S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/28/2017 - 06:56

న్యూఢిల్లీ, మే 27: అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పవర్ లిమిటెడ్ ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 4,960.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో పన్ను అనంతర నికర లాభం 1,012 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు అదానీ పవర్ తెలియజేసింది.

05/28/2017 - 06:55

తడ, మే 27: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో గల శ్రీసిటి పారిశ్రామిక వాడలో వైటల్ పేపర్ ప్యాకేజింగ్ పరిశ్రమ శనివారం తమ మూడో యూనిట్ నుండి ఉత్పత్తులను ప్రారంభించింది. సింగపూర్‌కు చెందిన ఈ పరిశ్రమ ఇప్పటికే శ్రీసిటిలో రెండు యూనిట్‌లను కలిగి ఉంది. వీటిలో ఆఫీస్, స్కూల్ స్టేషనరి, ఇతర పేపరు ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తారు.

05/28/2017 - 06:54

హైదరాబాద్, మే 27: ‘మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి..’ అని తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అనువైన రాష్ట్రం అని ఆయన వారికి తెలిపారు.

05/28/2017 - 06:28

హైదరాబాద్, మే 27: చేతి వృత్తుల వారికి చేయూతనిస్తున్నామని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి, ఖాదీ బోర్డు చైర్మన్ మహ్మద్ యూసుఫ్ జాహెద్ తెలిపారు. శనివారం తెలంగాణ జిల్లాల ప్రాంతీయ అధికారులకు తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి, బోర్డు కార్యాలయంలో సంప్రదాయ పరిశ్రమలపై వర్క్ షాప్ నిర్వహించారు.

05/28/2017 - 06:27

హైదరాబాద్, మే 27: జిఎమ్‌ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) నుంచి దక్షిణ కొరియాకు మామిడి ఎగుమతులు మొదలయ్యాయి. ఈ మేరకు జిఎమ్‌ఆర్ ఓ ప్రకటన ద్వారా శనివారం తెలియజేసింది.

05/28/2017 - 06:26

న్యూఢిల్లీ, మే 27: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణ భారం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దాదాపు 700 కోట్ల రూపాయలు పెరిగింది. హౌసింగ్ డిమాండ్ ఇంకా మందగమనంలోనే ఉండటంతో సంస్థ రుణ భారం 25,096 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2016 డిసెంబర్ చివరి నాటికి ఇది 24,397 కోట్ల రూపాయలుగా ఉంది.

05/27/2017 - 06:08

రాబోయే నాలుగేళ్లు ప్రతికూలమేనన్న సంకేతాలు
వేలాది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్న సంస్థలు
పనితీరు ఆధారంగా కోతలు పెట్టేందుకు సిద్ధం
ఉద్యోగుల తొలగింపు బాధాకరమన్న నారాయణ మూర్తి
హెచ్1-బి వీసా కఠిన విధానంతోనే సమస్యలు

05/27/2017 - 06:07

న్యూఢిల్లీ, మే 26: సానుకూలమైన విదేశీ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రికవరీ కారణంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక వృద్ధి దశ (ప్రొడక్టివ్ గ్రోత్ ఫేజ్)లోకి అడుగుపెడుతోందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి జిడిపి వృద్ధి 7.9 శాతానికి పెరిగే అవకాశముందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది.

05/27/2017 - 06:03

స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత
ఆల్‌టైమ్ హైకి చేరిన సూచీలు ౄ 9,595 వద్ద నిఫ్టీ

05/27/2017 - 06:02

టాటా కెమికల్స్
న్యూఢిల్లీ, మే 26: టాటా కెమికల్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 343.02 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 260.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,079.47 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,618.14 కోట్ల రూపాయలు గా ఉందని సంస్థ తెలియజేసింది.
కంటైనర్ కార్పొరేషన్

Pages