S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/24/2016 - 05:46

మనె్హయిమ్ (అమెరికా), జూలై 23: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తుది సన్నాహాలు చేసుకుంటున్న భారత మహిళా హాకీ జట్టు అమెరికా పర్యటనలో మరో విజయంతో సత్తా చాటుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో 5-2 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించి ఈ పర్యటనలో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

07/24/2016 - 05:44

కోల్‌కతా, జూలై 23: భారత హాకీ జట్టు సారథులను తరచుగా మార్చడం సరైన పద్ధతి కాదని, ఇది తర్కానికి విరుద్ధమని మాజీ కెప్టెన్, ఒలింపియన్ గురుబక్ష్ సింగ్ స్పష్టం చేశాడు.

07/24/2016 - 05:41

బెంగళూరు, జూలై 23: రియో ఒలింపిక్స్‌లో నేరుగా సెమీ ఫైనల్స్ కాకుండా మధ్యలో క్వార్టర్ ఫైనల్స్‌ను ప్రవేశపెడుతూ పోటీ ఫార్మాట్‌లో మార్పులు చేయడం భారత్‌తో పాటు మరి కొన్ని చిన్న టీములకు కూడా లాభదాయకమని భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ అభిప్రాయ పడ్డాడు. ‘గ్రూపులో అర్జెంటీనా, జర్మనీ, హాలాండ్ లాంటి జట్లు ఉన్నప్పుడు టాప్ టూ జట్లుగా నిలవడం చాలా కష్టం.

07/24/2016 - 05:39

ముంబయి, జూలై 23: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో ఎడిషన్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో పాట్నా పైరేట్స్ జట్టు మళ్లీ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 31-28 పాయింట్ల తేడాతో పునేరీ పల్టన్‌ను మట్టికరిపించింది.

07/24/2016 - 05:38

నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా), జూలై 23: ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడమే తనకు ఎంతో ఇష్టమని, అదే తన దీర్ఘకాలిక లక్ష్యమని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ సెంచరీ చేయడం తెలిసిందే. అంతేకాదు, అయిదో వికెట్‌కు కోహ్లీతో కలిసి 168 పరుగులు జోడించాడు.

07/24/2016 - 05:38

ముంబయి, జూలై 23: మాజీ అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ రిఫరీ టిపి.సుబ్రమణియన్ శనివారం ముంబయిలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సుబ్రమణియన్ నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది గత వారమే ఇంటికి తిరిగి వచ్చారని, గురువారం ఉదయం ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు శనివారం వెల్లడించాడు.

07/24/2016 - 05:37

మార్లో (ఇంగ్లాండ్), జూలై 23: ఇంగ్లాండ్ పర్యటనలో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు దుమ్మురేపింది. మార్లోలోని బిషామ్ అబ్బే స్పోర్ట్ సెంటర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ సీనియర్ జట్టును 1-2 గోల్స్ తేడాతో మట్టికరిపించి శుభారంభాన్ని సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టుకు నీలకంఠ పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్‌ను అందించాడు.

07/23/2016 - 01:33

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 22: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. ఆతిథ్య వెస్టిండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటుకున్న కోహ్లీ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డు సృష్టించాడు.

07/23/2016 - 01:30

మాంట్రియల్, జూలై 22: ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రీడాకారులు డోపింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలతో తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న రష్యాను ప్రస్తుతం రియో ఒలింపిక్స్ నుంచి సంపూర్ణ నిషేధానికి గురయ్యే ప్రమాదం వెంటాడుతోంది.

07/23/2016 - 01:30

ముంబయి, జూలై 22: స్టార్‌స్పోర్ట్స్ ప్రోకబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాట్నా పైరేట్స్‌ను 29-22 పాయింట్ల తేడాతో ఓడించి ఎనిమిదో వజయం సాధించింది. తొలి అర్ధ్భాగం ముగిసే సరికి 9-11 పాయింట్ల తేడాతో వెనకబడి ఉన్న పింక్ పాంథర్స్ రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే సూపర్ టాకిల్ ద్వారా స్కోరును 13 పాయింట్ల వద్ద సమం చేయగలిగింది.

Pages