S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/27/2016 - 05:13

న్యూఢిల్లీ, మార్చి 26: రాబోయే దశాబ్దాల్లో భారత్ మరింత అధిక వృద్ధిరేటు దిశగా పయనిస్తుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పనగరియా.. ఐరోపా సమాజం కంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఉత్తమ స్థితిలో ఉందన్నారు.

03/27/2016 - 05:12

ముంబయి, మార్చి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం లాభాలను అందుకున్నాయి. గడచిన వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగినది తెలిసిందే. హోలి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా గురు, శుక్రవారాలు మార్కెట్లు మూతపడ్డాయి. అయితే అంతకుముందు సోమ, మంగళ, బుధవారాల్లో మార్కెట్ కార్యకలాపాలు సాగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 25వేల స్థాయి ఎగువన ముగిసింది.

03/27/2016 - 05:15

న్యూఢిల్లీ, మార్చి 26: దేశవ్యాప్తంగా నగల వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. జిజెఎఫ్, ఎబిజెఎ, జిజెఇపిసి సంఘాలు గత శనివారమే సమ్మెను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మెజారిటీ సంఘాలు ఇంకా నిరవధికంగా బంద్‌ను పాటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఆభరణాల వర్తకుల బంద్ 25వ రోజుకు చేరగా, జలంధర్, గుర్గావ్, అహ్మదాబాద్ పాంత్రాల్లో భారీ ఎత్తున వ్యాపారులు ర్యాలీలు నిర్వహించారు.

03/27/2016 - 05:09

భీమవరం, మార్చి 26: ప్రధాన మంత్రి సాగరమాల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులను అనుసంధానం చేస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థులతో ముఖాముఖిలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

03/27/2016 - 05:06

ముంబయి/బెంగళూరు, మార్చి 26: భారత ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజాలు, ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రత్యర్థులైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మధ్య ఆన్‌లైన్ వేదికగా విమర్శలు-ప్రతివిమర్శలు మరింత జోరందుకున్నాయి. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.. భారత్‌లోకి ప్రవేశించడంపై తాజాగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వ్యవస్థాపకులిరువురి మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ పరస్పర వాదనల్లోకి వెళితే..

03/27/2016 - 05:04

విశాఖపట్నం, మార్చి 26: విమనయాన రంగాభివృద్ధికి రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం ఎంపి కె హరిబాబు తెలిపారు. సరకు రవాణా, ప్యాసింజర్ విమానాలకు ఉన్న అవకాశాలను విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

03/26/2016 - 03:52

న్యూఢిల్లీ, మార్చి 25: ఏప్రిల్ నుంచి వాహనాల ధరలను పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య పెరిగిన ఉత్పాదక వ్యయంతో వివిధ మోడళ్ల ధరలను గరిష్ఠంగా 6,000 రూపాయల వరకు పెంచాలని యోచిస్తోంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే వివిధ రకాల కార్లపై 79,000 రూపాయల వరకు హోండా ధరలను పెంచింది.

03/26/2016 - 03:51

మదనపల్లె, మార్చి 25: టమోటా రైతులు రోడ్డెక్కారు. తక్కువ దిగుబడులు వస్తున్నా కిలో టమోటాలు కేవలం రెండు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మండీ వ్యాపారులు కుమ్మక్కవ్వడం వల్లే ధరలు పతనమవుతున్నాయన్న రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

03/26/2016 - 03:50

హైదరాబాద్, మార్చి 25: మహారాష్టల్రోని పుణే వద్ద 30 ఎకరాల్లో సమగ్ర లైఫ్ స్టయిల్ రెసిడెన్షియల్ అపార్టుమెంట్లను నిర్మించనున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ ప్రకటించింది. దీనికి పుర్వ సిల్వర్ శాండ్స్ అని నామకరణం చేశారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో స్ధిరపడేవారి అభిరుచులకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ సిఎండి రవి పురవంకర తెలిపారు.

03/26/2016 - 03:50

హైదరాబాద్, మార్చి 25: గుజరాత్‌కు చెందిన హార్లే ఫుడ్ ఉత్పత్తుల సంస్థ నాణ్యత, నోరూరించే ఆరోగ్యకరమైన స్నాక్స్, బేవరేజస్, కనె్ఫక్షనరీ ఉత్పత్తులను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఆ సంస్ధ సిఎండి సౌమిక్ మిత్రా మాట్లాడుతూ పిల్లల సంతృప్తే మా సంతృప్తి అనే నినాదాన్ని టాగ్‌లైన్‌గా సూరత్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు.

Pages