S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/15/2018 - 02:22

న్యూఢిల్లీ, జూలై 14: ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో పోరాటం కొనసాగిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. రఘువీరారెడ్డి శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశంల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని అధినాయకత్వాన్ని కోరినట్టు స్పష్టం చేశారు.

07/15/2018 - 02:22

విజయవాడ, జూలై 14: ఈ ఏడాది చివరి నాటికి 20 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌లను నిర్మిస్తామని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అన్నారు. కృష్ణాజిల్లా ముదినేపల్లిలో గురజ పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 6 లక్షల టన్నుల ఉత్పత్తులను నిలువ చేసే గిడ్డంగులను నిర్మించామన్నారు.

07/15/2018 - 02:21

రేణిగుంట, జూలై 14: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణలో ఉన్న నిందితుడు శనివారం ఉదయం మృతి చెందాడు. ఇతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల థర్డ్ డిగ్రీవల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన హాజీవళి పలు ఎర్రచందనం కేసుల్లో నిందితుడు.

07/15/2018 - 02:20

పలాస, జూలై 14: పిల్లలు కావాలని పుత్రకామేష్టి యాగాలు చేసేవారని విన్నాం. పిల్లల కోసం చాలా మంది దంపతులు దేవాలయాలు చుట్టూ తిరగడం, అవసరమైతే టెస్ట్‌ట్యూబ్ బేబీల వరకూ వెళ్తున్న తరుణంలో ఓ మహాతల్లి తనకు పుట్టిన ఆడ శిశువును జన సంచారం లేని ఒక భవనంలో పడేసింది. మాతృత్వం కోసం ఆడపిల్లలు కలలు కనడం, గర్భం దాల్చాక నవమాసాలు మోసి అమ్మ పిలుపు కమ్మదనం కోసం ఆరాట పడే తల్లులనూ మనం చూస్తుంటాం.

07/15/2018 - 02:19

విజయవాడ, జూలై 14: భారతదేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఇఎఫ్) ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఏఐఎస్‌జిఇఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్ తెలిపారు.

07/14/2018 - 23:39

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 14: తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలంలో గోదావరి నదిలో శనివారం నాటుపడవ బోల్తా పడిన ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పడవ ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధితులకు తక్షణం సహాక చర్యలు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పార్టీ తరుపున సహాయక చర్యలో వైకాపా శ్రేణులు పాల్గొనాలన్నారు.

07/14/2018 - 23:38

విశాఖపట్నం, జూలై 14: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిమీ ఎత్తున స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ సహా తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.

07/14/2018 - 23:38

అమరావతి, జూలై 14: రాజధాని ప్రాంతంలో ప్రతిపాదించిన అంతరవలయ రహదారి (ఇన్నర్ రింగురోడ్డు) ముసాయిదా ప్రణాళిక అలైన్‌మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు ముసాయిదా ప్రణాళికపై గతంలో రైతుల నుంచి అభ్యంతరాలు, సూచనలను సీఆర్డీఏ అధికారులు సేకరించారు. దీనిపై వాదనలు వినేందుకు శనివారం హియరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

07/14/2018 - 23:37

గుంటూరు, జూలై 14: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టింది పాదయాత్ర కాదని, మార్నింగ్, ఈవినింగ్ వాక్ మాత్రమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. శనివారం గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడారు.

07/14/2018 - 03:26

భీమవరం, జూలై 13: ఆక్వా రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఎగుమతి చేస్తున్న చేపల్లో ఫార్మాలిన్ అవశేషాల్లేవని టాస్క్ఫోర్స్ అధికారులు నిర్ధారించారు. రాష్ట్రం నుండి ఎగుమతిచేస్తున్న చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలుంటున్నాయంటూ నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, పశ్చిమ బంగ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. దీనితో చేపల ఎగుమతిదారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Pages