S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/17/2017 - 02:59

ఖైరతాబాద్, నవంబర్ 16: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సీఎల్పీ నేత జానారెడ్డి గురువారం అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జానారెడ్డికి వివిధ పరీక్షలు జరిపిన యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన ఊపీరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని నిర్ధారించారు.

11/17/2017 - 02:58

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్‌లో ఓ టిఆర్‌ఎస్ నేత హత్యకు గురయ్యాడు. వల్లభనేని శ్రీనివాసరావు అనే నాయకుడు సనత్‌నగర్ బస్టాండ్ సమీపంలో హత్యకు గురై ఉండడాన్ని గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు టిఆర్‌ఎస్ నేత శ్రీనివాసరావును బుధవారం అర్ధరాత్రి దాటాక తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

11/17/2017 - 02:56

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను ద్వితీయ అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ అధికార భాష చట్టానికి సవరణ చేస్తూ, ప్రతిపాదించిన బిల్లును ముఖ్యమంత్రి తరఫున రోడ్లు, భవనాల మంత్రి తుమ్మలనాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు చేసిన సూచనల తర్వాత ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

11/17/2017 - 02:55

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ధార్మిక పరిషత్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో చేసిన సవరణల బిల్లుపై శాసనసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ పరిపాలన సజావుగా సాగేందుకు ధార్మికపరిషత్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

11/17/2017 - 02:47

హైదరాబాద్, నవంబర్ 16: పులుల మనుగడతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చని జాతీయ పులుల సంరక్షణ విభాగం (దక్షిణాది) ఐజి పిఎస్ సోమశేఖర్ అన్నారు. జనవరి నుంచి దేశ వ్యాప్తంగా పులుల గణన మొదలు కాబోతోందని, అదే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తొలిసారి పులుల గణన అవుతుందని అన్నారు.

11/17/2017 - 02:45

హైదరాబాద్, నవంబర్ 16: ‘ఎప్పడు అప్పులు...్ఫజు రియింబర్స్‌మెంట్ ఇవ్వేనా సమస్యలు, ఇంకే సబ్‌జెక్ట్ లేదా? వినీవినీ మరీ రోటీన్‌గా అనిపించడం లేదా? కొత్త విషయాలుంటే చెప్పకూడదా?’ అని విపక్షాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సుతిమెత్తగా మందలించారు. ‘బంగారు తెలంగాణ అంటే రాత్రికి రాత్రి బంగారు తెలంగాణగా మారుస్తామని కాదు, ఆ దిశగా అడుగులు వేస్తామని అర్థం’ అన్నారు.

11/17/2017 - 02:33

ఏలూరు, నవంబర్ 16: కృష్ణాడెల్టాకు జీవం పోసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం, రాష్ట్రానికి జీవనాడి కానున్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రజాప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబును అపర భగీరథుడంటూ ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రతిఒక్కరూ కళ్లారా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించిన సంగతి తెల్సిందే.

11/17/2017 - 02:24

విశాఖపట్నం, నవంబర్ 16: ‘వ్యవసాయ రంగంలో సంస్కరణలకు అంకురార్పణ జరిగింది. మరో పాతికేళ్లలో వీటి ఫలితాలను మనం చూడగలుతాం. అప్పటికి అభివృద్ధి చెందిన దేశాలకన్నా భారత్ వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలుస్తుంద’ని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఇక్కడ ‘ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017’ రెండో రోజు గురువారం జరిగిన సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు.

11/17/2017 - 02:24

విశాఖపట్నం, నవంబర్ 16: పరిశ్రమల కన్నా వ్యవసాయానికే అధిక ప్రాధాన్య ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ప్రతి సోమవారం వ్యవసాయంపై సమీక్ష జరుపుతామని, లోవా యూనివర్శిటీ సహకారంతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలతో అధిక ఉత్పత్తులను సాధిస్తే వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటుందన్నారు.

11/17/2017 - 02:20

రాజమహేంద్రవరం, నవంబర్ 16: దేశంలోని నదీ పర్యాటక యాత్రల్లో కీలకమైనదిగా భావించే పాపికొండలు విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేకు పడింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలోవుంచుకుని తూర్పు గోదావరి జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిలో ఇటీవలి బోటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరిలో పాపికొండలు విహార యాత్రకు వినియోగిస్తున్న సుమారు వందకు పైగా బోట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Pages