S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/06/2017 - 04:41

హైదరాబాద్, ఫిబ్రవరి 5:‘జిల్లాల అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక తయారు కావాలి. ఇప్పుడు మీ జిల్లా ఎలా ఉంది? పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించి, దాని ప్రకారం పనిచేయండి’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం 19.5 శాతం వృద్ధిరేటుతో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఆర్థిక వనరులను సమకూర్చుకుని, వాటిని మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు.

02/06/2017 - 04:34

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కెపిఎంజి భారత్ విభాగం కొత్త చైర్మన్‌గా అరుణ్ ఎం కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు ఉంటారు. ఇంతకాలం రిచర్డ్ రెకీ చైర్మన్‌గా పనిచేశారు. కెపిఎంజి బోర్డు అరుణ్ ఎం కుమార్‌ను ఎన్నుకున్నారు. ఆయన ఇంతకాలం అమెరికాలో గ్లోబల్ మార్కెట్స్ వాణిజ్య విభాగం సహాయ కార్యదర్శిగా పనిచేశారు.

02/06/2017 - 02:27

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ ప్రభుత్వం భూపరిపాల ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) పోస్టును భర్తీలో తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలో పరిపాలనాపరంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు తర్వాత సిసిఎల్‌ఎ పోస్టు కీలకమైంది. గతాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి ఎంపిక చేసుకున్న అధికారిని సిసిఎల్‌ఎ పోస్టులో నియమిస్తూ వచ్చారు.

02/06/2017 - 02:24

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఐఎన్‌టియుసి కార్యకర్త కృషి చేయాలని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఆదివారం డాక్టర్ జిఎస్‌ఆర్ ఐఎన్‌టియుసి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

02/06/2017 - 02:22

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అఖిలపక్ష బృందానికి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయడం వెనుక ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

02/06/2017 - 02:18

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కరడుగట్టిన నేరస్థుడు నరుూం కేసులో ఇప్పటికైనా వాస్తవాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపిలను డిమాండ్ చేశారు.

02/06/2017 - 02:17

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఒత్తిడి లేని విద్యతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని వక్తలు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో సృజనాత్మక శక్తి ఉంటుందని, దానిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని అన్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఆదివారం సంజీవయ్య పార్కులో ‘విజరుూభవ వాక్‌థాన్’ నిర్వహించారు. క్యాబ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టివి9 సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

02/06/2017 - 02:16

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, నీట్ పరీక్షలకు ధీటుగా ఏప్రిల్ 12న మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటించింది. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్‌గా ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ కమిటీ మోడల్ సెట్ నిర్వహిస్తోందని తెలిపింది.

02/05/2017 - 07:08

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సాలీనా వచ్చే కేంద్ర పన్నుల ఆదాయంలో వాటా పెరిగింది. 2017-18 సంవత్సరానికి ప్రస్తుత ఏడాది కంటే రూ. 1700 కోట్లను అదనంగా కేంద్రం కేటాయించింది. కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, కేంద్రం ప్రకటించిన పథకాల అమలుకు, 14వ ఆర్థిక సంఘం నిధులు, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్లు, విపత్తుల నిర్వహణ నిధి కింద రాష్ట్రాలకు నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తారు.

02/05/2017 - 07:08

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఈ ఏడాది వేసవిలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల కోసం ఆందోళన అవసరం లేదు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జల మట్టం బాగా మెరుగుపడింది. ఈ ఏడాది అతి వర్షపాతం ప్రభావం వల్ల భూగర్భ జల మట్టం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి లెక్కిస్తే ఈ ఏడాది జనవరి నాటికి 4.11 మీటర్ల భూగర్భ జల మట్టం వృద్ధి చెందిందని తేలింది.

Pages