S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/15/2016 - 15:07

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు రెండు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఏడుగుర్రాలపల్లి-మల్లంపేట రహదారిపై అమర్చిన రెండు మందుపాతరలను మావోలు పేల్చివేశారు. పోలీసులను టార్గెట్‌గా చేసుకుని వీటిని పేల్చివేసినప్పటికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

07/15/2016 - 15:06

విశాఖ: హాస్టళ్లలోని మెస్‌లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ ఎయు విద్యార్థులు శుక్రవారం నాడు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వార్డెన్లు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు.

07/15/2016 - 15:06

గుంటూరు: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర సర్వేపై వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఎపి టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావు శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. రేషన్ కార్డులు, రాయితీ పథకాలను తొలగించేందుకే సర్వే చేస్తున్నారని వైకాపా నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

07/15/2016 - 15:02

కాకినాడ: గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గడంతో లంక గ్రామాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద నీటి ప్రవాహంతో గత నాలుగురోజులుగా లంక గ్రామాల ప్రజలు భయంతో గడిపారు. శుక్రవారం ఉదయం ధవలేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 అడుగులకు తగ్గింది. నీటి ప్రవాహం తగ్గడంతో విలీన మండలాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

07/15/2016 - 15:01

విజయవాడ: ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు విస్తృత ప్రచారం చేసేందుకు ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృష్ణా పుష్కరాల ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రత్యేక గీతాలను విడుదల చేసేందుకు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సినీ ప్రముఖులను కలుస్తున్నారు. సినీ గేయరచయిత జొన్నవిత్తుల, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌లను ఆయన శుక్రవారం కలిసి ప్రత్యేక గీతాల గురించి చర్చించారు.

07/15/2016 - 12:36

గుంటూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెనాలి మండలం చినరావూరులో శుక్రవారం వెలుగు చూసింది. బాలాజీ, జ్యోతి దంపతుల మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. దీంతో విసుగెత్తిన బాలాజీ గురువారం రాత్రి జ్యోతిని హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం వీరి మృతదేహాలను స్థానికులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/15/2016 - 12:34

దిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి అనూహ్యంగా కష్టాల పాలైన 46 మంది తెలుగు యాత్రికులు శ్రీనగర్ నుంచి దేశ రాజధాని దిల్లీకి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఎపి ప్రభుత్వం స్పందించడంతో అధికారులు వీరిని క్షేమంగా దిల్లీకి చేర్చారు. ఈరోజు సాయంత్రం వీరు దిల్లీ నుంచి తమ స్వస్థలాలకు తిరుగుప్రయాణం అవుతారు. ఈ 46 మంది కర్నూలు జిల్లా నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి ఇబ్బందుల పాలయ్యారు.

07/15/2016 - 05:58

విజయవాడ, జూలై 14: బందరు పోర్టు నిర్మాణానికి భారీ ఎత్తున భూమిని సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోర్టు నిర్మాణానికి, పోర్టు ఆథారిత పరిశ్రమల కారిడార్ కోసం ప్రభుత్వం 10 వేల ఎకరాలకుతోడు, రైతుల నుంచి 20 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

07/15/2016 - 05:56

రాజమహేంద్రవరం, జూలై 14: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలోని భద్రాచలంలో గంట గంటకూ నీటి మట్టం వేగంగా తగ్గుతుండటంతో దిగువ ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 41.8 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది. అక్కడ అన్ని ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు.

07/15/2016 - 05:53

మచిలీపట్నం, జూలై 14: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపిచంద్‌కు చెందిన రైతుమిత్ర ఫెర్టిలైజర్స్ కంపెనీపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మిశ్రమ ఎరువుల తయారీలో ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడాన్ని గుర్తించిన అధికారులు ఆరు రకాల ఉత్పత్తులను సీజ్ చేశారు.

Pages