S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదలైన టి.ఎమ్సెట్-2

హైదరాబాద్, మే 30: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్-2 నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 1నుండి స్వీకరించనుంది. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువమందికి హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాలకు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలోని వివిధ వర్శిటీల్లోని కేంద్రాలను ఇప్పటికే ఎమ్సెట్ అధికారులు మాట్లాడి ఉంచారు. ఎక్కువమంది హైదరాబాద్ నుంచే పరీక్షకు హాజరుకావచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రజా సంక్షేమమే మోదీ లక్ష్యం

నెల్లూరు టౌన్, మే 30: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో రెండేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఏడు వందలకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పి సురేంద్రరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్మూర్తినగర్‌లో ఉన్న బిజెపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు విజయ్‌పర్వం అనే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్లి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకి తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

ధన రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయవు

కావలి, మే 30: ధన రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయవని, రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సాయిరెడ్డి విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుయుక్తులకు పాల్పడుతున్నారని, సాయిరెడ్డి విజయాన్ని అడ్డుకోవడం ఆయన తరం కాదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 6వ వార్డు నుంచి వైసిపి తరపున కౌన్సిలర్‌గా ఎన్నికైన ఏడుంబాకల పోలయ్య ఇటీవల మృతిచెందగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సోమవారం ఉదయం మృతుని ఇంటి వద్దకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మంచినీటి సంప్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

బిట్రగుంట, మే 30: మంచినీటి సంప్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోవూరుపల్లిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అమ్మమ్మ, తాతయ్యల ఇంటి వద్ద వేసవి సెలవులు గడిపేందుకు వచ్చిన చిన్నారి బాలికలు బ్లేస్సి(6), మంగళవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సి వున్న నిస్సి(4) ఆడుకుంటూ ఇంట్లోగల మంచినీటి సంప్‌లో పడి ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచేసింది.

రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం ప్రారంభం

నెల్లూరు కలెక్టరేట్, మే 30: అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను సుందరీకరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి, పురపాలక మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని వనంతోటలో సోమవారం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన రోడ్ వాక్యూమ్ స్వీపర్ మిషన్ (రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ ఆంధ్ర శుభ్రత నిర్వహణకోసం ఆధునిక యంత్రాలను వినియోగించటం జరుగుతుందన్నారు. పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో నడిచే ఈ వాహనానికి రానున్న మూడేళ్లలో 1.67 కోట్లు వినియోగించనున్నామన్నారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

నెల్లూరు, మే 30: డ్వాక్రా, మెప్మా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. సోమవారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో మహిళా సాధికారిత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళలలో ఆర్థిక సాధికారితను పెంచి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నారన్నారు. నెల్లూరు కార్పొరేషన్, 7 పురపాలక సంఘాల పరిధిలో మెప్మా కింద 3 లక్షల 27వేల 638 సభ్యులున్నారని, వారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలలో 12 శాతంగా ఉన్నారన్నారు.

రాజ్యసభ ఆశావహులకు మొండి చేయి

నెల్లూరు కలెక్టరేట్, మే 30: రాజ్యసభ సీటు ఆశించిన జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ అధినాయకత్వం మొండిచేయి చూపింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రావు, రాజధాని నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఇటీవల వైకాపా నుండి టిడిపిలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు రాజ్యసభ సీటును ఆశించిన వారిలో ఉన్నారు. అయితే పార్టీ అధినాయకత్వం మూడు రాజ్యసభ సీట్లలో మిత్రపక్షమైన బిజెపికి ఒకటి కేటాయించి మిగిలిన రెండింటిలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సుజనాచౌదరికి మరోసారి అవకాశం ఇవ్వగా, మరొక సీటును టిజి వెంకటేశ్‌కు కేటాయించింది.

భూపంపిణీకి ధరాఘాతం!

హైదరాబాద్, మే 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ పథకానికి ‘్ధరాఘాతం’ తగిలింది. ఒక్కో దళిత కుటుంబానికి ఈ పథకం కింద మూడెకరాల భూమి ఇస్తామంటూ 2014 ఆగస్టు 15న సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఏటా 10 వేల మంది దళితులకు భూమి పంపిణీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే తదుపరి పరిణామాల్లో ఈ పథకం నెమ్మదించింది. ఒక్కో ఎకరాకు ఏడులక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, భూమి విక్రయించేందుకు ఆసామీలు ఎవరూ ముందుకు రావడం లేదన్నది వివిధ జిల్లాల నుండి అందుతున్న సమాచారం.

బైరెడ్డిపై కోపం మాపై చూపితే ఎలా!

కర్నూలు, మే 30:రాయలసీమ సమస్యలపై గళమెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై ఉన్న కోపాన్ని ప్రభుత్వం తమపై చూపితే ఎలా అంటూ పుష్కర పనులకు నోచుకోని కృష్ణా తీర గ్రామాల ప్రజలు సోమవారం నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో ఉన్న పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి, కొత్త ఎల్లాల, కొత్త వనుములపాడు గ్రామాలకు కృష్ణా పుష్కరాల నిధులు మంజూరు చేయలేదు. ఈ నాలుగు గ్రామాలు కూడా శ్రీశైలం జలాశయానికి అత్యంత సమీపంలో ఉన్నవే కాకుండా అన్ని గ్రామాల్లోనూ పురాతన ఆలయాలు ఉన్నాయి.

బసులదొడ్డి జలాశయానికి గండి

మత్రాలయం, మే 30: మండలపరిధిలోని రచ్చమర్రి సమీపంలో ఉన్న గురు రాఘవేంద్ర ప్రాజెక్టు బసుల దొడ్డి జలాశయానికి సోమవారం భారీ గండి పడి నీరు వృథా అయింది. విష యం తెలుసుకున్న కలెక్టర్ విజయమోహన్ హుటాహటీన జలయాశం వద్ద కు చేరుకుని గండిని పరిశీలించారు. స్థానిక అధికారులు వెంటనే పొక్లైనతో గండిని పొడ్చివేయించారు. జలాశయంపై పట్ల నిర్లక్షం దోరణి ప్రదర్శించిన ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005-2006 సంవత్సరంలో రచ్చమర్రి గ్రామ సమీపంలో తొమ్మిది గ్రామాల్లోని విస్తీరణంలో ఉన్న 6,750 ఎకరాలకు 65 ఎంసిఎఫ్‌టి నీటి సామర్థ్యం గల బసులదొడ్డి గురు రాఘవేంద్ర జలాశయ ఆయకట్టును ప్రభుత్వం నిర్మించింది.

Pages