S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/19/2017 - 01:54

విజయవాడ, నవంబర్ 18: అమరావతి పిల్లలు దేశానికి పెద్ద ఆస్తి అని, వీరికి తోడ్పాటు అందిస్తే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారని సీఎం చంద్రబాబు కితాబునిచ్చారు. రాజధాని అమరావతిని 50 శాతం పచ్చదనంతో గ్రీన్, బ్లూ సిటీగా తయారు చేస్తామన్నారు. శనివారం రాజధాని ప్రాంతం మందడం గ్రామ పరిధిలోని డౌన్ ట్రేడన్ యాక్సిస్ రోడ్డువద్ద వనం-మనంలో భాగంగా మొక్కలు నాటారు.

11/19/2017 - 01:07

హైదరాబాద్, నవంబర్ 18: సినీ మేనేజింగ్ పార్టనర్ల ఆస్తుల వివాదం పోలీస్ ఠాణాకు ఎక్కింది. 12ఏళ్లుగా భాగస్వామ్యం ఉన్న వ్యాపారం వీడిపోయింది. తన అనుమతి లేకుండానే భూములు అమ్మాడని ఆరోపిస్తూ తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్‌పై అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్ సహ 13మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

11/19/2017 - 01:02

హైదరాబాద్, నవంబర్ 18: ‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో గుణాత్మక మార్పులు వస్తాయని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక వాఖ అధ్వర్యంలో శనివారం రవీంద్ర భారతిలో సినీ వారం కార్యక్రమంలో భాగంగా ‘చదువుకోవాలి’ సినిమా ప్రదర్శన జరిగింది.

11/19/2017 - 00:44

హైదరాబాద్, నవంబర్ 18: అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు రంగం సిద్ధం అవుతోంది. 150 దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు. సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో 800 మంది మహిళలే కావడం విశేషం. కనీసం 10 దేశాల నుండి వచ్చే వారంతా మహిళలే కావడం ఈ సదస్సు ప్రత్యేకత కాబోతోంది. ఆఫ్గనిస్తాన్, సౌదీ, ఇజ్రాయిల్ వంటి దేశాల ప్రతినిధులు అంతా మహిళలే.

11/19/2017 - 04:39

సంగారెడ్డి, నవంబర్ 18: అంచెలంచలుగా దేశంలోనే అత్యున్నతమైన రెండవ పదవిని చేపట్టే స్థాయి వరకు స్వశక్తితో ఎదిగానని, పదవుల కోసం తాను ఎన్నడూ ఎవరి కాళ్లూ మొక్కలేదని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నందమూరి తారక రామారావు కాళ్లు మొక్కిన వారే అనంతరం ఆయనను లాగి పడేసారని చెప్పారు.

11/18/2017 - 03:54

తిరుపతి, నవంబర్ 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అవతారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

11/18/2017 - 03:13

అమరావతి, నవంబర్ 17: సింగపూర్‌లోని ఉత్తమ విధానాలను మలిదశలో ఏపీలో అమలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక అందించడమే కాకుండా అనేక అంశాల్లో సింగపూర్ భాగస్వామి కావడం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేలిమలుపుగా ఆయన అభివర్ణించారు.

11/18/2017 - 02:46

హైదరాబాద్, నవంబర్ 17: అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు హేమా హేమీలు హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె , శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ హాజరుకానున్నారు.

11/18/2017 - 01:40

హైదరాబాద్, నవంబర్ 17: ముస్లిం మైనార్టీలకు ప్రస్తుతం విద్యా, ఉద్యోగాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా రాజస్తాన్ ప్రభుత్వం అక్కడ గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో బీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 49 నుంచి 54 శాతానికి చేరింది.

11/18/2017 - 01:39

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే వచ్చే నెల 4నుంచి తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం అసెంబ్లీలో ‘రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు- నూతన పాలనా వ్యవస్థ’ అనే అంశంపై స్వల్ప వ్యవధి ప్రశ్న నియమం కింద చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కె.

Pages