S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/02/2017 - 01:44

విజయవాడ (పటమట) సెప్టెంబర్ 1: ఆక్వా రంగంలో రాష్ట్రం నుంచి ఏటా 37 వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయని, అలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై వుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆక్వా రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగంపై శుక్రవారం విజయవాడలోని ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

09/02/2017 - 01:49

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్రంలోని దేవాలయాలకు వస్తున్న భక్తులు, యాత్రికులను దృష్టిలో పెట్టుకుని తగు వసతి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేలా ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు.

09/02/2017 - 00:02

అమరావతి, సెప్టెంబర్ 1: తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా, నేటి యువతకు మార్గనిర్దేశకత్వం చూపగలిగేలా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆనంద లహరి పేరిట వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసిందని ఆ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల మూడవ తేదీన రాష్ట్రావ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ విశేష కార్యక్రమం జరగనుందని శుక్రవారం తెలిపారు.

09/02/2017 - 00:01

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పది గ్రామాల్లో భూ సేకరణకు సంబంధించి సిఆర్‌డిఏ జారీ చేసిన నోటిఫికేషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. వంద మంది రైతుల అభ్యంతరాలను తాజాగా స్వీకరించాలని హైకోర్టు సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించింది. జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

09/02/2017 - 00:00

విజయవాడ, సెప్టెంబర్ 1: దైవ ప్రవక్త అజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈద్-ఉల్-జహా (బక్రీద్) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

09/02/2017 - 00:00

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో ప్రతిపక్ష వైకాపా త్వరలోనే గల్లంతవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఫలితాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం పట్ల శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.

09/01/2017 - 23:59

అమరావతి, సెప్టెంబర్ 1: పరిష్కారవేదిక 1100 ప్రజలకు ఒక పదునైన ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం తన నివాసం నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, బెల్ట్‌షాపుల నియంత్రణపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అన్ని రీచ్‌ల వద్ద పకడ్బందీగా నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు.

09/01/2017 - 23:58

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులకు 58 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

09/01/2017 - 23:56

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పౌర్ణమికి ముందు సముద్రం పాటు ప్రభావంతోపాటు ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో దిగువనున్న ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరిగింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 27 అడుగులకు చేరుకున్న గోదావరి వరద అక్కడ నుంచి తగ్గుముఖం పట్టి, శుక్రవారం సాయంత్రానికి 24 అడుగులకు చేరింది.

09/01/2017 - 23:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో పారిశుధ్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు ప్రమాణాల్లో అత్యత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను 21 పాఠశాలలు దక్కించుకున్నాయి. తమిళనాడు, ఆంధ్రా, రాజస్థాన్ రాష్ట్రాలు వరుసగా టాప్ మూడు స్థానాలలో నిలిచాయి.

Pages