S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/03/2017 - 02:25

విజయనగరం, సెప్టెంబర్ 2: ప్రపంచంలో భారత విమానయాన రంగం పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం ఆయన దత్తత గ్రామమైన నెల్లిమర్ల మండలం సారిపల్లి వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ గత మూడేళ్లలో విమానయాన రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.

09/03/2017 - 02:23

సాలూరు, సెప్టెంబర్ 2: విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఒక ప్రైవేటు స్కూల్లో విద్యార్థిపై ఆ స్కూల్ ఉపాధ్యాయురాలు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. తాడావారి వీధిలో ఉన్న దీప్తి స్కూల్లో రెండో తరగతి చదువుతున్న జె.తరుణ్ బుగ్గలపై పాఠశాల ఉపాధ్యాయురాలు లావణ్య చెప్పుతో కొట్టడంతో ఆ బాలుడి బుగ్గలు కందిపోయాయి.

09/03/2017 - 02:21

రేణిగుంట, సెప్టెంబర్ 2: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి ఆలోచనలు భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను ఇరిగేషన్ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.

09/03/2017 - 02:21

కాకినాడ, సెప్టెంబర్ 2: కులాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి పక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధులకు జనం బ్రహ్మరథం పట్టడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు రుజువైందన్నారు.

09/03/2017 - 02:20

పలాస, సెప్టెంబర్ 2: శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి 466 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసిందని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను మీడియాకు శనివారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసారు.

09/03/2017 - 02:18

విశాఖపట్నం, సెప్టెంబర్ 2: రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, ఇది స్థిరంగా ఉందని విశాఖ తుపా ను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు, ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.

09/03/2017 - 02:17

విశాఖపట్నం, సెప్టెంబర్ 2: నూజివీడు ఐఐఐటిలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్‌జియుకెటి వైస్ ఛాన్సలర్‌ను శనివారం ఆయన ఆదేశించారు. విద్యా సంస్థలో ర్యాగింగ్ సంఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

09/03/2017 - 02:17

కడప, సెప్టెంబర్ 2: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద శనివారం ఆయన కుటుంబసభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఘనంగా నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఉదయమే ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

09/03/2017 - 00:37

అమరావతి, సెప్టెంబర్ 2: ఇటీవల జరిగిన రెండు కీలక ఎన్నికల్లో టిడిపి భారీ విజయం సాధించడంలో మంత్రులు కీలకపాత్ర పోషించారు. నంద్యాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శిద్దా రాఘవరావు కాకినాడలో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చక్రం తిప్పి పార్టీ అభ్యర్ధులను విజయతీరాలకు చేర్చారని పార్టీ తాజా విశే్లషణలో తేలింది.

09/03/2017 - 00:36

విజయవాడ, సెప్టెంబర్ 2: వంట గ్యాస్ సబ్సిడీ పూర్తిస్థాయిలో తొలగింపునకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. 2018 మార్చి మాసాంతానికికల్లా సబ్సిడీ పూర్తిగా మాయం కానుంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వంట గ్యాస్‌కు సంబంధించి పలు సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సాలీనా 12 సిలిండర్లు దాటితే సబ్సిడీ లేదు. రూ.10 లక్షలు ఆదాయం దాటిన వారికి కూడా సబ్సిడీ లేదు.

Pages