S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానుగంటి వారి అద్వితీయ సాహితీ సృష్టి ‘వైష్ణవ సాక్షి’

గుంటూరు (కల్చరల్), మే 30: తెలుగు సాహిత్య చరిత్రలో నవీన అధ్యాయానికి నాంది పలికి, తన వచన, రచనా పటిమతో ఎన్నో పుస్తకాలను, వ్యాసాలను రచించి పాఠక లోకాన్ని సుదీర్ఘకాలం పాటు ఆత్మీయంగా ఆకట్టుకుని, గిలిగింతలు పెట్టిన వైష్ణవ సాక్షి పానుగంటి వారి అద్వితీయ సాహితీ సృష్టి అని పలువురు సాహితీవేత్తలు ప్రశంసల జల్లులు కురిపించారు. సోమవారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై జగమెరిగిన సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన సాక్షి వ్యాసాల్లోని శ్రీ వైష్ణవ సంబంధ వ్యాస సంకలనమైన వైష్ణవ సాక్షి పుస్తకావిష్కరణ సభ జరిగింది.

వైభవంగా వెంకన్న కల్యాణం

మంగళగిరి, మే 30: శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఘాట్‌రోడ్డు మార్గంలో గల పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం గరుడోత్సవం, రాత్రి రాజాధిరాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిపారు. ఆలయ ధర్మకర్తలు కోసూరు శివనాగరాజు, ఎవి సాంబశివరావు, రావుల శ్రీనివాస్, ఆలేటి నాగలక్ష్మి, మోరంపూడి నాగేశ్వరరావు, వెనిగళ్ల ఉమాకాంతం, ఊట్ల శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

గడువు దాటితే కునుకే ఉండదు

టోక్యో, మే 30:నల్లధన పంకిలాన్ని వదిలించుకోక పోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నల్ల కుబేరులను హెచ్చరించారు. తమ నల్లధన ఖాతాలను వెల్లడించేందుకు కేంద్రం తాజాగా అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం నుంచి మొదలయ్యే ఈ గడువు దాటితే నల్లధన ఖాతాదారులకు ఎదురయ్యేవి నిద్ర లేని రాత్రులేనని కూడా స్పష్టం చేశారు. నల్లధన ఖాతాల వెల్లడికి ఇప్పటి వరకూ కేంద్రం మూడు అవకాశాలు ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి స్వల్ప కాల వ్యవధితో కూడిన నాలుగో అవకాశాన్నీ అందిస్తోంది.

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం, రూ 6లక్షల ఆస్తి నష్టం

తెనాలి, మే 30: తెనాలి రూరల్ మండలం నందివెలుగు గ్రామ దళిత కాలనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్ళు దగ్ధం కాగా సుమారు 6లక్షల రూపాయల వరకు ఆస్థినష్టం సంభవంచినట్లు తెనాలి ఫైర్ అధికారి కె నాగేశ్వరరావు తెలిపారు. గ్రామానికి దక్షిణంవైపుగా ఉన్న దళిత వాడలో విద్యుత్ షార్టుసర్క్యూట్ కారణంగా బెజవాడ ఆదాం గృహంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనను గుర్తించి స్థానికులు మంటల ఆర్పే ప్రయత్నంచేసి విద్యుత్ సరఫరా జరుగుతుంన్న భయంతో కేకలు వేశారు. ఈలోగా ప్రక్కనే ఉన్న బెజవాడ ఎస్తేలు, బెజవాడ కయ్యూను అనే మరో ఇద్దరి పూరి గృహాలకు మంటలు వ్యాపించాయి.

తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దండి

తిరుపతి, మే 30: దేశ విదేశాల నుంచి తిరుపతి నగరానికి విచ్చేస్తున్న వారికి ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేవిధంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర శాసన మండలి పేపర్ లేయిడ్ అన్ ది టేబుల్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర బాబూ రాజేంద్ర ప్రసాద్ తుడ, నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కమిటీ తిరుపతిలో మూడు రోజుల పర్యటన చేయనున్న నేపథ్యంలో సోమవారం తుడా, ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారులతో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ల పేరాలపై స్థానిక పద్మావతి అతిథి భవనంలో సుదీర్ఘంగా చర్చించారు.

టిటిడి స్థానిక ఆలయాల్లో పచ్చదనం పెంచాలి

తిరుపతి, మే 30 : టిటిడి పరిధిలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఆహ్లాదాన్ని పెంచేలా మొక్కల పెంపకం చేపట్టి తద్వారా పచ్చదనం పెంచాలని టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సోమవారం వివిధ విభాగాధిపతులతో వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులను ఆకట్టుకునేలా రంగురంగుల పూల మొక్కలు పెంచాలన్నారు. తిరుపతి నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఇంతకంటే ఘనులు లేరా?

విజయవాడ, మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ‘‘ఆర్థిక నేరాల్లో ఎ1 ముద్దాయిగా ఉన్న జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అందులో ఎ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఇప్పుడు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. ఇది గర్హనీయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పార్టీకి ఎ1,ఎ2 ముద్దాయిలు తప్ప, వేరే నాయకులు లేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం రాత్రి తన నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా నాయకులు రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్నారని అన్నారు.

నీరు-చెట్టు పనులు వేగవంతం చేయండి

చిత్తూరు, మే 30: జిల్లాలో నీరు-చెట్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో నీరు-చెట్టు, పంట సంజీవిని, ఇంకుడు గుంతలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు-చెట్టు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాల్లో ఈ పనులు ఆశాజనకంగా జరుగుతున్న కొన్ని చోట్ల నత్తనడకన కొనసాగడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. దీని వలన భవిషత్తులో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు కూడా వాస్తవాలను గుర్తించి ప్రజల్లో చైతన్యం తెచ్చి త్వరగా పనులు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

తిరుపతిలో టిడిపి మహానాడు నభూతో నభవిష్యత్

తిరుపతి, మే 30 : తిరుపతిలో మూడు రోజులపాటు జరిగిన మహానాడు సభలు నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల మహానాడు సంబరాలు పండుగ వాతావరణంలో జరిగాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇది తమ ఇంటి కార్యక్రమంగా భావించి పనిచేశారని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా అందరు కలసికట్టుగా పనిచేయడంతో అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయవంతమైందని తెలిపారు.

మహానాడు బ్రహ్మాండం

శ్రీ కాళహస్తి, మే 30 : మహానాడు ఉత్సవం బ్రహ్మాండంగా జరిగిందని రాష్ట్ర గనుల శాఖామంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజ చేయించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ తిరుపతిలో మూడు రోజుల పాటు మహానాడు ఉత్సవం బ్రహ్మాండంగా జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుతూ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Pages