S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/08/2017 - 03:19

హైదరాబాద్, ఫిబ్రవరి 7: గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్ అనుచరులపై రాచకొండ పోలీసులు పిడి యాక్టు పెట్టారు. గతంలోనే ఇద్దరిపై పిడి యాక్ట్ పెట్టిన తాము తాజాగా మంగళవారం మరో ఐదుగురు నరుూం అనుచరులపై పిడియాక్టు నమోదు చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు.

02/08/2017 - 03:18

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర స్థానికత కలిగిన విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సంఘం (జెఎసి) పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జెఎసి కన్వీనర్ ఎన్. గిరిధర్ తెలిపారు.

02/08/2017 - 03:15

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్టర్రాజధానిలోని ‘నీలోఫర్’ ఆసుపత్రిలో నిత్యం పిల్లల ఏడ్పులు, తల్లిదండ్రుల ఆందోళన, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది హడావుడి కనిపిస్తుంది. వివిధ కారణాల వల్ల సాధారణ ప్రసవానికి అవకాశం లేని గర్భిణీలను ఇక్కడకు తీసుకువచ్చే సమయాల్లో చాలా హడావుడి ఉంటుంది. అలాగే తీవ్రమైన అస్వస్థతకు గురైన చిన్నారులు 24 గంటల పాటూ వస్తూనే ఉంటారు.

02/08/2017 - 03:14

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్, క్షయ, గుండె వ్యాధులను ఎదుర్కొనేందుకు ఔషధాలు తయారు చేసే సంస్ధలతో కలిసి పని చేస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రపంచ ఫార్యాస్యూటికల్స్ చైర్మన్ పాల్ స్టొఫెల్స్ అన్నారు. 50 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు మంగళవారం రెండో రోజూ అనేక వ్యాధులు, ఔషధాల తయారీపై సుదీర్ఘంగా చర్చించారు.

02/08/2017 - 02:03

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7: పేదల తిరుపతిగా పుణ్యక్షేతంగ్రా ప్రసిద్ధికెక్కిన మన్యకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపు కన్నుల పండువగా నిర్వహించారు.

02/08/2017 - 02:02

హైదరాబాద్, ఫిబ్రవరి 7: వచ్చే విద్యాసంవత్సరం (2017 జూన్) నుంచి రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేయనున్న 119 బిసి గురుకుల పాఠశాలలకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒకటి చొప్పున వీటిని మంజురు చేసినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయబోయే గురుకుల పాఠశాలలకు ఎంపిక చేసిన మండల కేంద్రాలు, గ్రామాల పేర్లతో జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

02/08/2017 - 02:01

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఎస్టీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని వామపక్షాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్-ప్లాన్ చట్టం పేరు మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4న ప్రకటించడంతో మంగళవారం సిపిఎం రాష్ట్ర ఇన్‌చార్జి జి. నాగయ్య అధ్యక్షతన మఖ్దూం భవన్‌లో తొమ్మిది వామపక్షాల నాయకులు సమావేశమై చర్చించారు.

02/07/2017 - 04:44

హైదరాబాద్, ఫిబ్రవరి 6: సామాజిక మాధ్యమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత సమాచార విప్లవాన్ని తీసుకువచ్చిందో, అంతే వేగంగా యువతకు శాపంగా మారుతోంది. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. దుష్పరిణామాలూ అంతే ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇటీవల వెలుగుచూస్తున్న కొన్ని సంఘటనలు, ఫేస్‌బుక్‌లో అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ స్నేహం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తున్నాయో వెల్లడిస్తున్నాయి.

02/07/2017 - 04:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్ర బిజెపి సూచన మేరకు రద్దు చేయటం సిగ్గు చేటని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షనేత జితేందర్ రెడ్డి విమర్శించారు.

02/07/2017 - 04:42

హైదరాబాద్, ఫిబ్రవరి 6: గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను పెంచే దిశగా మహిళా సంఘాలకు డిజిటల్ అక్షరాస్యత కల్పించే దిశగా పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. పంచాయితీరాజ్ శాఖ కార్యాలయంలో మంత్రి కృష్ణారావును గూగుల్ ప్రతినిధులు కలిశారు. మహిళా సంఘాలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Pages