S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/04/2016 - 03:27

బ్యూనస్ ఎయిర్స్, సెప్టెంబర్ 3: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గాయపడ్డాడు. ఫలితంగా, 2018 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వెనుజులాతో జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహింబోవడం లేదని ఇటీవల ప్రకటించిన మెస్సీ ఆతర్వాత మనసు మార్చుకున్న విషయం తెలిసిందే.

09/04/2016 - 03:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొన్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే దులీప్ ట్రోఫీ డేనైట్ మ్యాచ్ నుంచి విశ్రాంతి లభించే అవకాశాలున్నాయ. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో అ తనికి తగినంత విశ్రాంతి అవసరమని బిసిసిఐ ఆలోచి స్తున్నట్టు సమాచారం.

09/04/2016 - 03:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: చాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణకుగాను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి ఏకంగా 135 మిలియన్ డాలర్లను చెల్లించాలన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈఏడాది మార్చి 8 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు భారత్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను నిర్వహించారు.

09/04/2016 - 03:23

ఇండోర్, సెప్టెంబర్ 3: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) లైఫ్ ప్రెసిడెంట్‌గా అనిల్ ఖన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే క్రీడా విధివిధానాలు ఇంకా ఖరారు కానందున అతను బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించాడు. శనివారం ఇక్కడ జరిగిన ఎఐటిఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఖన్నాను లైఫ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. 23 సభ్య సంఘాల ప్రతినిధులంతా ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు.

09/03/2016 - 07:59

న్యూయార్క్, సెప్టెంబర్ 2: కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ జోరును కొనసాగిస్తున్నది. స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, ఏడోసారి ఈ టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో వానియా కింగ్‌ను 6-3, 6-3 తేడాతో చిత్తుచేసింది. సెరెనా విజృంభణకు వానియా ఏ దశలోనూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది.

09/03/2016 - 07:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: లండన్ ఒలింపిక్స్‌లో మరో డోప్‌కేసు బయట పడడంతో, భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌ను అదృష్టం వరించి, స్వర్ణ పతకం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ. 2012 లండన్ ఒ లింపిక్స్ పురుషుల రెజ్లింగ్ 60 కిలోల విభా గంలో యోగేశ్వర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

09/03/2016 - 07:55

కింగ్‌స్టన్, సెప్టెంబర్ 2: రియో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని, ఒకానొక దశలో ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనడమే అనుమానంగా కనిపించినప్పటికీ, మూడు స్వర్ణ పతకాలను సాధించి సత్తాచాటిన జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఎలాంటి చడీచప్పుడు లేకుండా కింగ్‌స్టన్ చేరాడు.

09/03/2016 - 07:55

ముంబయి, సెప్టెంబర్ 2: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన బాడ్మింటన్ స్టార్ పివి సింధును మహారాష్ట్ర బాడ్మింటన్ సంఘం (ఎంబిఎ) శుక్రవారం ఘనంగా సన్మానించింది. సింధును, జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌ను సత్కరించిన అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన వారిని గౌరవించడం మన ధర్మమని అన్నారు.

09/03/2016 - 07:54

సిడ్నీ, సెప్టెంబర్ 2: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కురువృద్ధుడు లెన్ మాడోక్స్ మృతి చెందాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా అతను 1954-56 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు ఏడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. రిటైర్మెంట్ తర్వాత, 1977లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన ఆసీస్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించాడు.

09/03/2016 - 07:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: తన భర్తపై విమర్శలు గుప్పిస్తూ, వేధించడాన్ని మానుకోవాలని భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య మాయంతి లాంగర్ ట్వీట్ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు సంతోషిస్తారేమోగానీ, బాధితులు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దుర్భరంగా ఉంటుందని టీవీ ప్రెజెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె పేర్కొంది. పనిలేని వారు ఉద్దేశపూర్వకంగా స్టువర్ట్‌ను వేధిస్తున్నారని ఆరోపించింది.

Pages