S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/15/2016 - 05:51

రాజమహేంద్రవరం, జూలై 14: గోదావరి మహా పుష్కరాల ప్రారంభం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో సంభవించిన తొక్కిసలాటలో మృతిచెందిన వారికి గురువారం ఘన నివాళి అర్పించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నగరంలో సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. తొక్కిసలాట జరిగిన పుష్కర ఘాట్‌లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గోదావరిలో పిండప్రదానం చేశారు.

07/15/2016 - 05:48

పార్వతీపురం, జూలై 14: సర్దార్ గౌతులచ్చన్న బ్యారేజి ప్రాజెక్టు (తోటపల్లి రిజర్వాయర్ ) ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. గురువారం ప్రాజెక్టు పరిధిలోని ఉల్లిభద్ర వద్ద ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి స్విచ్ ఆన్ చేసి మంత్రి నీటిని విడుదల చేశారు.

07/15/2016 - 05:31

ప్రొద్దుటూరు టౌన్, జూలై 14: కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలంటూ గురువారం ప్రొద్దుటూరు పట్టణంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉక్కు పరిశ్రమ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో బహిరంగసభ నిర్వహించారు.

07/15/2016 - 05:26

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో ఏడు ప్రముఖ దేవాలయాల్లో కూడా విద్యుత్ ఆదా కోసం ఎనర్జీ ఎఫిషియెంట్ ఎండోమెంట్స్ ప్రాజెక్టు స్కీంను అమలు చేయాలని ఏపి ట్రాన్స్‌కో నిర్ణయించింది. దీని వల్ల సాలీనా 60 లక్షల విద్యుత్ యూనిట్లను పొదుపు చేయవచ్చని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

07/15/2016 - 05:26

కాకినాడ, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లో దళిత, గిరిజన వర్గాల విద్యార్థులకు సైతం ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలుచేయాలని సంకల్పించింది. కాపు, బిసి వర్గాలకు ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క వర్గాన్నీ దూరం చేసుకోరాదన్న యోచనతో, అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సంకేతాలు పంపే పనిలో ప్రభుత్వం ఉంది. తాజాగా ఎస్సీ ఎస్టీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలుచేస్తోంది.

07/15/2016 - 05:25

కర్నూలు సిటీ, జూలై 14: రాష్ట్రంలో భూములకు సంబంధించిన రికార్డుల పరిరక్షణకు రూ. 872కోట్లు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భూముల రీ సర్వే చేయించి వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తామన్నారు. అందుకోసం మొదటి విడతగా 384 డేటాబేస్ సెంటర్లు, రెండవ విడతగా 452 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

07/15/2016 - 05:25

భద్రాచలం, జూలై 14: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. దాడులు చేసి వరుసగా బిజెపి నేతలను హత్య చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. అధికార పార్టీ నేతలంతా పార్టీకి రాజీనామా చేయాలనే మావోయిస్టుల డిమాండ్ మేరకు దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతంలో బిజెపి నాయకులు రాజీనామాల పర్వానికి తెర లేపారు.

07/15/2016 - 05:24

బొబ్బిలి(రూరల్), జూలై 14: ఏమాత్రం సర్వీస్ లేని 32 విమానాశ్రయాలపై దృష్టి సారించామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి గురువారం వచ్చిన ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా విమాన టికెట్ల ధరలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. 2వేల 500 రూపాయలతో విమానం ఎక్కే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.

07/15/2016 - 05:23

కూచిపూడి, జూలై 14: సంచలనాత్మక, చారిత్రాత్మక తీర్పు ద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్ర రాష్ట్ర విభజన విషయంలో ఉపేక్షాభావం వహించటం భావ్యమా? న్యాయమా?.. అని ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం గురుదేవులు ప్రశ్నించారు.

07/15/2016 - 05:23

జగ్గయ్యపేట రూరల్, జూలై 14: అక్రమ సంబంధం అనుమానంతో భార్యకు శీల పరీక్ష పెట్టిన ప్రబుద్ధుడి వైనం గురువారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగింది. చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం చిల్లకల్లు - వైరా రోడ్డులోని కాలువల వెంట గుడిసెలు వేసుకొని జీవనం ఉంటున్న సత్రం బాలకృష్ణకు తన భార్య ప్రవర్తనపై అనుమానం కల్గింది.

Pages