S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు కోర్టుకు హాజరుకాని సంగీతా ఛటర్జీ

చిత్తూరు, మే 30: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నడుపుతున్న కలకత్తాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా ఛటర్జి కలకత్తా కొర్టు ద్వారా ముందస్తు బెయిల్ తీసుకొన్నట్లు చిత్తూరు పోలీసులకు సమాచారం అందింది. చిత్తూరు జిల్లాలో పు కేసులు నమోదయిన నేపథ్యంలో సోమవారం చిత్తూరు కోర్టుకు ఆమెహాజరు కావాల్సిఉంది, అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని కలకత్తా కొర్టులో పిటీషన్ ధాఖలు చేయడంతో కోర్టు ఈమేరకు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

మాజీ సైనికులంటే అంత అలుసా..?

మదనపల్లె, మే 30: ఇచ్చినపట్టాలకు స్థలాలు చూపాలంటూ అధికారుల చుట్టు తిరుగుతుంటే మాజీ సైనికులంటే అంత అలుసా..? అంటూ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచెర్ల శ్రీనివాసులునాయుడు సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు బైఠాయించారు. నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితంగా నాటి ఎమ్మెల్యే షాజహాన్‌బాష, రెవెన్యూ తహశీల్దారు అమరేంద్రబాబు పట్టాలు మంజూరు చేశారు. ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మాజీ సైనికుల సంఘం మదనపల్లె డివిజన్ అధ్యక్షులు కె.శ్రీనివాసులునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ మూలస్థానమ్మ ఆలయ హండీ ఆదాయం 2.91 లక్షలు

చంద్రగిరి, మే 30 : చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ హుండీ ఆదాయం 2 లక్షలా 91 వేలు అని ఆలయ కార్యనిర్వహణాధికారి తిమ్మారెడ్డి అన్నారు. చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయం హుండీని సోమవారం లెక్కించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హుండీ ఆదాయాన్ని లెక్కించగా 2లక్షలా 91 వేలా 74 రూపాయలు వచ్చిందని అన్నారు. ఈ ఆదాయాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో జమ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఫణిరాజ్‌కుమార్, ఆలయ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

2 లక్షల విలువచేసే గుట్కాలు స్వాధీనం

రామచంద్రాపురం, మే 30 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 లక్షల విలువచేసే గుట్కాలను తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సురేష్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు నుంచి తిరుపతికి కారులో తీసుకొస్తున్న గుట్కాలు, హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా గుట్కా, హాన్స్ ప్యాకెట్లు ఉండటంతో వాహనంతో సహా వాటిని స్వాధీనం చేసుకుని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులురెడ్డికి సమాచారం అందించి వాటిని అందించామన్నారు.

రాణోజిరావు ఇకలేరు

బైరెడ్డిపల్లె, మే 30: మండలంలోని విరుపాక్షిపురంలో మరాఠి కులానికి చెందిన రాణోజిరావు వేలాది మంది పక్షవాత రోగులకు ప్రాణబిక్ష పెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఆయన సుమారు 75ఏళ్లుగా ఈ గ్రామంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన పక్షవాత రోగులకు మందు ఇచ్చి వేలాది మందికి ప్రాణబిక్ష పెట్టారు. ఇది చిరుగ్రామమైనప్పటికి ప్రతిరోజు సుమారు వంద వాహనాలతో పక్షవాత రోగులు ఉదయానే చేరుకొని పక్షవాత మందు సేవించేవారు.

‘వల’సకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, మే 30: మరో పదకొండు రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకుని, తన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ విసిరే వలలో పడకుండా, వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టిడిపి నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డిని గెలిపించుకోవడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి నేతలకు దొరక్కుండా వారిని ఇప్పటికే రాష్ట్రం తరలించారు. 11వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

గ్రామస్థుల సహకారంతో రహదారి

బైరెడ్డిపల్లె, మే 30: మండలంలోని శనిపల్లె నుండి రామసముద్రంకు సమీప దారి కోసం రైతులు తమ భూమిలో కొంత మేరకు స్థలం వదులు తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు చందాలు వేసుకొని జెసిబితో సుమారు రెండు కిలోమీటర్ల రహదారి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఈ రహదారి ఉన్న రైతులు ఆక్రమణలు చేపట్టడంతో కాలీ బాటగా నెలకొన్నది. ప్రభుత్వం ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా మరో రహదారి నిర్మించింది. ఈ రహదారిలో శనిపల్లె నుండి రామసముద్రానికి వెళ్లాలంటే రెండున్నర కిలోమీటరు దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో నూతనంగా నిర్మించుకుంటున్న రహదారిలో ఒక కిలోమీటరు దూరం ప్రయాణిస్తే రామసముద్రం చేరుకోవచ్చు.

మందకృష్ణ అరెస్టుకు నిరసనగా సిఎం దిష్టిబొమ్మ దగ్ధం

మదనపల్లె, మే 30: రాష్టప్రర్యటనలో భాగంగా కృష్ణజిల్లా ఇబ్రహీం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బయలుదేరిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందక్రిష్ణను అరెస్టుచేసి నిర్భంధించడాన్ని నిరసిస్తు సోమవారం మదనపల్లె పట్టణం జాతీయరహదారిపై ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టి సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారత పౌరుడుగా దేశంలో ఏప్రాంతంలో అయినా తిరిగే స్వేచ్చ రాజ్యాంగం కల్పించిందని, దీనిని ఎపి సిఎం చంద్రబాబుకు ధిక్కరించే అధికారం ఎవరిచ్చారంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికారప్రతినిధి నరేంద్రబాబు, జిల్లా ప్రధానకార్యదర్శి ఆరేటివాసు, జిల్లా కార్యదర్శి మోపూరి మనోహర్‌లు విమర్శించారు.

రాజ్యసభకు సుజన, టిజి

విజయవాడ, మే 30: రాజ్యసభ స్థానానికి పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరికి తిరిగి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన టిజి వెంకటేష్‌కు రాజ్యసభ టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అభ్యర్థులను ప్రకటించారు. మూడో అభ్యర్థిగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు టిక్కెట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేసి, తమ పార్టీ అభ్యర్థికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని కోరడంతో, కాదనలేకపోయానని అన్నారు.

‘మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆర్థిక అంశంగా చూడొద్దు’

రామచంద్రాపురం, మే 30: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మించుకుంటున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆర్థిక అంశంగా పరిగణించరాదని, సామాజిక అంశంగా చూడాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పెంచలకిషోర్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పరిస్థితులను తెలుసుకునేందుకు మండల స్థాయి ఇంజనీర్లతో ఉపాధిహామీ సిబ్బంది, క్లస్టర్ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఇఓ మాట్లాడుతూ ఆరుబయట బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాదులు విసర్జిస్తే కలిగే సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు.

Pages