S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/05/2017 - 02:00

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా
కడియం పల్లవెంకన్న నర్సరీలో మొక్కలతో తీర్చిదిద్దిన అద్భుత ఆకృతి

09/05/2017 - 01:58

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది.

09/05/2017 - 01:58

విజయవాడ, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత మూడేళ్ళుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని సంస్థ చైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు.

09/05/2017 - 01:57

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో ఆర్థిక నగరాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. ఈ నగరాల నిర్మాణం 18 నుంచి 24 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పట్టణ వౌలిక సదుపాయాల ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది.

09/05/2017 - 01:57

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: తెలుగు రాష్ట్రాల వివాదాస్పదంగా ఉన్న ఉమ్మడి సంస్థల విభజన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటి సమావేశం వాయిదా పడింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృతంలోని కమిటీ సోమవారం నాడు సమావేశం కావల్సి వుంది. కాని కొంతమంది అధికారులు గైర్హాజరు కావడంతో కమిటి సమావేశం వాయిదా వేశారు.

09/05/2017 - 01:56

విజయవాడ, సెప్టెంబర్ 4: పోలవరం పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ఆ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ అయిన ట్రాన్స్‌ట్రాయ్‌కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్ట్ పనుల నుండి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

09/05/2017 - 01:56

కాకినాడ, సెప్టెంబర్ 4: ఇసుక అక్రమ తవ్వకాలకు, అమ్మకాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేయాలని తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇసుక అక్రమాలను వాట్సాప్ గ్రూపులో ఉంచడం ద్వారా అక్రమాలకు పాల్పడేవారికి చెక్ పెట్టవచ్చని, దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయి అధికారుల వరకు మానిటరింగ్ చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.

09/05/2017 - 01:55

విజయవాడ, సెప్టెంబర్ 4: కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులు రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం, అంతర్గత జల రవాణా మార్గాల ఏర్పాటు వంటి కీలక అంశాలకు ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

09/05/2017 - 01:54

విజయవాడ, సెప్టెంబర్ 4: బతుకుదారి చూపిన గురువులను ఘనంగా సత్కరించడంలో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని, చదువు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి గౌరవించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గురుపూజోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరిస్తున్నామన్నారు.

09/05/2017 - 00:29

అమరావతి, సెప్టెంబర్ 4: పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, తమ సొంత పార్టీ నేతలపై సాగిస్తున్న వేధింపులు చివరికి పార్టీ పుట్టిముంచే ప్రమాద దిశగా తీసుకువెళుతోందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీని ప్రక్షాళన చేయాలన్న తలంపు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను చూసి బాబు భయపడుతున్నారని, పార్టీ ఎమ్మెల్యేలకు అధినేత అంటే భయం పోవడానికి అదే కారణమని పార్టీ సీనియర్లు విశే్లషిస్తున్నారు.

Pages