S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/19/2017 - 08:47

కోల్‌కతా, మే 18: తన ప్రధాన కంపెనీ అయిన సెస్క్ లిమిటెడ్‌ను నాలుగు కంపెనీలుగా విడగొట్టడం ద్వారా పునర్వ్యవస్థీకరించినట్లు ఆర్‌పి సంజీవ్ గోయంకా గ్రూపు ప్రకటించింది. వివిధ రంగాల కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టడం కోసం సెస్క్ లిమిటెడ్‌ను అత్యంత పారదర్శకమైన రీతిలో నాలుగు కంపెనీలుగా విడగొట్టినట్లు గ్రూపు చైర్మన్ సంజీవ్ గోయంకా తెలిపారు.

05/19/2017 - 08:47

ముంబయి, మే 18: గత కొద్ది రోజులుగా కొత్త రికార్డులు సృష్టిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 224 పాయింట్లు పతనం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 9,500 పాయింట్ల దిగువన ముగిసింది.

05/19/2017 - 08:46

హైదరాబాద్, మే 18: ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగాలు రావడం లేదని బాధపడేవారికి సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) అభయ హస్తం ఇస్తోంది. చదువు పూర్తికాగానే ఉద్యోగం ఆర్డర్ తీసుకునే సదావకాశాన్ని అందిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలోని 30 పట్టణాల్లో ఉన్న ఈ సంస్థ ఆయా ప్రాంతాల్లోని అవసరాలను దృష్టిలో ఉంచుకుని భిన్నమైన కోర్సులను ఆఫర్ చేస్తోంది.

05/18/2017 - 04:24

న్యూయార్క్, మే 17: ఫోర్బ్స్ ‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. తమ పరిశ్రమల విస్తరణతో విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తున్న, ప్రభావితం చేసిన వ్యాపార, పారిశ్రామికవేత్తలతో ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది.

05/18/2017 - 04:21

ఆంధ్రభూమి బ్యూరో

05/18/2017 - 04:13

కర్నూలు, మే 17: కర్నూలు జిల్లా నంద్యాల పరిసర ప్రాంతాల్లోని సారవంతమైన భూమిని సద్వినియోగం చేసుకుంటూ దేశంలో అతిపెద్ద విత్తనోత్పత్తి సంస్థను ఏర్పాటు చేయడానికి అమెరికా నుంచి వ్యవసాయ శాస్తవ్రేత్తలతో కూడిన బృందం త్వరలో పర్యటిస్తుందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు అక్కడి విత్తనోత్పత్తి సంస్థలతో చర్చలు జరిపారు.

05/18/2017 - 04:11

విశాఖపట్నం, మే 17: విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. బుధవారం ఎంపీలు కొనకళ్ల నాగేశ్వరరావు, అవంతి శ్రీనివాసరావు, హరిబాబు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి షిప్‌యార్డును చౌదరి సందర్శించారు.

05/17/2017 - 01:04

ముంబయి, మే 16: ద్రవ్యోల్బణ గణాంకాల సానుకూల సంకేతాలతో సోమవారం జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరిన దేశీయ సూచీలు మంగళవారం మరింతగా ఎదిగి తమ రికార్డులను తామే బద్దలు కొట్టాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 250 పాయింట్లకు పైగా లాభపడి 30,582 పాయింట్ల సరికొత్త రికార్డుకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 67 పాయింట్లు లాభపడి తొలిసారిగా 9,500 పాయింట్ల స్థాయిని దాటింది.

05/17/2017 - 01:02

న్యూఢిల్లీ, మే 16: ఈ ఏడాది 8 నుంచి 9 శాతం వృద్ధిరేటును నమోదు చేసే దిశగా ముందుకు సాగుతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత భారీ పరిమాణంలో ఉండబోదని దేశీయ ఐటి పరిశ్రమ భరోసా ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

05/17/2017 - 01:00

న్యూఢిల్లీ, మే 16: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్) చందాదారులకు శుభవార్త. ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఉపసంహరణతో పాటు పెన్షన్, ఇన్సూరెన్స్ (బీమా) తదితర వివిధ క్లెయిముల పరిష్కారానికి ప్రస్తుతం 20 రోజులుగా ఉన్న గడువును 10 రోజులకు ఇపిఎఫ్‌ఓ కుదించింది.

Pages