S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/13/2017 - 23:25

హైదరాబాద్, జూలై 13: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాదిరిగా తాము తోడేలు కాదని, ఆయన తోడేలు కాబట్టే ప్రతిపక్ష నేతలంతా గొర్రెల్లా కనిపిస్తున్నారని సిఎల్పీ ఉప నాయకుడు టి.జీవన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్ష నేతలను తోడేళ్లు అంటూ సిఎం కెసిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడిన తీరుపై స్పందించిన జీవన్‌రెడ్డి గురువారం నాడిక్కడ అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరుల సమావేశంలో తూర్పారబట్టారు.

07/13/2017 - 03:03

న్యూఢిల్లీ, జూలై 12: తెలంగాణలో త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. బుధవారం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సమావేశమై విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు తీరును సమీక్షించారు.

07/13/2017 - 03:02

హైదరాబాద్, జూలై 12: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 కోట్ల మొక్కలను నాటుతుండగా, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వర్తమాన సంవత్సరంలో దాదాపు 47 కోట్ల మొక్కలను నాటుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని వెస్ట్‌జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు.

07/13/2017 - 03:01

కరీంనగర్, జూలై 12: తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం మూడవ విడత కార్యక్రమం కరీంనగర్‌లో బుధవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది.

07/12/2017 - 03:26

కరీంనగర్, జూలై 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న హరితహారం మూడో విడత కార్యక్రమం మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఆరంభం కానుండగా, ఈ ఆకుపచ్చ యజ్ఞానికి రాష్ట్రం మొత్తం ముస్తాబైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు సిఎం కెసిఆర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండికాలనీ బతుకమ్మ కుంట వద్ద మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

07/12/2017 - 03:24

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్ మాఫియా కేసులో కొందరు విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, బాధితులను విచారణాధికారులు గుర్తించారు. అయితే వీరి పేర్లను గోప్యంగా ఉంచామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.

07/12/2017 - 03:23

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభలు, తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోలను మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా, సాహిత్య అకాడమీ లోగోను సిద్ధిపేటకు చెందిన చిత్రకారుడు ఎంవి రమణారెడ్డి రూపొందించారు.

07/12/2017 - 03:18

హైదరాబాద్, జూలై 11: పత్తి కొనుగోలుకు అదనంగా 66 కేంద్రాలను ప్రారంభించేందుకు సిసిఐ సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. మంగళవారం సిసిఐ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ చొక్క లింగం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మార్కెటింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిసిఐ సిఎండి చొక్క లింగం పాల్గొన్నారు.

07/12/2017 - 03:40

హైదరాబాద్, జూలై 11: హరితహారంలో ప్రజలు చురుగ్గా బ్యాస్వామ్యం అయ్యేలా గ్రీన్ బ్రిగ్రేడ్‌లు ఏర్పాటుకు విస్తృత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నుంచి హరితహారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/12/2017 - 03:14

హైదరాబాద్, జూలై 11: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. 2018 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి నాటికి 125 అడుగుల విగ్రహ ఏర్పాటు, స్మృతివనం పూర్తి చేయాలని చెప్పారు.

Pages