S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2016 - 07:30

విజయవాడ, జూలై 15: రాజధాని నిర్మాణం ఆషామాషీ కాదని..ఎంతో ప్రయాస పడితే తప్ప ఓ అద్భుత రాజధానిని నిర్మించడం సాధ్యం కాదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘మనకి మురికివాడలు నిర్మించడమే తెలుసు. ఇలాంటి రాజధానే కావాలంటే నేను ఇన్ని నగరాల్లో పర్యటించాల్సిన అవసరం లేదు. ఆ పని మనమూ చేయగలం’అని అన్నారు.

07/16/2016 - 07:24

విజయవాడ, జూలై 15: నవ్యాంధ్ర రాజధానికి రావాల్సిన నిధులు, హైకోర్టు విభజన, అంతర్రాష్ట్ర జలవివాదాలు, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు వంటి అంశాలకు పార్లమెంటు సమావేశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా మిత్రపక్షమైన బిజెపి మద్దతుతో సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

07/16/2016 - 00:57

తిరుమల, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ స్వార్థ రాజకీయ లాభాల కోసం ప్రజాసమస్యలను తాకట్టుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ నేత పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

07/16/2016 - 00:56

చింతూరు, జూలై 15: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు గుర్తించి, పేల్చివేశారు. చింతూరు మండలం ఏడు గుర్రాలపల్లి, పేగ గ్రామాల మధ్య చెట్ల కింద మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. శుక్రవారం పోలీసులు కూంబింగ్ సమయంలో ఈ మందుపాతరలను గుర్తించారు. ప్రతి శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటారు.

07/16/2016 - 00:38

విజయవాడ, జూలై 15: సాంకేతిక నిపుణులు రాజకీయాల్లోకి వస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెయల్ రావు ఇందుకు నిదర్శనమని చెప్పారు. నగరంలోని ఎ కనె్వన్షన్‌లో రాష్ట్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ కెయల్ రావు 114వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు.

07/16/2016 - 00:38

విజయవాడ, జూలై 15: మరో 28 రోజుల్లో కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున అధికారులు ఇప్పటినుంచే అప్రమత్తమై సన్నద్ధంగా ఉండాలంటూ శుక్రవారం రాత్రి సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

07/16/2016 - 00:37

ఖాజీపేట, జూలై 15: అమ్మాయి పేర ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి, లైక్స్‌తో వంచించి, మాయమాటలతో ఎరవేసి యువకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలుచేసిన మాయగాడిని కడప జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. విశాఖపట్నం నగరానికి చెందిన నాగభూషణంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. మైదుకూరు రూరల్ సిఐ నాగభూషణం, ఎస్‌ఐ రాజగోపాల్ శుక్రవారం ఫేస్‌బుక్ మాయగాడి వివరాలు వెల్లడించారు.

07/16/2016 - 00:35

విజయవాడ, జూలై 15: రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య విభాగాల్లో కలిసి పనిచేయడానికి బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరుస్తోంది. అలాగే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఆ రంగంలో సాంకేతికతను వినియోగించుకునే విషయంలో పూర్తి సహకారం అందించేందుకు కూడా అంగీకారం తెలిపింది. సిఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి ఫౌండేషన్ ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/16/2016 - 01:01

రాజమహేంద్రవరం, జూలై 15: కొన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థ పాచిపోయిన భోజనాన్ని పిల్లలకు పెడుతోందని, ఈ సంస్థ పనితీరును తూర్పు గోదావరి జిల్లాలో కూడా పరిశీలన జరిపి, నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించాలని శాసన మండలి హామీల అమలు కమిటీ అధికారులను ఆదేశించింది. ఆ సంస్థ మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది.

07/16/2016 - 00:30

గుంటూరు, జూలై 15: ఇకపై రాత్రిపూట కూడా అన్న క్యాంటిన్లలో ఐదు రూపాయలకే భోజన వసతి కల్పిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. వెలగపూడి క్యాంటిన్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సచివాలయం సమీపంలోని అన్న క్యాంటిన్లో భోజనం చేసి నాణ్యత ప్రమాణాలను మంత్రి సునీత పరిశీలించారు.

Pages