S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/27/2016 - 12:18

ఢిల్లీ: ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నినాదాలు చేస్తూ బుధవారం విపక్షాల ఎంపీలు రాజ్యసభలో పోడియం వద్దకు దూసుకెళ్లారు. మధ్యప్రదేశ్లో దళితులపై దాడి అంశంపై సభ దద్దరిల్లింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

07/27/2016 - 12:15

బెంగళూరు : బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకుని మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణిస్తున్నారు.

07/27/2016 - 11:16

ముంబయి: ఇవాళ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 222 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 69 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 67.34 పైసలు వద్ద నమోదైంది.

07/27/2016 - 08:23

న్యూఢిల్లీ, జూలై 26: భారత్‌పై యుద్ధానికి కాలుదువ్విన పాకిస్తాన్‌ను తరిమికొట్టడంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ సెక్టర్‌లోని కీలక స్థావరాలను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్ ప్రదర్శించిన దుస్సాహసాన్ని భారత జవాన్లు ఎంతో ధైర్యంతో తిప్పికొట్టి తిరుగులేని గుణపాఠం చెప్పారని ఆయన ప్రశంసించారు.

07/27/2016 - 08:20

న్యూఢిల్లీ, జూలై 26: ఏపి కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు అధికార బిజెపి సభ్యులపై సభా హక్కుల నోటీసు ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు పలువురు బిజెపి సభ్యులు గత శుక్రవారం రాజ్యసభలో తాను ప్రతిపాదించిన ప్రత్యేక హోదా సవరణ బిల్లుపై ఓటింగ్ జరగకుండా చూసేందుకు పోడియం వద్దకు వచ్చి కుట్ర పూరితంగా వ్యవహరించారని కెవిపి ఆరోపించారు.

07/27/2016 - 08:20

న్యూఢిల్లీ, జూలై 26: పదహారేళ్లపాటు ఎడతెగని పోరాటం ఆమెది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఏళ్ల తరబడి నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల ఇనే్నళ్లూ బలవంతంగా ఎక్కిస్తున్న ద్రవ పదార్థాలతోనే మనుగడ సాగిస్తూ వచ్చారు. ఆమెపై ఆత్మహత్య యత్నం కేసుపెట్టిన ప్రభుత్వం జుడీషియల్ కస్టడీలోనే ఉంచింది.

07/27/2016 - 08:14

న్యూఢిల్లీ, జూలై 26: చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరి జాడ తెలియకుండా పోయిన వాయుసేనకు చెందిన ఎఎన్32 విమానం గాలింపు చర్యలు మంగళవారానికి అయిదు రోజుకు చేరుకున్న నేపథ్యంలో విమానంలో ఉన్న 29 మందిని ప్రాణాలతో కనుగొనగలమన్న ఆశలు దాదాపుగా సన్నగిల్లి పోతున్నాయి.

07/27/2016 - 08:13

ద్రాస్ (కార్గిల్), జూలై 26: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నేరుగా ఎగదోస్తోందని ఆర్మీ ఉత్తర కమాండ్ సైనిక దళాల ముఖ్య అధికారి (జిఓసి) లెఫ్టెనెంట్ జనరల్ డిఎస్ హూడా ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధీన రేఖ వెంబడి చొరబాటు యత్నాలు మరింత ఎక్కువ కావచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘జమ్మూ, కాశ్మీర్‌లో ప్రచ్ఛన్న యుద్ధంలో పాకిస్తాన్ ప్రత్యక్ష పాత్ర ఉంది.

07/27/2016 - 08:12

న్యూఢిల్లీ, జూలై 26: ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ విధానం అమలుకు ప్రయత్నిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్యారా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంగళవారం ఇక్కడ తెలిపారు.

07/27/2016 - 08:12

కొచ్చి, జూలై 26: ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో 4కోట్ల 80లక్షల మంది పిల్లలు భారతదేశంలో ఎదగకుండా ఉన్నారని తాజా పరిశోధనలో వెల్లడైంది. దేశంలో పారిశుధ్య సమస్య, మరుగుదొడ్లు లేకపోవటం పిల్లల పాలిట శాపంగా మారిందని వాటర్ ఎయిడ్ అనే ఓ అంతర్జాతీయ అభివృద్ధి చారిటీ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ప్రతి అయిదుగురు పిల్లల్లో ఇద్దరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని అందులో వివరించారు.

Pages