S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/30/2017 - 08:19

న్యూఢిల్లీ, మే 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2019-20 నాటికి 7.7 శాతానికి పెరగవచ్చని సోమవారం పేర్కొంది. బలమైన ఆర్థిక మూలాలు, సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల రాక భారత్‌కు కలిసొస్తున్నాయని అభిప్రాయపడింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైనది తెలిసిందే.

05/30/2017 - 08:19

న్యూఢిల్లీ, మే 29: పార్టిసిపేటరీ (పి)-నోట్ల జారీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. సోమవారం లెవీ ఫీజును ప్రతిపాదించింది. విదేశీ మదుపరుల ద్వారా జారీ అయ్యే ప్రతీ పి-నోట్‌పై 1,000 డాలర్లను రెగ్యులేటరీ లెవీ ఫీజుగా వేస్తామని తెలిపింది. ఇవి నల్లధనానికి ఏవిధంగానూ ఊతమివ్వకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సెబీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

05/30/2017 - 08:18

లార్సెన్ అండ్ టూబ్రో
న్యూఢిల్లీ, మే 29: లార్సెన్ అండ్ టూబ్రో ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,025 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 2,335 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 36,828 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం తెలిపింది. నిరుడుతో పోల్చితే ఆదాయం 12 శాతం పెరిగిందని చెప్పింది.
కోల్ ఇండియా

05/30/2017 - 08:17

ముంబయి, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 81.07 పాయింట్లు పెరిగి 31,109.28 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 31,214.39 పాయింట్ల స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9.80 పాయింట్లు అందుకుని 9,604.90 వద్ద నిలిచింది. ఒకానొక దశలో ఇది 9,637.75 పాయింట్లను చేరింది.

05/29/2017 - 05:59

రాజమహేంద్రవరం, మే 28: చిన్న వర్తకులను నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తెస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్, ఇండస్ట్రీస్ (్ఫక్కీ) కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్ ధ్వజమెత్తారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు కమ్యూనిటీహాలులో రాష్టస్థ్రాయి వర్తక మహాసభ జరిగింది.

05/29/2017 - 05:57

ఎన్‌ఎమ్‌డిసి

05/29/2017 - 05:56

న్యూఢిల్లీ, మే 28: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్ స్థూల ఆర్థిక గణాంకాలు, రుతు పవనాల రాక, వర్ష సమాచారం, చివరి దశ ఆర్థిక ఫలితాలపై ఆధారపడి ఉంటుందన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయ. గత ఆర్థిక సంవత్సరం (2016- 17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను కోల్ ఇండియా, ఎల్‌అండ్ టి, ఎన్‌టిపిసి వంటి దిగ్గజ సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయ.

05/29/2017 - 05:55

న్యూఢిల్లీ, మే 28: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. 2016లో దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గత ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ సంవత్సరం జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. తర్వాతి నెల ఫిబ్రవరిలో తీరు మార్చుకున్నారు.

05/29/2017 - 05:53

హైదరాబాద్, మే 28: కార్పొరేట్ సామాజిక బాధ్యతగా తక్కువ ఖర్చుతో జం ట నగరాల్లో పేదల ఇళ్ల ని ర్మాణం చేపేట్టందుకు క్రెడా య్ ముందుకు రావాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఆదివారం నాడిక్కడ బంజారాహిల్స్‌లో క్రెడాయ్ నూతన భవనాన్ని ప్రారంభించారు.

05/29/2017 - 05:53

కడియం, మే 28: దేశవ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. నర్సరీలను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చే సెక్షన్ 7, 8ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అఖిల భారత నర్సరీ రైతు సంఘం అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు.

Pages