S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/13/2018 - 01:06

పోర్ట్ ఎలిజబెత్, మార్చి 12: ఆస్ట్రేలియాతో ఇక్కడి సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్‌లోనూ ప్రత్యర్థిని 79 ఓవర్లలో 239 పరుగులకే ఔట్ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 22.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.

03/13/2018 - 01:05

పోర్ట్ ఎలిజబెత్, మార్చి 12: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుమ్యాచ్‌ల తొలి ఇన్నింగ్స్‌లో అతని వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఆడకుండా అతనిపై నిషేధం విధించారు.

03/13/2018 - 01:04

న్యూఢిల్లీ, మార్చి 12: జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నదేన ముద్ర వేసుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో, అద్భుతమైన కెప్టెన్సీతో ఈ పరుగుల వీరుడు ఇప్పటికే ఎన్నో చరిత్రాత్మక రికార్డులు బద్దలుకొట్టాడు. అయితే త్వరలోనే విరాట్ కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం.

03/13/2018 - 01:02

ముంబయి, మార్చి 12: అంతర్జాతీయ స్థాయిలో టీ-20 క్రికెట్‌కు రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న దేశవాళి క్రికెట్ పోటీలో ఐపీఎల్ టీ-20 క్రికెట్ లీగ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు బంపర్ ఆఫర్. ఇక నుంచి బీసీసీఐ ఒక్కో జట్టుకు ఏడాదికి రూ.250 కోట్లు ఇవ్వనుంది.

03/13/2018 - 01:02

ముంబయి, మార్చి 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ టైటిల్ కొత్త స్పాన్సర్‌ని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఐదేళ్లు టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎం వ్యవహరించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. పేటీఎం ఇండియన్ క్రికెట్‌కు టైటిల్ స్పాన్సర్‌గా ఉండనుంది. ఈ సంబంధాలు ఈ ఏడాది ఐపీఎల్‌కు కొనసాగుతున్నాయి.

03/13/2018 - 01:01

కొలంబో, మార్చి 12: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో నిర్వహిస్తున్న ముక్కోణపు నిదహాస్ టీ-20 ఇంటర్నేషనల్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలిదశలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

03/12/2018 - 07:27

ఢిల్లీ, మార్చి 11: మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్‌లో భారత యువ షూటర్లు అదరగొడుతున్నారు. తాజాగా అఖిల్ షెరాన్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ పోటీలో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ ఆరంగేట్రంలోనే పతకం సాధించిన భారత నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

03/12/2018 - 07:10

కోల్‌కతా, మార్చి 11: ఇప్పటికే తనపై శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం, హత్యాయత్నానికి పాల్పడడం వంటి చర్యలపై భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అతని భార్య హసీన్ జహాన్ ఆదివారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన భర్తకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయనడానికి, అతను వారితో సంభాషించిన అంశాలు అతని నుంచి సేకరించిన కాల్ డేటా తనకు మంచి ఆయుధంగా నిలిచిందని ఆమె పేర్కొంది.

03/12/2018 - 07:08

కొలంబో, మార్చి 11: శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్‌పై మిగిలిన టీ-20 మ్యాచ్‌లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేటు కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది. రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ..నిర్ణీత సమయానికి లంక బౌలర్లు నాలుగు ఓవర్లు తక్కువ వేశారని, దీంతో మ్యాచ్ అధిక సమయం కొనసాగిందని చెప్పారు.

03/12/2018 - 07:08

భీమవరం, మార్చి 11: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 31వ ఫెడరేషన్ కప్ వాలీబాల్ ఛాంపియన్ షిప్-2018 ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ వరకు ఈ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహిస్తారు. పౌరసరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ పోటీలను ప్రారంభించారు.

Pages