S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/24/2016 - 04:20

బోధన్, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా నిజాం సుగర్స్ కర్మాగారాలను కాపాడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. చక్కెర కర్మాగారాల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మిక, కర్షక వర్గాల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు.

10/24/2016 - 04:18

చొప్పదండి/రామడుగు, అక్టోబర్ 23: ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తుంటే, ఉద్యమం పేరిట టిజెఎసి చైర్మన్ కోదండరాం కాంగ్రెస్, టిడిపిలకు తొత్తుగా మారి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా దుయ్యబట్టారు.

10/24/2016 - 04:16

మెదక్ రూరల్, అక్టోబర్ 23: మెదక్ జిల్లా హవేళీఘణాపూర్ మండల పరిధిలోని శాలిపేట శివారులో ఆదివారం సాయంత్రం వరిపంట వద్దకు వెళ్లిన రైతు యెల్ల పెద్ద ఎల్లయ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తొడకు, చేతికి గాయాలు కావడంతో సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సలు నిర్వహిస్తున్నారు.

10/24/2016 - 04:14

సూర్యాపేట, అక్టోబర్ 23: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువకుడు పెళ్లేయిన రెండు నెలలకే భార్యను హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. మహారాష్టల్రోని ఔరాంగబాద్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన గంపల లాజర్ సుజాత దంపతులకు ఐదుగురు కుమార్తెలు.

10/24/2016 - 04:10

నిజామాబాద్, అక్టోబర్ 23: సినీ హీరో ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో అతని అభిమాని ఒకరు విద్యుదా ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం నిజామాబాద్‌లో జరిగింది. ద్వారకానగర్‌కు చెందిన ప్రశాంత్(17) ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.

10/24/2016 - 04:08

జగిత్యాల, అక్టోబర్ 23: జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన మట్కం గంగారాం అనే వ్యక్తిపై ఆదివారం ఎలుగుబంటి దాడి చేసింది. ఈ సంఘటనలో గంగారం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అసుపత్రికి తరలించగా ప్రాణపాయస్థితి నుండి బయటపడ్డాడు.

10/24/2016 - 04:06

వరంగల్, అక్టోబర్ 23: భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కావటంతో అక్కడి ప్రజల్లో ఏర్పడిన సంతోషం క్రమక్రమంగా ఆవిరవుతోంది. కారణం.. జిల్లాకేంద్రంలో ధరలు విచ్చలవిడిగా పెరిగిపోవటమే. ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటగా, హోటళ్లలో తినుబండారాలు రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

10/24/2016 - 04:05

న్యూఢిల్లీ,అక్టోబరు 23: ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో ఏర్పడ్డ కొత్త జిల్లాల వలన కలిగే లాభాల పరంపర మొదలైందని తెరాస ఎంపి వినోద్‌కుమార్ అన్నారు. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలలో జిల్లాకొకటి చొప్పున కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు జరగనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.

10/24/2016 - 04:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకే తెరాస సర్కారు జిల్లాల విభజన చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు.

10/24/2016 - 04:03

బీబీనగర్, అక్టోబర్ 23: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ శివారులో గల మధుపాల ఎస్టేట్ సమీపంలో చిన్ననీటివాగు గంగిరేనిగుండ్ల వద్ద ఈతకని వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

Pages