S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/10/2017 - 02:03

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఈ ఏడాది ఏప్రిల్‌లో జరుగనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లేఖ రాశారు. జాతీయ స్థాయిలో పది విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న శతాబ్ధి ఉత్సవాలకు హాజరు కావాలని లక్ష్మణ్ ఆ లేఖలో కోరారు.

02/10/2017 - 02:02

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద గోదాముల పూర్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావసిన గ్రాంట్ 132 కోట్ల రూపాయల కోసం కృషి చేయాలని మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో గురువారం సమీక్ష జరిపారు.

02/10/2017 - 02:00

హైదరాబాద్, ఫిబ్రవరి 9: వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెరాస పార్టీలు చీకటి మిత్రులుగా దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టిటిడిపి) అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. రానున్న 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెరమరుగవడం ఖాయమని అన్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తుకు టి-దేశం సందేశం అంటూ వచ్చిన వదంతులను రమణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

02/09/2017 - 07:15

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పరిశ్రమల్లో జల, వాయు, నీటి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై వేటు వేస్తామని రాష్ట్ర పర్యావరణ మంత్రి జోగురామన్న హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్‌పిసిబి) కార్యకలాపాలపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. జిల్లాల్లో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలను పునర్వ్యస్థీకరిస్తామని తెలిపారు.

02/09/2017 - 07:14

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిష్టాత్మక ‘పాలసీ మేకర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఉన్నత విద్యా రంగంలో ఐసిటి టెక్నాలజీ ఆధారంగా తీసుకు వచ్చిన సంస్కరణలు, తదనంతర ఫలితాలకు ఈ అవార్డు దక్కింది. న్యూ ఢిల్లీలో జరిగిన 2017 ఇండియన్ ఎడ్యుకేషన్ కానె్ఫరెన్స్‌లో 7వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కేటగిరిలో తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు లభించింది.

02/08/2017 - 04:10

వరంగల్, ఫివ్రబరి 7: భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగే మినీ మేడారం జాతరకు జిల్లా యంత్రాంగం ఏర్పా ట్లు పూర్తిచేసింది. మండ మెలిగె పండుగ పేరిట గిరిజనులు వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను నాలుగు రోజులపాటు కొలిచే ఈ జాతరకు గత కొంతకాలంగా సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతుండటంతో మినీ జాతరగా మారిపోయింది.

02/08/2017 - 04:08

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 7: నల్లగొండ జిల్లా చెర్వుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి అశ్వవాహన సేవ, దోపోత్సవం, వసంతోత్సవం, పుష్పోత్సవం, ఏకాంతసేవలు కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున సాగిన స్వామివారి అశ్వవాహన సేవలో అశ్వవాహన రూఢులైన ఆలయ పార్వతిజడలరామలింగేశ్వరులు ఆలయ తిరువీధుల్లో విహరించారు.

02/08/2017 - 04:08

మెదక్, ఫిబ్రవరి 7: పరమాత్మ లనేకం ఉన్నా దేవుడు ఒక్కడేనని శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి భజన మందిర ప్రాంగణంలో సహస్ర మహాచండీ యాగం కోసం చేస్తున్న ఏర్పాట్లను స్వామిజీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్వామిజీ మాట్లాడారు.

02/08/2017 - 04:06

హైదరాబాద్, ఫిబ్రవరి 7: పెద్దపల్లి జిల్లాలో గౌలివాడ గ్రామ పరిధిలో సుందిళ్ల బ్యారేజీ వల్ల ముంపునకు గురయ్యే 240 ఎకరాలను రైతుల నుంచి తీసుకోరాదని , రైతులను అక్కడి నుంచి తరలించరాదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2013 భూసేకరణ చట్టం కింద భూమి సేకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ భూములను స్వాధీనం చేసుకోరాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

02/08/2017 - 04:05

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ప్రాతిపదికన టీచర్లుగా పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో ఏడువేలకుపైగా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళన చేపట్టారు.

Pages