెలిపారు. వీటి అభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు.

09/03/2017 - 03:31

విశాఖపట్నం, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఇక మీదట ఎక్కడ ఎన్నికలు జరిగినా నంద్యాల, కాకినాడలో ఫలితాలే పునరావృతమవుతాయని పలువురు మంత్రులు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన విశాఖ రూరల్ జిల్లా టిడిపి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప, ఆర్ అండ్‌బి మంత్రి అయ్యన్న పాత్రుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.

09/03/2017 - 03:30

మదనపల్లె, సెప్టెంబఠ్ 2: మదనపల్లె వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ ఎటిఎంను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి రూ.25లక్షలు చోరీ చేశారు. చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కూటవేటు దూరంగా ఉన్న నక్కలదినె్న ఎంట్రన్స్ ఈద్గా ఎదురుగా జాతీయరహదారి పక్కనే ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎంను ఏర్పాటుచేశారు.

09/03/2017 - 03:30

సీతానగరం, సెప్టెంబర్ 2: విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసలో శనివారం దారుణం చోటుచేసుకుంది.

09/03/2017 - 03:29

కర్నూలు, సెప్టెంబర్ 2: నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం అధికార తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినట్లయింది. గడిచిన మూడేళ్ల కాలంలో అధికార టిడిపిపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికలు వస్తే ఆ పార్టీ ప్రజల ఎదుట దోషిగా నిలబడటం ఖాయమని వైకాపా అధినేత జగన్ అనేక దఫాలు చెప్తూ వచ్చారు.

09/03/2017 - 03:28

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 2: పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది..తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పశువుల మూగ రోదనతో మారుమోగుతోంది. లారీల్లో లెక్కకు మించిన పశువులను మడతపెట్టి కుక్కేసి రవాణా చేస్తున్నారు. కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిలో తుని మొదలు రావులపాలెం దాటేవరకు ప్రతి రోజూ వేలాది పశువులు వాహనాల్లో కుక్కి తీసుకు వెళ్ళడం సర్వసాధారణంగా మారింది.

Pages