S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/17/2017 - 02:43

విశాఖపట్నం(క్రైం), జూలై 16: ‘మేల్ టూ మేల్ (స్వలింగ సంపర్కం) పేరుతో ఫేస్‌బుక్ ఖాతాని సృష్టించి, ఓ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.రెండు లక్షలు వసూలు చేసిన ఐదుగురు యువకులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎంవిపి కాలనీకి చెందిన తాడి రాహుల్ (24) ఫేస్‌బుక్‌లోని మేల్ టూ మేల్ (స్వలింగ సంపర్కం)ఖాతాకు ఆకర్షితుడయ్యాడు.

07/17/2017 - 02:41

తిరుపతి, జూలై 16: దేశానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఎంతో ఆశగా ఎదురుచూసి, 19 సంవత్సరాలు నిరీక్షించిన 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థి మారుసాని నాదమునిరెడ్డి తన ఆశలను చంపుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

07/17/2017 - 02:41

మధురవాడ, జూలై 16: సముద్రంలో మునిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన రాహల్ పండిట్(29), నోవెల్ ఉపాధ్యాయ(26) ఆదివారం విశాఖ వచ్చారు. స్నేహితులు అక్బర్, పయాజ్, మరొక వ్యక్తితో కలిసి మొత్తం ఐదుగురు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. సరదాగా సముద్రంలోకి స్నానానికని దిగిన వీరు మునిగిపోయారు.

07/17/2017 - 02:40

మార్కాపురం, జూలై 16: ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు. సిఐ కథనం మేరకు.. మార్కాపురం మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన వేములకోట గ్రామానికి చెందిన పెద్దక్క అనే మహిళ శనివారం ఓ కేసు విషయంలో జంకె ఇంటికి వెళ్లగా మందలించి గన్‌మేన్‌తో బయటకు నెట్టించారని ఫిర్యాదు చేసిందన్నారు.

07/17/2017 - 02:40

కాకినాడ, జూలై 16: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) సిద్ధంచేసే పనిలో సంబంధిత శాఖల అధికారులున్నారు. ప్రస్తుతం కోరంగి అభయారణ్యాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

07/17/2017 - 01:53

గాంగ్టక్/న్యూఢిల్లీ, జూలై 16: స్కూల్ టీచర్‌గా అతి సామాన్యమైన జీవితాన్ని ప్రారంభించి సిక్కిం రాజకీయాల్లో తిరుగులేని రీతిలో రాణించడమే కాకుండా అత్యధిక కాలం పాటు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నర్ బహదూర్ భండారీ (77) ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయనకు భార్య దిల్ కుమారి భండారి (మాజీ ఎంపి), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భండారీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

07/17/2017 - 01:52

విశాఖపట్నం, జూలై 16: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

07/17/2017 - 01:52

విజయనగరం, జూలై 16: వినోదం ఓ విద్యార్ధి ప్రాణాన్ని బలిగొంది. సరదాగా అరకు చూద్దామని ఆరుగురు స్నేహితులతో బయలుదేరిన ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ రైల్లోనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరుకు చెందిన దేశరెడ్డి గోపిరెడ్డి (21) స్నేహితులతో ఆదివారం ఉదయం కిరండల్ రైల్లో అరకు బయలుదేరాడు. ఉదయం 10.30 గంటల సమయంలో సిమిలిగుడా రైల్వే స్టేషన్ పరిధిలోని కరకవలస వద్ద రైలునుంచి జారిపడి మృతిచెందాడు.

07/17/2017 - 01:51

న్యూఢిల్లీ, జూలై 16: తెలుగు రాష్ట్రాలోని శాసనసభ స్థానాలను పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఆదివారం పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్షం సమావేశానికి టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, లోక్‌సభ పక్షం నాయకుడు తోట నరసింహం పాల్గొన్నారు.

07/17/2017 - 01:51

న్యూఢిల్లీ, జూలై 16: ప్రత్యేక హోదాతోసహా విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చెసింది. సోమవారంనుంచి ప్రారభంకానున్న పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఆదివారం పార్లమెంట్ హాలులో కేంద్రం అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

Pages