S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సత్తెనపల్లి’ స్వచ్ఛమేనా?

సత్తెనపల్లి, మే 30: స్వచ్చ సత్తెనపల్లిగా భాసిల్లుతున్నా, మరుగుదొడ్ల నిర్మాణంలో గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కి రచ్చ గెలిచినా ఇంట మాత్రం ఇంకా గెలవనేలేదు. నియోజక వర్గంలోని మారుమూల గ్రామల్లో సైతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూసి రికార్డు సృష్టించిన ఈ నియోజకవర్గంలో అసలైన నియోజకవర్గ కేంద్రమే స్వచ్ఛంగా లేదు. పట్టణ నడిబొడ్డున మున్సిపల్ అఫీసుకు కూతవేటు దూరంలోవున్న స్వీపర్స్ కాలనీవాసులకు మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఒక్కో ఇంటిలో నాలుగైదు కుటుంబాలు నివసించాల్సిన పరిస్థితి నెలకొంది. వీరు పడే అగచాట్లు అన్నీ ఇన్నీకావు.

ఇంకుడుగుంత తప్పనిసరి!

భీమవరం, మే 30: రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇక నుంచి నిర్మించబోయే ప్రతీ భవనంలో ఇంకుడుగుంత తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సోమవారం అదేశించింది. ఆ ఇంకుడుగుంతను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన ఆమోదం కోసం సమర్పించే ప్లాన్‌లోనే ఇంకుడుగుంత ఎక్కడ నిర్మించేదీ చూపించాల్సి ఉంటుంది. 100 చదరపు మీటర్ల శ్లాబ్ కలిగిన ప్రతీ ఇంటికి 6 క్యూబిక్ మీటర్ల గుంతను ఏర్పాటుచేసి, దాన్ని జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

హడలిన చిలకలూరిపేట

చిలకలూరిపేట, మే 30: ఒక పిచ్చికుక్క స్వైరవిహారంతో సోమవారం పేట హడలిపోయింది. ఆ కుక్క దాడిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని సుభానినగర్, రాజన్నపాలెం, అడ్డరోడ్డు సెంటర్, సుబ్బయ్యతోట ప్రాంతాల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేసి రోడ్డుపైనున్న వారిపై దాడిచేసింది. తొలుత సుభాని నగర్‌కు చెందిన షేక్ మాబు సుభాని (19), షేక్ దరియావలి (16), షేక్ మున్నా (13), షేక్ బాజిత్ (4), షేక్ షకీలా (30), షేక్ రహమాన్ (24), షేక్ షఫి (5)లపై దాడిచేసి గాయపర్చింది.

ఎసిఎ కృషి ఆదర్శనీయం

మంగళగిరి, మే 30: యువ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) చేస్తున్న కృషి ప్రశంసనీయమని, మిగతా అసోసియేషన్లకు ఆదర్శనీయమని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ అన్నారు. మంగళగిరి పట్టణ శివారులోని ఉడాటౌన్‌షిప్‌లో ఆంధ్రాక్రికెట్ అసోసియేన్ ఆధ్వర్యాన నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన ఇండోర్ అ కాడమీని సోమవారం బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

2న నవనిర్మాణ దీక్ష

గుంటూరు, మే 30: ప్రభుత్వ ఆదేశాల మేరకు, జూన్ 2వ తేదీన నగరంలోని పోలీసు పెరెడ్‌గ్రౌండ్స్‌లో జరిగే నవ నిర్మాణ దీక్ష విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నియోజకవర్గ అధికారులతో సమావేశమయ్యారు. దీక్షా కార్యక్రమం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరగాలని, ప్రజాప్రతినిధులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.

దేశంలో 1.8 కోట్ల ఇళ్ల కొరత

విశాఖపట్నం, మే 30: దేశంలో ఇప్పటికీ 1.8 కోట్ల ఇళ్ల కొతర ఉందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి, హౌసింగ్ ఫర్ ఆల్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రి అభిజిత్ అన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల మున్సిపల్ అధికారులు, గృహనిర్మాణ సంస్థల అధికారులతో సోమవారం విశాఖలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.

స్టేడియంలో ఇంకుడు గుంతలకు స్పీకర్ శంకుస్థాపన

నరసరావుపేట, మే 30: పట్టణంలోని సత్తెనపల్లిరోడ్డులో ఉన్న డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో సోమవారం ఉదయం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇంకుడుగుంతలకు శంకుస్థాపన చేశారు. స్టేడియంలోని వాకర్స్‌ట్రాక్‌కు సమీపంలో మూడు ప్రాంతాల్లో మూడు ఇంకుడుగుంతలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వాకర్స్‌తో కలిసి స్పీకర్ కోడెల వాకింగ్ చేశారు. కొద్ది సేపు షటిల్ ఆడారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ 200కోట్ల రూపాయల విలువైన స్టేడియంలో పట్టణ ప్రజల కోసం అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామని అన్నారు.

రాజీనా..? రాజకీయమా!?

హైదరాబాబాద్, మే 30: రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన ఓటుకు నోటు కేసు చివరకు రెండు రాష్ట్రాల సిఎంల మధ్య రాజీ కుదిర్చి సద్దుమణిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు రాష్ట్రాల్లో కీలక మార్పులకు దోహదమైంది. పదేళ్ల ఉమ్మడి రాజధాని సౌకర్యం ఉన్నా ఆంధ్ర సిఎం చంద్రబాబు రాజధానిని విజయవాడకు తరలించారు. గతంలో ఇద్దరు సిఎంలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు తగ్గించారు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో కెసిఆర్‌నే లక్ష్యం చేసుకుని చంద్రబాబు ఉపన్యాసాలు చేశారు.

కాంగ్రెస్ హయాంలోనే పేట అభివృద్ధి: మాజీ మంత్రి కాసు

నరసరావుపేట, మే 30: నరసరావుపేట పట్టణాన్ని ఒక ఉన్నతమైన పట్టణంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తీర్చిదిద్దడం జరిగిందని మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఈమేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించి రిక్షాలు, ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించి క్లీన్ నరసరావుపేటగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలోనే మొత్తం సిమెంట్ రోడ్లు కలిగిన పట్టణంగా చేశామని అన్నారు. భూగర్భ డ్రైనేజ్ పథకాన్ని తీసుకువచ్చి, మురుగు నుండి శాశ్వత పరిష్కారాన్ని చేశామన్నారు.

చౌక్‌బాల్ పోటీలకు విశేష స్పందన: మన్నవ

గుంటూరు, మే 30: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈనెల 28, 29, 30 తేదీల్లో ఏపి చౌక్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో 9వ జూనియర్ జాతీయ చౌక్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. సోమవారం ముగింపు సందర్భంగా పోటీల్లో విజేతలకు ఏపి స్టేట్ చౌక్‌బాల్ సంఘం అధ్యక్షుడు దామచర్ల శ్రీనివాసరావు అధ్యక్షతన ఎన్‌టిఆర్ స్టేడియంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ నవ్యాంధ్ర నూతన రాజధానిలో జాతీయ స్థాయిలో చౌక్‌బాల్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Pages