S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభ బరిలో టిజి

కర్నూలు, మే 30 : రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక సభ్యుడిగా అధికార తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి టిజి వెంకటేష్‌ను బరిలోకి దించాలని నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సోమవారం నిర్వహించిన పలు సమీక్షలు, సమావేశాల అనంతరం టిజి వెంకటేష్ పేరును ఖరారు చేశారు. టిడిపి తరపున నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయిస్తే పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో టిజి ఎన్నిక కావడానికి పోలింగ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సి ఉంటుంది. నాలుగో అభ్యర్థిపై వెనక్కి తగ్గితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.

సిద్దేశ్వరం అలుగుకు నేడు శంకుస్థాపన

కర్నూలు, మే 30:రాయలసీమ భవిష్యత్తు కోసం ఎంతో ప్రాధాన్యత ఉన్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేశారు. రాయలసీమ రైతు సంఘం, సిద్దేశ్వరం అలుగు సాధన సమితి, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పూర్తి చేసి తీరుతామని రైతు లు ధీమాతో ఉన్నారు. ఆంగ్లేయుల కాలం నుంచి రాయలసీమ రైతులను ఊరిస్తున్న సిద్దేశ్వరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర అవతరణతో శ్రీశైలం తరలించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారని రైతులు మండిపడుతున్నారు.

రాజ్యసభకు నేడు నామినేషన్ల దాఖలు

హైదరాబాద్, మే 30: తెలంగాణలో రెండు, ఆంధ్రలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు రెండు రాష్ట్రాల్లోనూ మంగళవారం చివరి రోజు. తెలంగాణలో పోటీలేకుండా ఇప్పటికే ఎన్నికలు ఏకగ్రీవమని తేలిపోయింది. తెలంగాణలోని రెండు స్థానాలనూ తెరాస అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కైవసం చేసుకోనున్నారు.

ప్రజల సమస్యలు పరిష్కరించని ఉద్యోగులపై వేటు

కర్నూలు, మే 30: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను వారం లోగా పరిష్కరించకపోతే సంబంధిత కార్యాలయ ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ విజయమోహన్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటిపై వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇని ఆదేశించారు.

పత్తికొండలో కృష్ణానది ప్రవహిస్తుందా..

నందికొట్కూరు, మే 30 : కృష్ణా పుష్కరాల పేరుతో టిడిపి నాయకులు జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారని, కృష్ణానది పరివాహక గ్రామాల అభివృద్ధిని పక్కనబెట్టి ఎక్కడో వుండే పత్తికొండ నియోజకవర్గంలో ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం ఏంటని, అక్కడ కృష్ణానది ప్రవహిస్తుందా అని ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి, కొత్తముచ్చుమర్రి, వనములపాడు, ఎల్లాల గ్రామాల్లో సోమవారం బైరెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

రాయలచెరువు నీటిని వృథా చేయొద్దు

పెద్దకడబూరు, మే 30: రాయల చెరువునీటిని వృథా చేయవద్దని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామ శివారుల్లో ఉన్న రాయల చెరువును కలెక్టర్ పరిశీలించారు. రాయలచెరువు విస్తీర్ణం, చెరువు కింద ఆయకట్టును, చెరువునీటి సామర్థ్యం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న పెద్ద చెరువుల్లో రాయలచెరువు ఒకటి అని, సుమారు 1400 ఎకరాల విస్తీర్ణంలో రాయలచెరువు ఉందని అధికారులు తెలిపారు. 225 ఎఫ్‌సి, ఎస్‌పి నీటి సామర్థ్యం కలిగి ఉందని, చెరువు కింద 923 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

డిజిపి రాముడును కలిసిన డిఐజి, ఎస్పీ

కర్నూలు, మే 30:రాష్ట్ర డిజిపి జెవి రాముడు అనంతపురం వెళ్తూ సోమవారం ఉదయం కర్నూలు పోలీసు అతిథి గృహం చేరుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, 2వ బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి డిజిపికి పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిజిపి జిల్లాలో శాంతి భద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిఐలు నాగరాజారావు, మధుసూదన్‌రావు, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సిఐ ఇంటిలో వికసించిన మే పుష్పం

నందికొట్కూరు, మే 30:నందికొట్కూరు సిఐ శ్రీనాథరెడ్డి నివాసంలో సోమవారం మే పుష్పం వికసించింది. సిఐ ఇంటి ఆవరణలో పూలమొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే మే పుష్పం గార్డెన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మైనార్టీల సంక్షేమానికి రూ. 370 కోట్లు మంజూరు

చాగలమర్రి, మే 30: రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి టిడిపి రూ.370 కోట్లను ఈ ఏడాది కింద కేటాయించినట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుసేన్ తెలిపారు. సోమవారం చాగలమర్రిలో ఆయన మాట్లాడుతూ అలాగే బిసి కార్పొరేషన్ కింద రూ.842 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.836 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ కింద రూ.60 కోట్లు, కాపు కార్పొరేషన్ కింద రూ. 100 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర విభజనతో రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా సిఎం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీని చేశారన్నారు.

వీడిన వైకాపా నేత హత్యకేసు మిస్టరీ

డోన్, మే 30:మండల పరిధిలోని గుండాల దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్, వైకాపా నేత కౌలుట్లయ్య హత్య కేసు మిస్టరీని డోన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ బాబాఫకృద్దీన్ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని గుండాల గ్రామానికి చెందిన కౌలుట్లయ్యను ఈ నెల 15వ తేదీ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోట్రాయి గ్రామానికి చెందిన నగేష్‌కు కౌలుట్లయ్యకు మధ్య పాతకక్షలు వుండేవన్నారు.

Pages