S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/16/2016 - 01:04

‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి (అక్టోబరు 31)ని కేంద్రం జాతీయ ఐక్యతాదినంగా ప్రకటించింది. పటేల్‌కు మించి దేశ ప్రాదేశిక సమగ్రతకు పాటుపడిన వ్యక్తి మరొకరు లేరు. గతంలో కాంగ్రెస్ పాలకులు ఇం దిరా గాంధీ జయంతి (నవంబరు 19)ని జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించారు. అయితే, పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా పాటించడం అన్నివిధాలా సముచితమన్న వాదనలు లేకపోలేదు.

12/15/2016 - 07:51

శకలాన్ని సకలంగా భావించడం సృష్టిగత వాస్తవ స్థితికి విరుద్ధం, సమాజ స్థితి స్వభావానికి విరుద్ధం. శకలానికి ‘సకలం’లో సంబంధం లేదని భావించడం కూడ సహజ స్థితికి విపరీతం. ‘శకలం’- ‘సకలం’లో నిహితమై ఉంది. అసంఖ్యాక శకలాల సమష్టి సకలం.. పాశ్చాత్యుల భావజాలం మన నెత్తికెక్కిన తరువాత ఇదంతా తలకిందులైపోయింది. నడచిపోతున్న కథ ఇది! రాజకీయం ఒక ‘శకలం’ మాత్రమే! ‘క్రీడ’ మరో శకలం, ‘చలనచిత్ర పారవశ్యం’ మరో శకలం..

12/13/2016 - 23:48

పేర్లు బాగున్నాయి. వాటి అర్థాలు బాగుంటాయని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు. ఒక పేరు- ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సు. అనగా ‘ఆసియా హృదయ సదస్సు’ అని. మరొక పేరు అమృత్‌సర్ లేదా అమృత సరోవరం. అక్కడ ఈ మధ్య సమావేశమైన అధినేతలు, అగ్ర నాయకుల్లో భారత్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, రష్యా, చైనా వగైరా దేశాలవారున్నారు. ముందుగానే అనుకున్నట్లు చివరకు ఏమీ జరగలేదు.

12/12/2016 - 23:49

పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచిదే కానీ- ఆచరణలో సామాన్యులు అవస్థల పాలవుతున్నారని కొందరు విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది.. రూపాయి విలువ పెరుగుతుంది.. ప్రజల్లో కొనుగోలుశక్తి స్థిరీకరింపబడుతుంది.. ఉగ్రవాద చర్యలు ఆగిపోతాయి.. ఇలాంటి వాదనలూ లేకపోలేదు. పెట్రో డాలర్లు అంటే చమురు దేశాల నుండి వచ్చే ధనం.

12/11/2016 - 23:56

ఇందిరాగాంధీ తర్వాత దేశంలో, అందునా దక్షిణాదినుంచి మరో మహిళా ప్రధానిగా అయ్యే అర్హత జయలలితకే వుందంటూ మూడు దశాబ్దాల క్రితం అప్పటి ‘ఆన్ లుకర్’ అనే ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని రాసింది. నేడు కూడా అలాంటి కథనాలకు తలూపే జనాలున్న దేశం మనది. వర్ధమాన నటిగా, రాజకీయ శక్తిగా ఎదుగుతున్న, ఎదిగిన కాలంలో జయలలిత ఇందిర లాగానే రాజకీయ అభిశంసనను, కోర్టు కేసుల్ని కూడా ఎదుర్కోవడం గమనార్హం!

12/11/2016 - 07:22

‘రాజు కఠినాత్ముడిగానే కాదు, గొప్ప మానవతావాదిగానూ ఉండాలి. మొహమాటం ఉంటే రాజు చులకన అవుతాడు. అది ఏలిక బలహీనతను ప్రజలకు ప్రదర్శించడమే! రాజ్యసౌభాగ్యం కోసమే కాదు, సొంత మనుగడకు అవసరమైతే అయినవారిని దూరం ఉంచాలి. ఫలానా వారికి మాత్రమే ప్రీతిపాత్రుడిగా ఉంటే ఆ రాజ్యంలో అసంతృప్తి మొదలై , అది అసమ్మతిగా రూపుదిద్దుకుంటుంది.

12/10/2016 - 01:02

అవును.. జనం గెలిచారు. కొన్ని దశాబ్దాలుగా అవినీతిపరులు, తీవ్రవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటున్న దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు రెక్కలు విప్పుకుని బ్యాంకుల్లో వచ్చిపడడమే జనం గెలిచారనడానికి నిదర్శనం. అవినీతిపరులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ధర్మయుద్ధానికి మద్దతుగా జనసామాన్యం గత నెలరోజులుగా బ్యాంకులు, ఎటిఎం క్యూల వద్ద సహనంతో నిలబడి మరీ గెలిచారు.

12/09/2016 - 01:30

నేరం అనేది పెద్దవారు చేసినా, చిన్నవారు చేసినా, ధనికులు చేసినా, పేదలు చేసినా, స్ర్తిలు చేసినా, పురుషులు చేసినా అది నేరమే అవుతుంది. ఆ నేరానికి ఆయా దేశాల్లోని శిక్ష్మాస్మృతిని అనుసరించి శిక్ష ఉంటుంది. న్యాయదేవత దృష్టిలో అందరూ సమానమే. అయితే, గత 150 ఏళ్లలో మేధావులు, మానవతా వాదుల దృష్టిలో, న్యాయ కోవిదులు, మానసిక శాస్తవ్రేత్తల దృష్టిలో గణనీయమైన మార్పు వచ్చింది.

12/08/2016 - 02:25

తెలుగులో మాట్లాడితే చెడ్డపేరు వచ్చేస్తుందన్న భయం దాదాపు అందరి ముఖాల మీద తాండవిస్తున్న అనుభూతి కలిగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఎగరబోతున్న ఆ ప్రభుత్వేతర రంగపు గగన శకటంలో ఒక రోజున దృశ్యమానమైన విచిత్రం ఇది. ఒక రోజున ఏమిటి? ప్రతిరోజూ ఇదే దృశ్యం మన దేశపు అన్ని విమానాలలోను, విమానాశ్రయాలలోను పునరావృత్తం అవుతుండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ ప్రభావం’!

12/07/2016 - 02:47

‘ఆమె ఎవరు?’.. ఇది ఒక తెలుగు సినిమా పేరు. ఇందులో కథానాయిక జయలలిత. ఆమె స్వరూప స్వభావాలను అనే్వషించటమే మొత్తం కథ. నిజమే.. గత నాలుగు దశాబ్దాల తమిళ రాజకీయ చరిత్ర అంటే జయలలిత స్వరూప స్వభావాల అనే్వషణా చరిత్రయే. ఈ ధృవతార రాలిపోయింది. తమిళనాడులో ఒక రాజకీయ శకం ముగిసింది. ‘పురుచ్చి తలైవి’ దివిజ శైలూషికా హృదయ వేగాన్ని పెంచి తాను గుండె ఆగి మహాప్రస్థానాన్ని పొందింది. ఎటు చూసినా జనం జనం.. ప్రభంజనం..

Pages