S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/02/2019 - 01:51

షాద్‌నగర్, ఆగస్టు 1: ఫరూక్‌నగర్ సబ్ రిజిస్త్రార్ కార్యాలయంలో ఫోర్టరీ రిజిస్ట్రేషను జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రారుతో పాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్ కుమార్ వెల్లడించారు.

08/02/2019 - 00:47

న్యూఢిల్లీ, ఆగస్టు 1: పదేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమెను, ఏడేళ్ల తమ్ముడిని క్రూరంగా హతమార్చిన నిందితుడిని ఉరికంబం ఎక్కించాలని ట్రయల్ కోర్టు, తరువాత మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

08/02/2019 - 00:45

హైదరాబాద్ : అప్పులున్నాయని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోరా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేసి, కొత్త అసెంబ్లీ ప్రాంగణాన్ని నిర్మించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత పక్షం రోజులుగా విచారణ జరపుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది.

08/02/2019 - 01:09

న్యూఢిల్లీ: ఉన్నావో రేప్ కేసుపై సుప్రీం కోర్టు గురువారం పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబానికి 25 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి యూపీలోని వివిధ కోర్టుల్లో ఉన్న ఐదు కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని సూచించింది. గత వారం జరిగిన కారు ప్రమాదం సంఘటనపై విచారణను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీబీఐకి హుకుం జారీ చేసింది.

08/01/2019 - 05:19

కృష్ణాదేవిపేట, జూలై 31: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన సంఘటన విశాఖపట్నం జిల్లాలోని ఎఎల్ పురంలో చోటు చేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బాలిక తల్లిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై బాలిక తల్లి మేకల లోవ రూరల్ ఎస్పీ ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఎఎస్పీ అరీఫ్ హఫీజ్ బుధవారం గ్రామాన్ని సందర్శించి బాలిక తల్లిదండ్రులను విచారించారు. వివరాలివి.

08/01/2019 - 05:01

నెల్లూరు, జూలై 31: స్థానికంగా తయారుచేసే అసెంబుల్డ్ ఎల్‌ఈడి టీవీలకు బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి అవే కంపెనీ టీవీలుగా నమ్మించి విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను నెల్లూరు నగరంలో నవాబ్‌పేట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

08/01/2019 - 05:00

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ ఆగస్టు 19, 20, 21 తేదీలకు వాయిదా పడింది. బుధవారం జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ రాష్ట్రానికి సాక్షిగా ఉన్న ఘనశ్యాం ఝాను ఏపీ తరపు సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

08/01/2019 - 02:20

జీడిమెట్ల, జూలై 31: కళాశాల బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఇసుక చింతలపల్లి గ్రామానికి చెందిన ఎన్.కృష్ణారెడ్డి కుమారుడు ఎన్.వీరేశ్ రెడ్డి (20) చింతల్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు.

08/01/2019 - 02:20

రాజేంద్రనగర్, జూలై 31: మూడున్నారేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన రుద్రాదేవి, లక్ష్మణ్‌రాజ్ భార్యభర్తలు. వీరికి మూడున్నారేళ్ల కుమార్తె ఉంది. లక్ష్మణ్‌రాజ్‌కు దూరపు బంధువు రాజు(25). మంగళవారం చిన్నారిపై రాజు అత్యాచారానికి పాల్పడ్డాడు.

08/01/2019 - 02:19

ఘట్‌కేసర్, జూలై 31: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సంఘం భీం కుమారుడు ప్రణయ్ (23) అంకుషాపూర్‌లోని భాస్కర్ బ్రిక్స్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.

Pages