S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/14/2018 - 03:24

తాడిపత్రి, జూలై 13: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని గెర్డౌ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతోందని గురువారం జరిగిన సంఘటన స్పష్టం చేస్తోంది. ఫ్యాక్టరీలోని అంత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులతో యాజమాన్యం పనులు చేయిస్తోందని తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంతో బడుగు జీవులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

07/14/2018 - 03:22

విశాఖపట్నం, జూలై 13: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా నైరుతి దిశలో 7.6 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం నెలకొందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

07/14/2018 - 03:21

చోడవరం, జూలై 13: ఏడు ఖండాల్లోని ఎతె్తైన పర్వతాలను అధిరోహించాలన్నదే తన ధ్యేయమని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆంధ్రప్రదేశ్ తొలిమహిళ ఆశాకిరణ్ రాణి పేర్కొన్నారు.

07/14/2018 - 03:21

విజయవాడ, జూలై 13: రాష్ట్ర జనాభాలో దాదాపు 25 లక్షల మందిపైగా విస్తరించి ఉన్న గిరిజనులకు గత నాలుగున్నర సంవత్సరాలుగా మంత్రివర్గంలో కనీస ప్రాతినిధ్యం లేకపోవటం పై ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో గిరిజనుల్లో అత్యధిక మంది వైకాపాను ఆదరించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన రెడ్యా నాయక్, ఉత్తరాంధ్రకు చెందిన బాలరాజు మంత్రివర్గంలో కొనసాగారు.

07/14/2018 - 03:17

అమరావతి, జూలై 13: రాష్టవ్య్రాప్తంగా రైతుబజార్లలోని వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్‌పర్ట్ 365 అనే సంస్థ ముందుకొచ్చింది. శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్గానిక్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

07/14/2018 - 03:16

విజయవాడ, జూలై 13: ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనంత వేగంతో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ అన్నారు. స్థానిక ఏపీసీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రభుత్వ అధికార్ల, ఉద్యోగులకు చెందిన 3,840 నివాస ఫ్లాట్లు డిసెంబర్ 31నాటికి పూర్తవుతాయన్నారు.

07/14/2018 - 03:32

విశాఖపట్నం: రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగింది. దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుతామని భరోసా ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు సహకరించడం లేదు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

07/14/2018 - 01:14

ఒంగోలు: రాష్ట్రంలో వనం -మనం కార్యక్రమంలో ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖమంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్‌నుండి రాష్ట్ర అటవీశాఖమంత్రి మంత్రి శిద్దా రాఘవరావువనం -మనం కార్యక్రమంపై రాష్ట్ర అటవీశాఖ, అనుబంధ శాఖల అధికారులతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు.

07/13/2018 - 23:10

విజయవాడ, జూలై 13: విదేశాలకు పార్శిళ్లు పంపించే వినియోగదారుల సౌకర్యార్థం భారత తపాలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో ప్రత్యేకమైన ప్యాకింగ్ సదుపాయంతో కూడుకున్న ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రమణియన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

07/13/2018 - 23:09

విజయవాడ, జూలై 13: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు పదివేల మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టివి ఫణిపేర్రాజుల నాయకత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను కలిసి వినతిపత్రం అం

Pages