S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/10/2018 - 05:38

హైదరాబాద్, జూన్ 9: ఐఐటి అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు వెలువడనున్నాయి. గత నెలలో జరిగిన మెయిన్స్ పరీక్షలకు 11,35,084 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో అడ్వాన్స్ పరీక్షలకు 2,31,024 మంది అర్హత సాధించారు. అందులో ఒబిసి 65,313 మంది, ఎస్సీ 34425 మంది, ఎస్టీ 17256 మంది, పిడబ్ల్యుడి 2755 మంది హాజరయ్యారు.

06/10/2018 - 05:38

హైదరాబాద్, జూన్ 9: వివాదాల మధ్య సింగరేణిలో బదిలీల వర్కర్ల నియామక పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. ఒకవైపు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు, మరోవైపు సింగరేణి అధికారులు పరీక్షలు జరుపుతామన్న ప్రకటన అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేసింది. ఆదివారం ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

06/10/2018 - 05:37

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్రంలోని వివిధ డెయిరీలకు పాలను సరఫరా చేస్తున్న పాడి రైతులకు రూ.800 కోట్లతో 50శాతం సబ్సిడీపై పాడిగేదెలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణలతో కలిసి మంత్రి మాట్లాడారు.

06/10/2018 - 05:36

హైదరాబాద్, జూన్ 9: ప్రజలంతా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవరించి, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్టవ్రైపు వెళ్లాయి. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రుతుపవనాల మూలంగా వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించినప్పటికీ, తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించలేదు.

06/10/2018 - 05:35

హైదరాబాద్, జూన్ 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ న్యాయవ్యవస్థలో మార్పులు లేకపోవడం దురదృష్టకరమని జాతీయ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు, జస్టిస్ రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మనం పాటిస్తున్నందున కేసుల తీర్పులు ఆలస్యం అవుతున్నాయని, దీనికి ప్రధాన కారణం చట్టాల్లో ఉన్న లొసుగులేనని ఆయన ఉద్ఘాటించారు.

06/09/2018 - 05:28

హైదరాబాద్, జూన్ 8: దేశంలో సిఎంఎలకు బృహత్తరమైన అవకాశాలు ఏర్పడ్డాయని, దేశంలో ఆర్ధిక వ్యవహారాలపై నిఘా పెరిగిన కొద్దీ సిఎంఎల అవసరం పెరిగిందని ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్టు అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (సీఎంఎ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్త పేర్కొన్నారు.

06/09/2018 - 05:27

హైదరాబాద్, జూన్ 8:జాతీయ స్థాయిలో వృత్తి సాంకేతిక విద్యా సంస్థలను పర్యవేక్షించేందుకు ఏకీకృత జాతీయ మండలిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పట్లో సఫలీకృతం అయ్యేలా లేదు. ప్రధానంగా యూజీసీ, ఎఐసిటిఇలను కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

06/09/2018 - 05:27

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సులో తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం నాడు పూర్తయింది. ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులను ఆఫర్ చేస్తున్న 267 కాలేజీల్లో 67,325 సీట్లు ఉండగా, వాటిలో 52,774 సీట్లు భర్తీ అయ్యాయి. 14,551 సీట్లు మిగిలిపోయాయి. 14 యూనివర్శిటీ , 67 ప్రైవేటు కాలేజీల్లో నూరు శాతం అడ్మిషన్లు జరగ్గా, ఒక కాలేజీలో సున్నా అడ్మిషన్లు జరిగాయి.

06/09/2018 - 05:26

హైదరాబాద్, జూన్ 8: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరితే భయపెడతారా అని సీఎల్పి ఉపనేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అండగా ఉన్న ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ వచ్చిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ఇచ్చిన హామీని కేసీ ఆర్ మరిచారని దుయ్యబట్టారు.

06/09/2018 - 05:25

హైదరాబాద్, జూన్ 8: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట గవర్నర్ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో సిఎం కేసీఆర్ ఆయన్ను కలిసి అక్కడి విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం.

Pages