S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/13/2018 - 21:13

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.

03/13/2018 - 21:52

కేరళ భామ అమలాపాల్ ప్రస్తుతం హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకునే పనిలో బిజీగా మారింది. కెరీర్ ప్రారంభంలోనే సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన ఈమె, ఆ సమయంలోనే దర్శకుడితో ప్రేమాయణం సాగించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత సినిమాలకు దూరమైన అమలాపాల్, కొద్దిరోజులకే భర్తతో విడిపోయింది. మళ్లీ హీరోయిన్‌గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామకు పెద్దగా అవకాశాలు కలిసిరావడంలేదు.

03/13/2018 - 21:43

మహానటుడు అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో ఓ చిత్రం రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించే ఈ చిత్రం ఈనెల 29న ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

03/12/2018 - 21:16

ప్రముఖ నటుడు నాగార్జున, నానిల కాంబినేషన్‌లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కే భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 18 నుంచి మొదలుకానుంది. ప్రస్తుతం అమెరికాలో మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి.

03/12/2018 - 21:11

అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు అనీల్ సుంకర. ఓ వైపు భారీ ప్రతిష్ఠాత్మక చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు అభిరుచిగల చిన్న చిత్రాలను నిర్మిస్తూ విజయపథంలో సాగుతున్నారు. తాజాగా ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఆయన నిర్మించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’.

03/12/2018 - 21:09

రాజేంద్రప్రసాద్, సాక్షీ చౌదరి జంటగా నిధి ప్రసాద్ దర్శకత్వంలో జె.బి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన ‘ఊ..పె..కు..హ’ (ఊళ్ళో పెళ్లికి కుక్కుల హడావుడి) చిత్రానికి సంబంధించిన పాటలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత జెమిని కిరణ్ సీడీని విడుదల చేశారు. అనంతరం దర్శకుడు నిధి ప్రసాద్ మాట్లాడుతూ- అనూప్ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. తను ఈమధ్య పెద్ద సంగీత దర్శకుడిగా మారిపోయాడు.

03/12/2018 - 21:07

తెలుగు చలన దర్శకుల సంఘం ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

03/12/2018 - 21:06

సంతోష్‌రాజ్, నేహాదేశ్‌పాండే జంటగా కౌండిన్య మూవీస్ పతాకంపై రమేష్ ముక్కెర దర్శకత్వంలో తాళ్లపెల్లి దామోదర్‌గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అనువంశికత’. జెనిటిక్ లవ్‌స్టోరీ అనేది ఉప శీర్షిక. అశ్విత, క్రాంతికుమార్ సమర్పకులు. సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..

03/12/2018 - 21:03

ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం రోజురోజుకూ తన సేవాసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. మనసున్న ఎంతోమంది మనం సైతంలో భాగమవుతున్నారు. తమకు వీలైనంత విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు మనం సైతంను ఆశ్రయిస్తున్న ఆపన్నుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. వాటిలో అత్యవసరంలో ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తోంది మనం సైతం.

03/12/2018 - 21:01

సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు చిత్రాల్లో నటించి, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ (78) సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. సినిమాలతోపాటు పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు.

Pages