S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/20/2017 - 00:23

న్యూఢిల్లీ, మే 19: కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం సిబిఐ దాడులు జరిగిన రెండు రోజుల తరువాత లండన్ వెళ్లటం వివాదాస్పదంగా తయారైంది. సిబిఐ దాడులతో పాటు ఆదాయం పన్ను (ఐటి) శాఖ నిధుల దుర్వినియోగం కేసులు పెట్టటంతో చిదంబరం లండన్ పారిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే చిదంబరం మాత్రం ఈ వార్తలను ఖండించారు.

05/20/2017 - 00:22

హౌరా, మే 19: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి స్వచ్ఛ, పునరుత్పాదక ఇంధన వనరులను మరింతగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని రాష్టప్రతి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్స్, టెక్నాలజీ (ఐఐఇఎస్‌టి)లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మైక్రోగ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టును శుక్రవారం రాష్టప్రతి ప్రారంభించారు.

05/20/2017 - 00:22

న్యూఢిల్లీ/కోల్‌కతా, మే 19: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రెండింతలకుపైగా పెరిగింది. మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) ప్రభావం తగ్గుముఖం పట్టడంతో 2,814.82 కోట్ల రూపాయలుగా నమోదైంది.

05/20/2017 - 00:21

హైదరాబాద్, మే 19: తొలిసారిగా దొండకాయలకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో బత్తాయిల కోసం మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలోనే దేవరకొండలో దొండకాయల మార్కెట్‌ను తీసుకురా నున్నారు. అలాగే పటాన్‌చెరులో ఉల్లిగడ్డల మార్కెట్‌ను, ఇతర పండ్ల మార్కెట్‌లను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

05/20/2017 - 00:21

న్యూఢిల్లీ, మే 19: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం మారన్ సోదరుల స్పందనను కోరింది ఢిల్లీ హైకోర్టు.

05/20/2017 - 00:20

బెంగళూరు, మే 19: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్‌లో పలు ఎంపిక చేసిన స్టోర్లలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్లను ట్రయల్ రన్‌లో భాగంగా విక్రయిస్తోంది. ఐఫోన్ ఎస్‌ఇ మోడల్ ఉత్పత్తులను అమ్ముతున్నామని, ఇవి భారత్‌లోనే తయారయ్యాయని సంస్థ తెలిపింది. అయితే ఇవి పరిమిత స్థాయిలోనే ఉన్నాయని పిటిఐకి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై యాపిల్ మాత్రం ఏవిధంగానూ స్పందించలేదు.

05/20/2017 - 00:20

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 30.13 పాయింట్లు పెరిగి 30,464.92 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 1.55 పాయింట్లు పడిపోయ 9,427.90 వద్ద నిలిచింది.

05/20/2017 - 00:19

ఎమ్‌ఆర్‌పిఎల్
న్యూఢిల్లీ, మే 19: మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎమ్‌ఆర్‌పిఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,942 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 1,362 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 18,100 కోట్ల రూపాయలుగా, పోయినసారి 13,477 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ చెప్పింది.

05/19/2017 - 08:48

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిఎస్‌ఐఐసి) చేపడుతున్న ప్రాజెక్టులకు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించేందుకు సిండికేట్ బ్యాంక్ యాజమాన్యం ముందుకు వచ్చింది. టిఎస్‌ఐఐసి ద్వారా పరిశ్రమలను స్థాపిస్తున్న కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కూడా రుణాలను ఇవ్వడానికి ఈ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది.

05/19/2017 - 08:48

న్యూఢిల్లీ, మే 18: జన్యుపరమైన మార్పులు చేసిన ఆవాల వాణిజ్య సాగుకు కేంద్ర జీవసాంకేతిక విజ్ఞాన నియంత్రణ సంస్థ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జిఇఎసి) ఇచ్చిన అనుమతిని కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి సారథ్యంలోని పార్లమెంటరీ స్థారుూ సంఘం సమీక్షించే అవకాశం ఉంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని జిఇఎసి జన్యుపరమైన మార్పులు చేసిన ఆవాల వాణిజ్య సాగుకు సిఫారసు చేసింది.

Pages