S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/09/2016 - 05:33

హైదరాబాద్, అక్టోబర్ 8: ఆస్ట్రేలియాలో సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగింది. సిడ్నీ నగరం బతుకమ్మ ఆటపాటలతో పులకించింది. ఈ వేడుకలను ఆ ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా వెళ్లారు. ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల వారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

10/09/2016 - 05:32

బాసర, అక్టోబర్ 8: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర అమ్మవారి సన్నిధిలో శనివారం అక్షరనీరాజనం ఏర్పడింది. శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు కాలరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూల నక్షత్రం సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను జరిపించేందుకు భక్తులు పోటెత్తారు.

10/09/2016 - 05:32

వరంగల్, అక్టోబర్ 8: వరంగల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినా ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధ్దృతం అవుతోంది. ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క, అఖిలపక్ష నాయకులు పురుగుల మందు చేతబూని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

10/09/2016 - 05:31

వరంగల్, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత పెద్దనగరమైన వరంగల్‌లో మహిళల సంప్రదాయ పండుగ సద్దుల బతుకమ్మ శనివారం సంబరంగా, కోలాహలంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచే కొత్తబట్టలు, నగలు ధరించిన మహిళలు సద్దుల బతుకమ్మ ఆడేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలటం ప్రారంభించారు.

10/09/2016 - 05:31

హైదరాబాద్, అక్టోబర్ 8: రాష్ట్రంలో దసరా పండుగ నాటికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తొందరపడకుండా అఖిలపక్షంతో చర్చించాక దీపావళి పండుగకు కొత్త జిల్లాలను ప్రారంభించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు.

10/09/2016 - 05:30

పెబ్బేరు, అక్టోబర్ 8: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై కలెక్టర్ వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో జిల్లా కలెక్టర్ టి.కె శ్రీదేవి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కలెక్టర్ సురక్షితంగా బయటపడినా, ఆమె ప్రయాణిస్తున్న వా హనం దెబ్బతింది. ఎస్‌ఐ ఓ.డి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం...

10/09/2016 - 05:30

వరంగల్, అక్టోబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొక్కుకున్నట్లుగానే వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం బహూకరించనున్నారు. దాదాపు 3.60 కోట్ల రూపాయలతో 11 కిలోల బంగారంతో తయారు చేయించిన ఈ కిరీటాన్ని అమ్మవారికి బహూకరించనున్నారు. ఈమేరకు ఆదివారం సిఎం కెసిఆర్ సతీసమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకోనున్నారు.

10/09/2016 - 05:29

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగడంతో రవాణశాఖలో సిబ్బంది కొరత తలెత్తింది. కొత్త జిల్లాల్లో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. రాష్ట్రంలో ఎక్కడాలేని రద్దీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉంది. స్లాట్ బుకింగ్ కోసం వారం, పది రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసినా కౌంటర్‌ల వద్దకు వచ్చే వారికి పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

10/09/2016 - 05:29

వరంగల్ (కల్చరల్), అక్టోబర్ 8: వరంగల్ నగరంలోని ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయ క్షేత్రంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం 4 గంటలకు చతుస్థానార్చన, ఉషఃకాల పూజ లు చే సారు. అనంతరం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

10/09/2016 - 04:26

భద్రాచలం, అక్టోబర్ 8: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవుపల్లి అడవుల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ ఎస్పీ కెఎల్ ధృవ్ తెలిపిన వివరాల ప్రకారం ఆవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుబాయ్‌గూడ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో డిఆర్‌జి, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

Pages