S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/05/2017 - 00:17

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో ఆధునిక విధానాల్లో అంబేద్కర్ భవనాలను నిర్మిస్తున్నామని దళిత సంక్షేమ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో అంబేద్కర్ భవన నిర్మాణాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

12/04/2017 - 04:37

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించేందుకు ముందస్తుగా ఖరారు చేసి అమలు చేస్తున్న ప్రణాళికల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ వడివడిగా అడుగులు వేస్తోంది. 2018లో రాష్ట్ర గ్రిడ్‌కు అదనంగా మూ డు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి అనుసంధానం చేయనున్నారు.

12/04/2017 - 04:37

హైదరాబాద్, డిసెంబర్ 5: హైదరాబాద్ నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, షాపింగ్ మా ల్స్ వద్ద, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే షీ టీమ్స్ బృందాలు తమ విధులు నిర్వహిచేవి. మెట్రో రైళ్లు ప్రారంభం కావడంతో మెట్రో స్టేషన్లు, రైళ్లలో మహిళలకు భద్రత కోసం దేశంలోనే మొదటిసారిగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.

12/04/2017 - 04:36

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రప్రభుత్వాలు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ తెలుగు మహాసభలను 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహిస్తోంది. ఈ సభలను ప్రభుత్వం ఒక సవాల్‌గా స్వీకరించి భారీ ఏర్పాట్లు చేస్తోంది.

12/04/2017 - 04:36

కరీంనగర్, డిసెంబర్ 3: ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాల పాలన కొనసాగిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. రాచరిక పాలనకు తెరలేపిన కేసీఆర్ ప్రజల బాగోగులు మరిచారని మండిపడ్డారు.

12/04/2017 - 03:56

సూర్యాపేట, డిసెంబర్ 3: సమైక్య పాలనలో తెలంగాణలోని విద్యుత్‌రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడితే తెలంగాణ చీకటిగా మారుతుందని కుట్రదారులు సృష్టించిన భయాందోళనలను తిప్పికొట్టేలా రాష్ట్రంలో రెప్పపాటు కూడ కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ది శాఖల మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

12/04/2017 - 03:54

మహబూబాబాద్, డిసెంబర్ 3: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ఆదివారం ఓవైపు ఆదివాసీలు, మరోవైపు లంబాడీలు పోటాపోటీగా బహిరంగసభలకు ఏర్పాట్లు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ ఆదివాసీలు డిమాండ్ చేస్తూ బహిరంగసభ ఏర్పాటు చేసుకోగా లంబాడీ హక్కుల ఆత్మగౌరవ సభ పేరుతో లంబాడీలు పెద్ద ఎత్తున అదే వేదికపై బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు.

12/04/2017 - 03:52

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3: ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్ధానాల వీరుడని, ఆచరణలో శూన్యుడని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడు తూ ఎన్నికలు సమీపిస్తున్నందున కేసీఆర్ కొత్త వాగ్ధానాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.

12/04/2017 - 03:50

ఏటూరునాగారం, డిసెంబర్ 3: చంద్రపుల్లారెడ్డి (సీపీ) బాట పేరుతో చందాలు వసూళ్ళే ధ్యేయంగా ఏర్పడిన సీపీఐ (ఎంఎల్) సీపీ దళ సభ్యులను ఆదివారం అరెసు టచేసి రిమాండుకు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్డే విలేఖరులకు తెలిపారు.

12/04/2017 - 03:48

పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 3: అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టి తీరుతామని భజరంగ్‌దళ్ జాతీయ కన్వీనర్ మనోజ్ వర్మ స్పష్టం చేశారు. హిందువులు దేవతగా పూజించే గోవులను రక్షించుకోవడానికి, దేశంలో కొనసాగుతున్న గోహత్యకు వ్యతిరేకంగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.

Pages