S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/02/2019 - 21:17

మథుర, ఆగస్టు 2: ట్రిపుల్ తలాఖ్‌కు అడ్డుకట్ట వేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడం, దానికి రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడి 24 గంటలు గడవక ముందే ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దీంతో మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ కేంద్రం చట్టం చేసిన తర్వాత ఇదే మొదటి కేసు అని చెప్పవచ్చు.

08/02/2019 - 21:13

భోపాల్, ఆగస్టు 2: ఉన్నావో రేప్ కేసులో సుప్రీం కోర్టు తాజా తీర్పును మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శుక్రవారం పేర్కొన్నారు. ఉన్నావో బాధితురాలిని ‘మధ్యప్రదేశ్ పుత్రిక’గా భావిస్తున్నామని సీఎం అన్నారు. ఉన్నావో రేప్ కేసులో లక్నోలో దాఖలైన కేసులన్నింటినీ కింది కోర్టులు ఢిల్లీకి బదలాయించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే.

08/02/2019 - 05:42

హైదరాబాద్, ఆగస్టు 1: ఎన్‌కౌంటర్‌లో హతమైన ఆదివాసీ నేత పున్నం లింగయ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం జరపాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్‌లో శుక్రవారం నాడు సమర్పించాలని పేర్కొంది. మెడికల్ బోర్డు , సీనియర్ అధికారులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది.

08/02/2019 - 05:18

విజయవాడ (క్రైం), ఆగస్టు 1: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భద్రత కుదింపు పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును న్యాయస్ధానం రిజర్వులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రముఖుల భద్రతపై సమీక్షించింది. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల భద్రతపై కోత విధించింది.

08/02/2019 - 05:12

భీమదేవరపల్లి, ఆగస్టు 1: నిరుద్యోగ యువతీ, యువకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని 90 ఖాళీ పేపర్లను నింపితే పదివేల వరకు డబ్బులు ఇస్తామని నమ్మించి వంచించిన మోసగాడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ గురువారం తెలిపారు. ముల్కనూరు గ్రామంలో గత పక్షం రోజులుగా వర్క్ ఫర్ ఆల్ బోగస్ సంస్థ తన కార్య క్రమాలను నిర్వహిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది.

08/02/2019 - 05:06

విజయవాడ (క్రైం), ఆగస్టు 1: రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు) నిలిపివేతపై హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే 42 విద్యుత్ పంపిణీ సంస్ధలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో తాజాగా పిటిషన్లు దాఖలు చేసిన కంపెనీలు వైఎస్ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా తమ వాదన చెబుతూ సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లను ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించాయి.

08/02/2019 - 04:54

ఆదోని, ఆగస్టు 1: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కర్నూలు జిల్లా గూడూరు గ్రూపు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారి పీ.రాంప్రసాద్‌ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆదోనిలో నివాసముంటున్న రాంప్రసాద్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు సుమారు రూ.2.5 కోట్ల మేరకు అక్రమ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

08/02/2019 - 01:53

ఉప్పల్, ఆగస్టు 1: భర్త రోజు డ్యూటీ పై బయటకు వెళ్లాడు. ఇంతలోనే దొంగ ఇంట్లోకి వచ్చాడు. ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ బీరప్పగడ్డలో నివసిస్తున్న మల్లేపల్లి కృష్ణ ఆటో డ్రైవర్. అతడు నిత్యం రాత్రి వేళల్లో ఆటో తీసుకుని బయటకు వెళ్తుంటాడు.

08/02/2019 - 01:52

మేడ్చల్, ఆగస్టు 1: ప్యాసింజర్ ఆటో ఢీకొనడంతో ఓ సైక్లిస్టు వృద్ధుడు మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోణాయిపల్లి గ్రామానికి చెందిన గండ్ల సత్తయ్య(65) గురువారం ఉదయం ఎదో పని మీద తన సైకిల్‌పై డబిల్‌పూర్ గ్రామానికి వెళ్తుండగా మార్యమధ్యలోని మైసిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద అటుగా అతివేగంగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది.

08/02/2019 - 01:52

జీడిమెట్ల, ఆగస్టు 1: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా చిన్నరావుపేట మండలం లంకగిరికి చెందిన నాగరాజు(32)కి జనగామ జిల్లా, పెద్దకొర్రుపోలుకు చెందిన రజిత (25)తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు.

Pages